MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

భారత మాజీ క్రికెటర్ మరియు వ్యాఖ్యాత (కామెంటేటర్) సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఇటీవల ఓ MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. తన ఫ్యామిలీ కోసం అతను ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. కాండీ వైట్ బాడీ కలర్ మరియు బ్లాక్ రూఫ్ తో కూడిన కొత్త MG Hector Plus 6 సీటర్ ఎస్‌యూవీతో డీలర్‌షిప్‌లో దిగిన ఫొటోను గవాస్కర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

అయితే, ఆయన ఇందులో ఏ వేరియంట్ కొనుగోలు చేసారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇది 6 సీటర్ కాబట్టి, బహుశా తాను కొనుగోలు చేసింది టాప్-ఎండ్ వేరియంట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. MG Hector Plus 6 సీటర్ ఎస్‌యూవీలో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో బెంచ్ సీట్ ఆప్షన్ ఉంటుంది.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

MG Hector Plus విషయానికి వస్తే, ఈ కారులోని టాప్-ఎండ్ వేరియంట్లో పానోరమిక్ సన్‌రూఫ్, 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, లెదర్ సీట్లు, 6 వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీటు, ఇన్ఫినిటీ సౌండ్ స్పీకర్‌లు, నాలుగు ఎయిర్‌బ్యాగులు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

అంతేకాకుండా, ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, 6 ఎయిర్‌బ్యాగులు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మరియు వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

MG Hector Plus ఎస్‌యూవీలో 5-సీటర్ MG Hector లో ఇంజన్ ఆప్షన్లనే ఉపయోగించారు. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 141 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఈ కారులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

ఇందులోని పెట్రోల్ ఇంజన్ లో తేలికపాటి హైబ్రిడ్ (మైల్డ్ హైబ్రిడ్) సెటప్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్లు 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. భారత మార్కెట్లో MG Hector Plus ఎస్‌యూవీని జనవరి 2021 లో విడుదల చేశారు. దేశీయ విపణిలో ఈ కారు ధరలు రూ. 13.49 లక్షల నుండి రూ. 18.54 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

భారత్‌లో MG Astor ఎస్‌యూవీ ఆవిష్కరణ

MG Motor బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా భారత మార్కెట్ కోసం మరొక సరికొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ MG ZS EV ఆధారంగా రూపొందించిన పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీ MG Astor ని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

దేశీయ మార్కెట్లో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పరిచయం మొట్టమొదటి కారు Astor అని కంపెనీ పేర్కొంది. ఈ కారును ప్రత్యేకమైన పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ టెక్నాలజీతో రూపొందించారు. ఇది భారత మార్కెట్లో MG Motor బ్రాండ్‌కి నాల్గవ మోడల్ కానుంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

MG Motor India దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న Hector ఎస్‌యూవీలో మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ MG Hector Shine పేరుతో ఈ కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధర రూ. 14.51 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దీనిని కొత్త మిడ్-స్పెక్ వేరియంట్ గా ప్రవేశపెట్టారు.

MG Hector Shine వేరియంట్‌ను కొత్త హవానా గ్రే అనే కలర్ ఆప్షన్‌లో పరిచయం చేశారు. ఈ వేరియంట్‌లో 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3.5 ఇంచ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, మాన్యువల్ ఏసి, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MG Hector Plus ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సునీల్ గవాస్కర్

ఇకపోతే, ఈ కొత్త వేరియంట్‌లో లభించే సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబిఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మారియు ఐస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Former cricketer sunil gavaskar buys mg hector plus suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X