సెప్టెంబర్ 26 న విడుదల కానున్న హీరో అచీవర్ 150

By Anil

హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లోకి కొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో 150సీసీ సామర్థ్యం ఉన్న అచీవర్‌ను సెప్టెంబర్ 26, 2016 న విడుదల చేయాలని నిర్ణయించుకుంది. 2016 పండుగ సీజన్‍లో హీరో మోటోకార్ప్ అమ్మకాలను పెంచుకునేందుకు దీనిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

ప్రస్తుతం మార్కెట్లో ఈ అచీవర్ అమ్మకాల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న తరానికి చెందిన అచీవర్‌ను విభిన్న బాడీ రంగులు మరియు డీకాల్స్‌తో అందించారు. దీనికే స్వల్ప మార్పులు చేసి ఆకర్షణీయంగా విడుదల చేయనున్నారు.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

ప్రస్తుతం ఉన్న అచీవర్ లో 149.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ గాలితో చల్లబడే ఇంజన్ కలదు.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 13.4బిహెచ్‌పి పవర్ మరియు 12.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

హీరో మోటోకార్ప్ వద్ద ఉన్న ఐ3ఎస్(ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ అండ్ స్టాప్) టెక్నాలజీని ఇందులో పరిచయం చేసే అవకాశం కూడా ఉంది.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

సరికొత్త 2016 అచీవర్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని 150సీసీ సామర్థ్యం గల బైకులకు ప్రత్యక్షంగా పోటీనివ్వనుంది.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

అన్నింటికన్నా ముఖ్యంగా హోండా యూనికార్న్ మరియు బజాజ్ పల్సర్ 150 మోడళ్లకు పరస్పరం పోటీగా నిలవనుంది. దీని ధర కూడా పోటీగా నిలిచిన ఉత్పత్తులకు సమానంగా ఉండనుంది.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

ఈ ఏడాది ముగిసే లోపు హీరో మోటోకార్ప్ నుండి మరిన్ని స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. పండుగ సీజన్ ముగిసే నాటికి మంచి అమ్మకాలను సాధించేందుకు హీరో సమాయత్తమవుతోంది.

హీరో మోటోకార్ప్ నుండి అచీవర్ 150

  • పూర్తి ప్యాకేజీతో 2017 ఆడి ఏ4 లగ్జరీ సెడాన్: ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్
  • 1960 లో విడుదలైన 'మంకీ 150' బైకును హోండా మళ్లీ విడుదల చేస్తానంటోంది
  • జిఎస్ఎక్స్150ఆర్ తో మా ప్రతాపమేంటో చూపుతాం...!!

Most Read Articles

English summary
Read In Telugu: Hero MotoCorp Achiever India Launch On September 26
Story first published: Saturday, September 24, 2016, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X