డ్రైవ్ స్పార్క్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్-10 కార్లు: డ్రైవ్‌స్పార్క్ ప్రత్యేక సేకరణ

By Anil

ఈ ఆధునిక ప్రపంచంలో కొత్త కారు కొనడం ఎంతో సులభమైపోయింది. ఎందుకంటే వినియోగదారులు ఇప్పుడు చాలా చురుకుగా ఆలోచిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కారు కొనాలంటే షోరూమ్‌కి వెళ్లి వారికి కావాల్సిన కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే వారు. కాని ఇప్పుడు ప్రతి కారుకు చెందిన అన్ని వివరాలు ఇంటర్నెట్ ద్వారా తెలిసిపోతున్నాయి.

వినియోగదారుడు పలానా కారు కావాలనుకున్నపుడు, ఒక సారి ఆ కారు గురించి సెర్చ్ చేస్తే చాలు కారు యొక్క సాంకేతిక వివరాల నుండి ఆన్-రోడ్ ధర వరకు అన్ని కూడా తెలుసుకోవచ్చు. అచ్చం "డ్రైవ్‌స్పార్క్" లా.

2015 సంవత్సరం అంతమవుతున్న నేపథ్యంలో డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ ద్వారా ఎక్కువ మంది వెతికిన టాప్-10 కార్ల గురించి ప్రత్యేక కథనం....

10. మారుతి సుజుకి ఆల్టో 800

10. మారుతి సుజుకి ఆల్టో 800

మారుతి సుజుకి ఆల్టో 800 ఇది దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు మాత్రమే కాదు. ఎక్కువ మంది కూడా దీనికోసం సెర్చ్ చేశారు. ఇది ఇలా ఇంతగా పాపులారిటి పొందడానికి కారణం దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు.

09. మారుతి సుజుకి ఎర్టిగా

09. మారుతి సుజుకి ఎర్టిగా

తొమ్మిదవ స్థానంలో ఉన్న దీని కోసం మనోళ్లు బాగా వెతికారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా, హోండా మొబిలియో మరియు రెనో లాజీ మోడల్లతో గట్టిపోటినే ఎదుర్కుంటోంది. అయితే భారతీయ మార్కెట్లో ఉన్న అన్ని యమ్‌పివి మరియు యమ్‌యువి లకు ధీటుగా అమ్మకాలు నమోదు చేసుకుంటోంది.

08. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

08. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ఎనిమిదవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ వారి గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారు గురించి నెట్టింట్లో బాగానే గాలం వేశారు. ఈ గ్రాండ్ ఐ10 కారు నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ అందుబాటులో కలదు.య అయితే రెండింటిలో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు.

07. హ్యుందాయ్ ఇయాన్

07. హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ కు చెందిన మరొక కారు ఇయాన్ కు ఏడవ స్థానం లభించింది. హ్యుందాయ్ వారి ఈ ఎంట్రీలెవల్ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో మరియు రెనో క్విడ్‌తో గట్టిగా పోటి పడుతోంది. హ్యుందాయ్ ఇయాన్ కారులో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో కలదు.

06. హోండా సిటి

06. హోండా సిటి

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండాకు చెందిన సిటి కారు ఆరవ స్థానంలో ఉంది. పెట్రోల్ వెర్షన్ మరియు డీజల్ ఇంజన్‌లలో అందుబాటులో గల ఈ హోండా సిటి కారు తిరుగు లేని అమ్మకాలను నమోదు చేసుకుంటోంది.

05. మారుతి సుజుకి సెలెరియో

05. మారుతి సుజుకి సెలెరియో

ఐదవ స్థానంలో మారుతి సుజుకి వారి సెలెరియో కారు ఉంది. మారుతి సుజుకి మోటార్స్ వారు మొదటి సారిగా ఆటోమోటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించినది కూడా ఇందులోనే. మరియు డీజల్ వేరియంట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి మొదటి మోడల్ కూడా సెలెరియోనే.

04. టయాటా ఇన్నోవా

04. టయాటా ఇన్నోవా

ప్రపంచ వ్యాపంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న టయోటా వారి కారు కర్రోలా, కాని ఇది భారత్, ఇక్కడ టయోటా ఉత్పత్తులలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కారు ఇన్నోవా. ఇది కుటుంబ సమేతంగా కలిసి ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

 03.మహీంద్రా స్కార్పియో

03.మహీంద్రా స్కార్పియో

మూడవ స్థానంలో మహీంద్రా వారి స్కార్పియో కలదు. ఇది వినియోగదారుల కోసం వివిధ రకాల వేరియంట్లలో దీనిని అందుబాటులో ఉంచారు. ఉత్తమ పని తీరు దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు.

02. హోండా అమేజ్

02. హోండా అమేజ్

రెండవ స్థానంలో ఉన్న ఈ హోండా అమేజ్ కారు స్విప్ట్ డిజైర్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మరియు హ్యుందాయ్ జెంట్ వంటి మోడల్లకు గట్టి పోటిగా ఉంది.

01. మహీంద్రా బొలెరో

01. మహీంద్రా బొలెరో

డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది వెతికినది ఈ బొలెరో గురించి. దీని విడుదల జరిగినప్పుటి నుండి ఎడతెరపి లేకుండా అమ్మకాలు జరుపుతోంది. నిజంగా చెప్పాలంటే యస్‌యువి ప్రపంచాన్ని ఇది శాసిస్తోంది.

Most Read Articles

English summary
DriveSpark Dispatch: 10 Most Searched Cars On DriveSpark In 2015
Story first published: Thursday, December 24, 2015, 19:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X