జీప్ కంపాస్ ఓనర్ల జాబితాలోకి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

Written By:

జీప్ ఇండియా గత ఏడాది విపణిలోకి విడుదల చేసిన కంపాస్ మిడ్ సైజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సాధారణ కస్టమర్ల నుండి బాలీవుడు సెలబ్రిటీల వరకు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

ధర పరంగా సినీ తారలకు ఏ మాత్రం సరితూగని జీప్ కంపాస్‌ను ఎక్కువగా స్టేటస్ కోసం కొంటున్నారంటే నమ్మండి. తాజాగా, జీప్ కంపాస్ ఓనర్ల జాబితాలోకి బాలీవుడ్ స్టార్ యాక్షన్ యాక్టర్ అక్షయ్ కుమార్ చేరారు.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

అక్షయ్ కార్ల జాబితాలో ఇదే ఇప్పటికే కొన్ని లగ్జరీ ఎస్‌యూవీలు ఉన్నాయి. అందులో, పోర్షే కయీన్, రేంజ్ రోవర్ మరియు హోండా సిఆర్-వి వంటి మోడళ్లు ఉన్నాయి. హౌస్‌ఫుల్, ఎయిర్‌లిఫ్ట్ మరియు జాలీ ఎల్ఎల్‌బి2 వంటి యాక్షన్ చిత్రాల్లో నటించిన అక్షయ్ కుమార్ తాజాగా జీప్ కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

మార్కెట్ జిమ్మిక్కుల్లో భాగంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి జీప్ కంపెనీ అక్షయ్ కుమార్‌కు ఈ ఎస్‌యూవీని ఉచితంగా ఇచ్చి, కొనుగోలు చేశాడనే వార్తలను క్రియేట్ చేసిందని మీరు భావిస్తే, మా సమాధానం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే, అక్షయ్ కుమార్‌కు ఈ ఎస్‌యూవీ బాగా నచ్చడంతో తన సొంత నిర్ణయం మేరకు కంపాస్‌ను ఎంచుకున్నాడు.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

అక్షయ్ కుమార్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు జీప్ కంపాస్ ఎస్‌‌యూవీని కొనుగోలు చేశారు. బాలీవుడు సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జీప్ కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసి, దానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. సైఫ్ అలీఖాన్ కూడా జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి టాప్ ఎండ్ వేరియంట్ కొనుగోలు చేశాడు.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

అక్షయ్ కుమార్ ఎంచుకున్న జీప్ కంపాస్ వేరియంట్ వివరాలు ఖచ్చితంగా తెలియరాలేదు. అయితే, పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

జీప్ కంపాస్ డిజైన్, ఇంజన్, ట్రాన్స్‌మిషన్, స్పెసిఫికేషన్స్, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లతో పాటు, డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేకంగా టెస్ట్ డ్రైవ్ చేసిన జీప్ కంపాస్ అనుభవాలను రివ్యూ కథనం ద్వారా పాటు పూర్తి వివరాలను తెలుసుకోండి.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బాలీవుడ్ తారలకు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి లగ్జరీ కార్లంటే అమితమైన ప్రేమ. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి సెలబ్రిటీ వద్ద ఎన్నో కొన్ని కార్లు తమకు నచ్చిన శైలిలో ఉంటాయి. తాజాగా, అక్షయ్ కుమార్ తన అభిరుచికి తగ్గట్లుగా కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. దీంతో కంపాస్ బ్రాండ్ విలువ పెరగడమే కాకుండా, ఎంతో మంది కస్టమర్లు గర్వంగా ఫీలవుతారు. దీనికితోడు కంపెనీ సేల్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి. సెలబ్రటీలు కార్లు కొనడం ఒక రకంగా ఆయా కంపెనీలకు పరోక్ష ప్రచారమనే చెప్పాలి.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఖాతాలో జీప్ కంపాస్

1.పవన్, చిరుల కార్ కలెక్షన్!!

2.భర్తకు భలే కానుకిచ్చిన జెనీలియా

3.ఆ డ్రైవర్ నెలసరి వేతనం 2 లక్షల రుపాయలు!!

4. తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడు

5.ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

English summary
Read In Telugu: Bollywood Star Akshay Kumar’s New Ride Is A Jeep Compass SUV

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark