ఫేస్ బుక్ వేదిక మీద ఎక్కువ మంది చదివిన డ్రైవ్ స్పార్క్ కథనాలు.

By Anil

మన దగ్గర గల సమాచారాన్ని అత్యంత వేగంగా వ్యాపింపచేసే సాధనం "ఫేస్‍‌బుక్". ఈ ఆధునిక ప్రంచంలో అత్యంత శక్తి వంతంగా మరియు వేగవంతంగా అందరికి సమాచారాన్ని చేర వేసే సాధనం సోషల్ మీడియా. ఇందులో ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు గూగుల్ ప్లస్ వంటి సామాజిక సాధనాలు భాగంగా ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ఫేస్‌బుక్ ను ఎక్కువ మంది వేదికగా చేసుకున్నారు.
మరింత తెలుసుకోండి: ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్

ఈ ఫేస్‌బుక్ సామాజిక వేదికలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ వారు ఎన్నో కథనాలను పోస్ట్ చేస్తూ వచ్చారు. అందులో ఫేస్‌బుక్ ప్రేమికులు ఎక్కువగా క్లిక్ చేసిన టాప్-10 కథనాల గురించి ఒక ప్రత్యేక కథనం మీకోసం.

10. యమహా ఆల్ఫా స్కూటర్ రీకాల్

10. యమహా ఆల్ఫా స్కూటర్ రీకాల్

2015 సంవత్సరంలో యమహా వారు భారీ సంఖ్యలో ఆల్ఫా స్కూటర్లను రీకాల్ చేశారు. ఇంజన్ లోని సిలిండర్ యొక్క ఒ రింగ్ సరిగా అమర్చకపోవడం ఇంజన్ ఆయిల్ లీక్ కారణం అయ్యింది. దీని కారణంగా ఆల్ఫా స్కూటర్లను రీకాల్ చేశారు.

09. మహీంద్రా గస్టో విడుదల

09. మహీంద్రా గస్టో విడుదల

మహీంద్రా వారు విడుదల చేసిన గస్టో స్కూటర్ గురించి ఎక్కువ మంది ఫేస్‌బుక్ ద్వారా చదివారు. మహీంద్రా స్కూటర్లలో గస్టో ఒక సంచలనం. ఇందులో సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం అందరినీ ఆకట్టుకుంది. మరియు ఇది ప్రస్తుతం దేశీయ స్కూటర్ల మార్కెట్లో ఉన్న హోండా ఆక్టివాకు గట్టి పోటిగా నిలిచింది.

08. దొంగ నోటు.... మంచి నోటు

08. దొంగ నోటు.... మంచి నోటు

ఒక సారి డ్రైవ్‌స్పార్క్ వారు గ్యాస్ ఇంధనాన్ని నింపిన సందర్భంలో ఒక దొంగ నోటు చేతులు మారింది. దీని గురించి అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటానికి అసలు నోటుకు, దొంగ నోటుకు మధ్య గల తేడాలను డ్రైవ్ స్పార్క ప్రత్యేక కథనం అందించింది. దీనిని కూడా ఎక్కువ మంది చదివారు.

07. ల్యాంబోర్గిని అతి పెద్ద హృదయం

07. ల్యాంబోర్గిని అతి పెద్ద హృదయం

15 సంవత్సరాల నిహాల్ ప్రొగేరియా అనే జబ్బుతో భాదపడుతున్నాడు, కాని ఇతనికి ల్యాంబోర్గిని కారు గురించి బారీగా తెలుసు. ఇతనికి ల్యాంబోర్గిని మీద ఉన్న మక్కువ గురించి తెలుసుకున్న బృందం ఇతని జన్మదిన వేడుకను ఎందో ఘనంగా నిర్విహించింది.

06. బైకు ఎలా రైడ్ చేయాలి ? టాప్-10 టిప్స్

06. బైకు ఎలా రైడ్ చేయాలి ? టాప్-10 టిప్స్

ఎంతో మంచి సమాచారం గల కథనం బైక్‌ను రైడ్ చేయడానికి అతి ముఖ్యమైన టాప్-10 టిప్స్( సలహాలు) ఇచ్చింది. నిజమైన ప్రపంచంలో ఇది ఉత్తమ బైక్ రైడర్లును తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

05. వాలెంటినో రోస్సికి బెంగళూరు యువకుల సంఘీబావం

05. వాలెంటినో రోస్సికి బెంగళూరు యువకుల సంఘీబావం

వాలంటినో రోస్సి ప్రముఖ మోటో జిపి రైడర్. ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానుల ఉన్నారు. 2015 లో జరిగిన మోటో జిపి ఛాంపియన్ షిప్ అనుకోకుండా చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు సౌత్ వారు అతను త్వరగా కోలుకోవాలని రైడింగ్ చేపట్టారు.

04. కార్ డిజైన్ కాపీ చట్టం

04. కార్ డిజైన్ కాపీ చట్టం

ప్రస్తుతం కాలంలో ఎన్నో కార్ల సంస్థలు వివిధ రకాల కొత్త డిజైన్ల కోసం వెంపర్లాడుతుండగా, కొన్ని సంస్థలు ముందుగానే రూపు దిద్దుకున్న కార్ల డిజైన్‌ను కాపీ కొట్టడం ప్రారంభించాయి. అయితే ఇది తప్పు అని దీనికి ఒక చట్టాన్ని ప్రవేశ పెట్టారు.

03. మహీంద్రా మోజో విడుదల

03. మహీంద్రా మోజో విడుదల

మహీంద్రా మోజో కు చెందిన విడుదల వివరాలు ఫేస్‌బుక్ ద్వారా ఎంతో మంది పఠించారు. మూడవ స్థానంలో ఉన్న ఈ కథనం మనకు తెలుపుతోంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఎంతగా ఈ మోజో బైకుని అభిమానిస్తున్నారో అని.

02.హోండా లివో విడుదల

02.హోండా లివో విడుదల

జపాన్‌కు చెందిన టూ వీలర్ల సంస్థ దీనిని విడుదల చేసేంత వరకు యావత్ దేశం ఎంతో మౌనంగా ఉంది. దీనిని విడుదల చేసిన తరువాత డ్రైవ్‌స్పార్క్ ఫేస్ బుక్‌లో విడుదల చేసిన "హోండా లివో విడుదల" కథనానికి విశేష ప్రజాదరణ లభించిది.

01. యమహా వారి టాప్-15 బెస్ట్ మోటార్ సైకిల్స్

01. యమహా వారి టాప్-15 బెస్ట్ మోటార్ సైకిల్స్

ఇక్కడ చదవడానికి పెద్దగా చరిత్ర ఏమి లేదు, కాని యమహా వారి మొదటి మోటార్ సైకిల్ నుండి ప్రస్తుతం ఉన్న యమహా వైజడ్‌ఎఫ్-ఆర్1 బైక్ వరకు గల 15 ప్రత్యేతమైన ద్విచక్ర వాహనాల గురించి ప్రత్యేకం కథనం అందివ్వడం జరిగింది. దీనికి కూడా ఫేస్‌‌బుక్ ఖాతాదారులు పెద్ద పీట వేశారు.

ఎక్కువ మంది చదివిన డ్రైవ్ స్పార్క్ కథనాలు.
  1. డ్రైవ్ స్పార్క్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్-10 కార్లు
  2. 2015లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్లు
  3. మీ జన్మ నక్షత్రానికి తగిన కారు ఏదో తెలుసా ?

Most Read Articles

English summary
DriveSpark Dispatch: Top 10 Most Engaging Facebook Posts
Story first published: Monday, December 28, 2015, 11:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X