లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఎంజి మోటార్ కంపెనీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. కంపెనీ ఇప్పటికే ఎంజి హెక్టర్, ఎంజి గ్లోస్టర్ వంటివి లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా వాహనాలలో కూడా అధునాత ఫీచర్స్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. కావున ఎంజి మోటార్ కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఇందులో భాగంగానే ఎంజి మోటార్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ అయిన ఎంజి ఆస్టర్ ని కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరిచయం చేసింది. భారతదేశంలో పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ఉన్న మొదటి కారు ఈ ఎంజి ఆస్టర్ అవుతుంది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కొత్త కారు కంపెనీ యొక్క నాల్గవ మోడల్ అవుతుంది. ఐతే కాకుండా ఈ కారులో జియో యొక్క ఎల్ఓటి సొల్యూషన్ ద్వారా ప్రారంభించిన ఐటి సిస్టం కలిగి ఉన్న కంపెనీ యొక్క మొదటి కారు కూడా ఈ కొత్త ఎంజి ఆస్టర్.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఈ కొత్త ఎస్‌యూవీలో, రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం ఈ-సిమ్ వంటి టెక్నాలజీని అందించింది. ఈ ఎస్‌యూవీ సాఫ్ట్‌వేర్ మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో సహా అనేక కొత్త సాంకేతికతలతో పరిచయం చేయబడింది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

కొత్త ఎంజి ఆస్టర్ లో అందుబాటులోకి రానున్న లేటెస్ట్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రత్యేకమైనది. ఇది క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చబడిన చిన్న రోబోట్. ఈ రోబోపై చిన్న స్క్రీన్ కూడా ఇవ్వబడింది. ఇది రోబోట్ యొక్క వ్యక్తీకరణను చూపుతుంది. ఇది వాయిస్ ద్వారా డ్రైవర్‌ను గుర్తిస్తుంది, అంతే కాకుండా వాయిస్ కమాండ్‌ల ఆధారంగా పనిచేస్తుంది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఇందులో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీపీడియా ఆధారంగా సమాచారం మరియు వార్తలను అందిస్తుంది, అదే సమయంలో లోపల కూర్చున్న వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిన స్టార్ డిజైన్ ఆఫ్ అమెరికా ద్వారా ఎంజి ఆస్టర్ యొక్క ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టం తయారు చేయబడింది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఎంజి అస్టర్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీని కూడా కంపెనీ ఉపయోగించింది. ఈ టెక్నాలజీని ఆటోమొబైల్ పరికరాల తయారీదారు బాష్ అభివృద్ధి చేశారు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనేది ఒక రాడార్ టెక్నాలజీ, ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్ ని కంపెనీ తన ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగిస్తోంది. ఇది కాకుండా, ఆస్టర్‌లో కంపెనీ అటానమస్ లెవెల్ 2 టెక్నాలజీని కూడా ఉపయోగించింది. ఇది ఇప్పటివరకు భారతీయ మార్కెట్‌లో ఏ ఇతర కారులోనూ లేదు. ఇది అధునాతన ఆటోమేటిక్ టెక్నాలజీ, ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారును కంట్రోల్ చేస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన ఫీచర్.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఈ టెక్నాలజీతో కంపెనీ తన కొత్త కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలీషియన్ వార్ణింగ్, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, రియర్ డ్రైవ్ అసిస్ట్, లేన్ ఫంక్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అనేక అధునాతన ఫీచర్లను అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహనదారునికి చాలా బాగా ఉపయోగపడతాయి.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఎంజి మోటార్ కంపెనీ 'ఆస్టర్' పేరుతో ఎంజి జెడ్ఎస్ పెట్రోల్ మోడల్‌ని విడుదల చేసింది. ఎంజి జెడ్ఎస్ ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడవుతోంది. పెట్రోల్ ఎస్‌యూవీలో తిన్ బంపర్‌లు, హానీ కూంబ్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఈ కొత్త ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

ఎంజి ఆస్టర్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాలం ఈ ఎస్‌యూవీలో కేవలం ఒక ఇంజిన్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇది 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఈ ఇంజిన్ 163 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఐతే కాకుండా ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఆస్టర్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఎంజి మోటార్; దీనికి సాటి మరొకటి లేదు

మారుతున్న కాలంతోపాటు మార్కెట్లో విడుదలవుతున్న వాహనాలు అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగిన ఫీచర్స్ పొందుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉన్న వాహనాల జాబితాలో ఎంజి మోటార్ యొక్క త్వరలో రానున్న కొత్త ఎంజి ఆస్టర్ ప్రధమ స్థానంలో ఉండనుంది.

Most Read Articles

English summary
All new mg astor suv unveiled features specifications engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X