మార్కెట్‌లోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

By Anil

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం కలకత్తా కేంద్రంగా తమ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలోకి విడుదల చేసింది. భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఇండియన్ మార్కెట్లోకి 2020 నాటికి సుమారుగా 3 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయాలనే ప్రణాళికలో ఉంది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

వినియోగదారులు హీరో వారి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే ముందు లెడ్ మరియు లిథియమ్ అనే రెండు రకాల బ్యాటరీలను కలిగిన స్కూటర్లను ఎంచుకునే అవకాశం కల్పించింది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

లిథియమ్ బ్యాటరీలను కలిగిన స్కూటర్లకు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పెట్రోల్ ఫ్రీ రైడింగ్ కాకుండా, ఆ తరువాత కూడా ఇంటిలో 30 నిమిషాల పాటు ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలకు ముఖ్య కార్య నిర్వహణా అధికారి సోహిందర్ గిల్ మాట్లాడుతూ, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల సగటు ప్రయాణ పరిధి 65 కిలోమీటర్లుగా ఉన్నట్లు తెలిపాడు. వీటికి సుమారుగా నాలుగు నుండి ఐదు గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

హీరో మోటోకార్ప్ శ్రేణిలో ఉన్న లిథియమ్ డీలక్స్ స్కూటర గంటకు 25 కిలోమీటర్ల గరిష్టం వేగంతో ప్రయాణిస్తాయి.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద వినియోగదారులకు 10,000 రుపాయల వరకు తగ్గింపును కల్పించడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ పేటిఎమ్‌తో చేతులు కలిపింది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

పేటిఎమ్ వారి తగ్గింపు ఆఫర్లు హీరో ఆప్టిమా డీలక్స్ స్కూటర్ల మీద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంభందించిన బుకింగ్స్ సెప్టెంబర్ 25, 2016 నుండి పేటిఎమ్ ద్వారా ప్రారంభం కానున్నాయి.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఇక హీరో వారి ఎన్‌వైఎక్స్ లిథియమ్ స్కూటర్ పశ్చిమ బెంగాల్‌లో 45,790 రుపాయల ప్రారంభ ధరతో 2016 అక్టోబర్ నుండి అందుబాటులోకి రానుంది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

గతంలో హీరో ఎలక్ట్రిక్ నుండి ఆప్టిమా మరియు ఫోటాన్ అనే రెండు ఉద్గార రహితం విద్యుత్ స్కూటర్లను 2014 లో విడుదల చేసింది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని పెంచడానికి హీరో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో మరియు ఇతర ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని ప్రదేశాలలో చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పే వ్యూహంలో ఉంది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

తద్వారా వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపి వీటిని ఎంచుకోవడం వలన పొగ కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా వివరించింది.

విపణిలోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

  • ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్
  • ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో
  • గిన్నిస్ రికార్డ్ కోసం అద్భుతం చేసిన అబ్దుల్ రెహమాన్...!!

Most Read Articles

English summary
Read In Telugu: Hero Electric Launches Its Complete Range Of Electric Scooters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X