జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ: ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో దుమారం!

Written By:

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ జీప్ ఇండియన్ మార్కెట్లోకి గత ఏడాది అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ వంటి ఖరీదైన ఎస్‌యూవీలను విడుదల చేసిన జీప్, ఇప్పుడు తక్కువ ధరల శ్రేణిలో కంపాస్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసింది.

అయితే జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి, దీని సామర్థ్యాలను, అనుకూలతలు మరియు ప్రతికూలతలను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ తెలుగుకు ఇచ్చింది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ ఇండియా విభాగం కంపాస్ ఎస్‌యూవీని ఆగష్టు 2017 ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే మార్కెట్లో దీని మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రూ. 50,000 ల ప్రారంభ ధరతో బుకింగ్స్ ప్రారంభిస్తే భారీ సంఖ్యలో బుకింగ్స్ నమోదవుతున్నాయి. అయితే అందరి అంచనాలకు తగినవిధంగా కంపాస్ ఉందా...? విపణిలో ఉన్న ఇతర ఎస్‌యూవీలకు గట్టి పోటీవ్వనుందా..? చూద్దాం రండి...

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ కంపాస్ చూడగానే గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ యొక్క చిన్న వర్షన్ అని చెప్పవచ్చు. సింపుల్ డిజైన్ లక్షణాలతో ఉన్నప్పటికీ ఎస్‌యూవీ అంటే ఇలానే ఉండాలనే భావనను కలిగిస్తుంది. భారీ డిజైన్ లక్షణాలను కలిగి ఉన్న హ్యుందాయ్ టక్సన్‌తో పోల్చుకుంటే, కంపాస్ ఎస్‌యూవీ సింపుల్‌గా ఉందని చెప్పవచ్చు.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కంపాస్ ఫ్రంట్ డిజైన్‌లో ముందువైపున ఉబ్బెత్తుగా ఉండి, కార్నర్‌లో మలచబడిన క్లామ్‌షెల్ బ్యానెట్ కలదు. క్లామ్‌షెల్ బానెట్‌కు క్రిందుగా మృదువైన ఇకానిక్ సెవెన్ స్లాట్ జీప్ గ్రిల్ కలదు. ప్రతి స్లాట్ కూడా బ్లాక్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లతో ఉండటాన్ని గుర్తించవచ్చు.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మధ్యలో పొడవుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్‌కు అనుసంధానంగా చిన్న పరిమాణంలో ఉన్న ఐరన్ మ్యాన్ ప్రేరిత ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వీటిలోనే డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇంజన్ కూల్ అవ్వడానికి ఫ్రంట్ బంపర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న విశాలమైన ఎయిర్ ఇంటేకర్ కలదు, బంపర్‌లోనే ఇరు వైపులా కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రక్క వైపు డిజైన్ విషయానికి వస్తే, ఆడంబరమైన అనవసరపు డిజైన్ లక్షణాలకు ఇందులో చోటివ్వలేదని తెలిసింది. విభిన్న డిజైన్‌లో వీల్ ఆర్చెస్, 16-అంగుళాల చక్రాలు, వాటికి ఫైర్‌స్టోన్ టైర్లను అందించింది జీప్ (ఫైర్ స్టోన్ టైర్లు జీప్ కంపాస్ ద్వారా తొలిసారిగా ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి).

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

బ్లాక్ కలర్ రూఫ్‌కు క్రింది భాగంలో ముందు నుండి వెనుక వరకు బాడీ మొత్తాన్ని వేరు చేస్తున్న క్రోమ్ పట్టీని గమనించవచ్చు. వెహికల్ చుట్టూ ఇలాగే ఉంటుంది. బ్లాక్ రూఫ్ మరియు బ్లూ కలర్‌లో ఉన్న బాడీని వేరు చేసే క్రోమ్ స్ట్రిప్ ఈ మూడు రంగుల సమ్మేళనం ఎంతో బాగుంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

రియర్ డిజైన్‌లో స్వల్ప వాలుతో ఉన్న రూఫ్ రెయిల్ కంపాస్ ఎస్‌యూవీ మొత్తం డిజైన్‌కు చక్కటి రూపాన్నిచ్చింది. వెనుక వైపు డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చిన జీప్ 3డీ-ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్:

సరికొత్త కంపాస్ ఇంటీరియర్ అనేక సొబగుల కలయిక అని చెప్పాలి. సీట్లు మరియు ఆర్మ్ రెస్ట్‌లతో పాటు వీలైనన్ని ప్రదేశాల్లో స్కై గ్రే కలర్ (గ్రే కన్నా తెల్లగా ఉంటుంది) మరియు డ్యూయల్ టోన్ థీమ్ ప్రధానాకర్షణాగా ఉంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన అనుభవాన్నిచ్చే స్కై గ్రే కలర్ లెథర్ సీట్లను, స్పోర్ట్స్ రెడ్ కాంట్రాస్ట్ కలర్‌ స్ట్రిచ్చింగ్ గమనించవచ్చు. అయితే వీటిని శుభ్రంగా ఉంచుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

వెనుక వరుస సీటింగ్ అన్ని రకాల ఎత్తున్న ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అసౌకర్యానికి గురికాకుండా తల, మోకాలు మరియు కాళ్లు వంటి చుట్టుప్రక్కల అత్యుత్తమ స్పేస్ ఉండేలా కంపాస్ క్యాబిన్‌ను తీర్చిదిద్దింది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ మీద నలుపు రంగులో ఉన్న స్టీరింగ్ మౌంట్ బటన్స్ కలవు, స్టీరింగ్ స్పోక్స్ మీద అనేక క్రోమ్ అలంకరణలు గుర్తించవచ్చు. ఎలాంటి ఉపయోగం లేకుండా అలంకరణ ప్రాయంగా క్రోమ్ స్ట్రిప్స్ ఉండటం ద్వారా డ్రైవర్ దృష్టి స్టీరింగ్ మీదకు మళ్లుతూ ఉంటుంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

సౌండ్ మరియు ఛానెల్స్ మార్చుకునేందుకు బటన్లను స్టీరింగ్‌కు వెనుకవైపున అదివ్వడం జరిగింది. ఇది తెలిసిన వారికి మినహాయిస్తే, అక్కడ బటన్స్ ఉంటాయన్న విషయం రహస్యంగానే ఉంటుంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

స్పీడో మీటర్ మరియు టాకో మీటర్ మధ్యలో ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే కలదు, డ్రైవర్‌ పూర్తి సమాచారాన్ని ఎనిమిది విభిన్న రకాల స్క్రీన్ ఆప్షన్స్ గల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే నుండి తెలుసుకోగలడు.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫీచర్లు:

ఇంటీరియర్ ఫీచర్లలో ఇండియన్స్ ఎక్కువగా మెచ్చేది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. అంతర్జాతీయ విపణిలో టాప్ ఎండ్ వేరియంట్ కంపాస్ ఎస్‌యూవీలో ఉన్న 8.4-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్ తరహాలో కాకుండా ఇండియన్ వేరియంట్లో 7 అంగుళాల పరిమాణం ఉన్న దానిని అందించింది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

7-ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ల్పేలో జిపిఎస్ న్యావిగేషన్ ఫీచర్ లేదు. అయితే ఇందులో ఇన్‌బిల్ట్ కంపాస్(దిక్సూచి)ను అందించింది. అదే విధంగా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అప్లికేషన్స్ ఉన్నాయి.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇండియన్ మోడల్ జీప్ కంపాస్‌లో డ్యూయల్ జోన్ ఎయిర్ కండీషనింగ్, పుష్ బటన్ స్టార్ట్, కీ లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్‌గా ముడుచుకునే అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి. వీటికి తోడు గేర్‌రాడ్‌కు సమీపంలో డయల్ ఆధారంతో కంట్రోల్ చేసే ఆల్ వీల్ డ్రైవ్ కలదు. దీనికి ప్రక్కనే వివిధ రకాల డ్రైవింగ్ మోడ్స్‌ను గుర్తించే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇండియా స్పెక్ కంపాస్‌లో డిక్కీని ఆటోమేటిక్ యాక్సెస్ చేసే ఫీచర్ అందివ్వడం కలగానే మిగిలిపోయింది. డిక్కీ స్పేస్ 408-లీటర్లు మాత్రమే ఉంది. దీనికి పోటీగా ఉన్న టక్సన్ ఎస్‌యీవీలో 513-లీటర్ల స్పేస్ కలదు.

అంతర్జాతీయ విపణిలోని ఎస్‌యూవీలో అందించిన కొన్ని ప్రధాన ఫీచర్లు ఇండియన్ స్పెక్ మోడల్‌లో మిస్సయ్యాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ మరియు వైపర్స్ అదే విధంగా ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి ఇందులో రాలేదు.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

సేఫ్టీ ఫీచర్లు:

అయితే భద్రత ఫీచర్ల విషయంలో నిరుత్సాహపరచలేదు. కంపాస్ ఎస్‌యూవీలో, ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ప్యానిక్ బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రిఫిల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు హైడ్రాలిక్ బూస్టర్ ఫెయిల్యూర్ కంపెన్సేషన్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంజన్ వివరాలు:

మేము టెస్ట్ నిర్వహించిన జీప్ కంపాస్‌లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనికి తోడు, 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో విడుదలయ్యే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

రైడింగ్ క్వాలిటీ మరియి హ్యాండ్లింగ్ కంపాస్‌లో గుర్తించిన ప్రదాన అంశం. ఎగుడుదిగుడు రహదారుల మీద అత్యుత్తమ సస్పెన్షన్ కోసం ముందువైపున కోని, మెక్‌పర్సన్ స్ట్రట్స్ మరియు వెనుక వైపున ఛాప్‌మ్యాన్ లింక్ సెటప్ అందించారు.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కంఫర్ట్ మరియు హ్యాండ్లింగ్ పరంగా కంపాస్‌ను బ్రిలియంట్‌గా తీర్చిందిద్దారు. ఎగుడుదిగుడు తలాల మీద మరియు గుంతలమయైన రోడ్ల మీద సులభంగా అధిగమించినప్పటికీ, కొన్ని వేగాల వద్ద తారు రోడ్డు మీద ఉన్న మలుపులను అధిగమించడంలో కంపాస్‌కు కాస్త తక్కువ మార్కులే వచ్చాయి. కానీ బాడీ రోలింగ్ మొత్తం కంట్రోల్‌లోనే ఉంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆఫ్ రోడ్ మీద వివిధ భూబాగాల మీద జీప్ కంపాస్ సునాయాసంగా పరుగులందుకుంటుంది. కానీ ఆఫ్ రోడింగ్ చేసినంతసేపు స్టీరింగ్ ఫీల్ పొందలేము. ఆఫ్ రోడ్ మీదకు చేరుకోగాని కంపాస్‌లోని జీప్ ఆక్టివ్ డ్రైవ్ 4X4 సిస్టమ్ కేవలం సెకన్ల వ్యవధిలోనే ఆక్టివేట్ అయ్యి, రియర్ వీల్‌కు పవర్ సరఫరా చేస్తుంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

17-డిగ్రీలతో ఏటవాలు ఎత్తుగా ఉన్న తలం మీద మరియు 32-డిగ్రీలతో క్రిందకు ఏటవాలుగా ఉన్న తలం మీద జీప్ కంపాస్ పరీక్షించాము. కంపాస్ ముందువైపు ప్రంట్ బంపర్ రోడ్డుకు తగలకుండా వివేకవంతంగా డిజైన్ చేసిన తీరు స్పష్టమయ్యింది. నీటిలో 480ఎమ్ఎమ్ లోతు వరకు కంపాస్ వెళ్లగలదు.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ కంపాస్‌లో నాలుగు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఆటో, స్నో, శాండ్ మరియు మడ్. వీటికి తోడు 4వీల్ డ్రైవ్ లాక్ బటన్ కూడా ఉంది. ఆటో డ్రైవింగ్ మోడ్‌లో అన్ని రకాల హార్డ్‌వర్క్ చేయగలదు కంపాస్. ఇవి కాకుండా స్నో, శాండ్ మరియు మడ్ వంటి వివిభ భూబాగాలలో అద్బుతమైన పనితీరును ప్రదర్శించింది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రకృతి సహజ సిద్దం ఏర్పడిన దాదాపు అన్ని భూబాగాల మీద సవాళ్లను స్వీకరించింది జీప్ కంపాస్. అడవుల్లోని సహజ సిద్దంగా ఏర్పడిన వాగులను కూడా చేధించింది. హిల్ డిసెంట్ కంట్రోల్ ఫీచర్ లేకపోయినప్పటికీ లోతట్టు తలం మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించింది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ సంస్థ తయారుచేసే ఉత్పత్తుల ఆఫ్ రోడింగ్ లక్షణాలు ఇందులో యథావిధిగా వచ్చాయి. ప్రస్తుతం విపణిలో ఈ శ్రేణిలో ఉన్న ఇతర ఎస్‌యూవీలతో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంటుంది. అయితే ఇండియన్‌ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ధరలు నిర్ణయిస్తే, దేశీయంగా కంపాస్ ఓ వెలుగు వెలగడం ఖాయం.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

జీప్ కంపాస్ గురించి

పరీక్షించిన వేరియంట్: జీప్ కంపాస్ లిమిటెడ్(ఒ) డీజల్

ధర అంచనా: 17 నుండి 25 లక్షల మధ్య

ఇంజన్: 2.0-లీటర్ మల్టీజెట్II డీజల్

గేర్‌బాక్స్: 6-స్పీడ్ మ్యాన్యువల్

ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి: 51-లీటర్లు

మైలేజ్(అంచనా): 11కిమీ/లీ (సిటి, హైవే మరియు ఆఫ్ రోడ్ కలుపుకొని)

ఫ్యూయల్ ట్యాంక్ రేంజ్: ఇంధన ట్యాంక్ పూర్తిగా నింపితే 600కిమీలు ప్రయాణించవచ్చు.

పవర్ మరియు టార్క్: 3750ఆర్‌పిఎమ్ వద్ద 170బిహెచ్‌పి/ 1750-2000ఆర్‌పిఎమ్ మధ్య 350ఎన్ఎమ్.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

తీర్పు

ఇంటీరియర్ స్పేస్, స్టైలింగ్ పరంగా, మరియు రోడ్డు మీద దీనికి లభించే ఆదరణ, ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునే లక్షణాలతో జీప్ ఆవిష్కరించిన కంపాస్ ఎస్‌యూవీ అత్యుత్తమం. ఇప్పటికే ప్రపంచ దేశాలల్లో దీనికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

జీప్ కంపాస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో కంపాస్ ఎస్‌యూవీని ఎంచుకునే వారి సంఖ్య బాగానే ఉంది. ఇప్పటికే పోటీగా ఉన్న ఎస్‌యూవీలకు ధీటుగా ధరలను నిర్ణయిస్తే, దేశీయ ఎస్‌యూవీల సెగ్మెంటల్లో కంపాస్ సునామీ సృష్టించడం గ్యారంటీ.

మా ఈ జీప్ కంపాస్ ఎస్‌యూవీ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కథనంపై మీ అభిప్రాయం తెలియజేయగలరు....

English summary
Read In Telugu: Jeep Compass Review Test Drive Report
Story first published: Saturday, July 1, 2017, 14:40 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more