హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోయిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి, వాటి గురించి ఇప్పటికే తెలుసుకున్నాము. అయితే తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో ఒక ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంచి మరణించినట్లు తెలిసింది.

Recommended Video

Ola Electric Scooter First Impressions In Telugu | S1Pro Model Range, Top Speed & Other Details

ఎలక్ట్రిక్ షోరూమ్‌లో ఈ ప్రమాదం జరగటానికి కారణం ఏమిటి అనే ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

నివేదికల ప్రకారం, గత సోమవారం (12 వ తేదీన) రాత్రి 10 గంటల సమయంలో ఎలక్ట్రిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పైన ఉన్న రెస్టారెంట్‌ వరకు వ్యాపించాయి. ఎక్కువ మంటలు మరియు పొగలు రావడంతో వెంటనే హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఎలక్ట్రిక్ షోరూమ్‌లో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్‌లను సాయంత్రం ఛార్జింగ్ మోడ్‌లో ఉంచడం వల్లే ఈ మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు భారీగా వ్యాపించడం వల్ల ఇందులో దాదాపు 25 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు, కాగా మరికొందరు కిటికీల్లో నుంచి బయటపడినట్లు కూడా తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది కూడా కొంతమందిని రక్షించారు.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

షార్ట్ సర్క్యూట్ వల్ల ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో మంటలు చెలరేగి, ఒకదాని తరువాత మరొకటి పెళ్లి ఉండవచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అయితే దీనికి ప్రధాన కారణం ఏమి అనేది తెలియాల్సి ఉంది. గాయపడినవారినందరినీ గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు కూడా సమాచారం.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

సికింద్రాబాద్‌ శివాజీనగర్‌లోని రూబీ ప్రైడ్‌ హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందులోని గ్రౌండ్ ఫ్లోర్ లో Gemopai ఎలక్ట్రిక్ షోరూమ్ ఉంది, దానిపైన నాలుగు అంతస్తులు హోటల్ నిర్వహిస్తున్నారు. కింద ఉన్న బైక్ షోరూమ్ లో మంటలు రావడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

ఎలక్ట్రిక్ స్కూటర్లలోని బ్యాటరీల నుంచి వెలువడిన విషపూరితమైన పొగ హోటల్ లోని దాదయో అన్ని గదులకు వ్యాపించి భవనం యొక్క మొదటి మరియు రెండవ అంతస్థులకు వ్యాపించడం వల్ల అక్కడ ఉన్న వారికి ఏమి తోచకపోవడంతో 8 మంది మృత్యువాత పడ్డారు.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

కింద ఉన్న షోరూమ్ లో 35 నుంచి 40 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తరువాత షోరూమ్ ఓనర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కావున పోలీసులు దీనిపైనా ఇంకా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. త్వరలో పోలీసులు దర్యాప్తు మొదలవుతుంది. దీనిపైన తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ కూడా స్పందించారు.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

సికింద్రాబాద్ లో జరిగిన ఈ ఘోరమైన అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులో మరణించినవారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అంతే కాకుండా ప్రమాదంలో గాయపడినవారికి రూ. 50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

ఈ ప్రమాదంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంభాలకు 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. త్వరలోనే దీనిపైనా విచారణ జరిపి కారణాలను కూడా తెలుసుకోవడానికి రవాణా మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నిస్తోంది. కావున త్వరలోనే ఈ ప్రమాదాలకు గల కారణాలు వెల్లడవుతాయి.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇందులో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. నిజానికి మన దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువగా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలను వినియోగిస్తున్నారు. కావున ఇవి మన దేశంలోని వాతావరణ పరిస్థితులకు సెట్ అయ్యే అవకాశం తక్కువ.

హైదరాబద్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

ఎందుకంటే భారతదేశం వంటి సమశీతోష్ణస్థితి కలిగిన దేశాల్లో ఇలాంటి బ్యాటరీలు ఎక్కువ మన్నిక కావున. కావున మనదేశంలో వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాలను తప్పకుండా ప్రత్యేకమైన బ్యాటరీలను ఉపయోగించాల్సి ఉంది. కావున ప్రభుత్వాలు కూడా దీనిపైనా చర్యలు తీసుకుంటున్నాయి. త్వరలోనే మనదేశంలో ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారుకానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఒకే సంఘటనలో 8 మంది మరణించడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైనా పూర్తిగా విచారణ జరపవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే, అంతే కాకూండా.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి.

Most Read Articles

English summary
Electric scooter fire accident in secunderabad eight people died details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X