తనకు కేటాయించిన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ స్థానంలోకి రేంజ్ రోవర్ తెచ్చుకున్న మోడీ ఎందుకో తెలుసా ?

Written By:

భారత ప్రధాన మంత్రి ఇది వరకు వినియోగించే సెడాన్ రకపు లగ్జరీ కారు స్థానంలోకి ఎస్‌యూవీ వాహనం వచ్చి చేరింది. ఆగష్టు 15 న జరిగిన 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసిన నరేంద్ర మోడీ తనకు కేటాయించిన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులో రావాల్సి ఉండగా, రేంజ్ రోవర్‌లో ఎర్రకోటను చేరుకుని ఆశ్చర్యపరిచాడు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

భారత ప్రధాన మంత్రిగా మే 2014 లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అన్ని విధాలా సురక్షితమైన మరియు భద్రత పరంగా మోడిఫికేషన్స్ నిర్వహించిన బిఎమ్‌‌డబ్ల్యూ 7-సిరీస్ కారును కేటాయించడం జరిగింది.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

భారత 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట వద్ద ప్రసంగించడానికి బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌లో రావాల్సిన మోడీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలో వచ్చి మీడియా మరియు భారత ప్రభుత్వాధికారులను సైతం ఆశ్చర్యపరిచారు.

ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా ప్రత్యేక భద్రతా బృందం ఆగష్టు 13 వ తేదీన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ మరియు ఇతర ప్రధాన కాన్వాయ్ ద్వారా రిహార్సల్స్ చేయించడం జరిగింది. అదే రోజున ఎర్ర కోట వరకు వచ్చిపోయేందుకు ముందస్తు మార్గాన్ని కూడా నిర్ణయించింది.

ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

ఓ ప్రభుత్వ అధికారి నుండి సమాచారం మేరకు, బహుశా ప్రధాన మంత్రి గారి భద్రత దృష్ట్యా కాన్వాయ్‌లోని బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ స్థానంలో రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కేటాయించి ఉండవచ్చని తెలిపాడు.

ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

మరికొందరి కథనం మేరకు, రేంజ్ రోవర్ ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆధీనంలో ఉంది. టాటా మోటార్స్ ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను కొనుగోలు చేసింది. కాబట్టి ఇండియన్ సంస్థ, ఇండియాలో తయారు చేసిన కారును వినియోగించాడని తెలుస్తోంది.

ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

గతంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా నరేంద్ర మోడీ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ అధికారిక కాన్వాయ్‌లో వచ్చారు.

ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

పంద్రాగష్టు వేడుకల్లో ప్రసంగం అనంతరం మోడీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ముందు సీటులో కూర్చుని కొంత దూరం ప్రయాణించాక, శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారుల దక్కరికివెళ్లి పలుకరించారు.

ప్రధాన మంత్రి అధికారిక వాహనాన్ని మార్చేసిన మోడీ

ప్రస్తుతం ప్రధాన మంత్రి ప్రత్యేక భద్రతా బృందం ఆయన కోసం విభిన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కాన్వాయ్‌లో సిద్దంగా ఉంచింది. అత్యవసర మరియు ప్రతికూల పరిస్థితులలో కేవలం ఒక్క వాహనం మీదే ఆధారపడకుండా ముందు జాగ్రత్తగా కొన్ని వాహనాలను ఏర్పాటు చేసుకుంది.

English summary
Read In Telugu: Indian Prime Minister Has Chosen Range Rover SUV on the Occasion of 71st
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark