బిఎస్-4 హోండా ఏవియేటర్ విడుదల: ధర, ఫీచర్లు మరియు విడుదల వివరాలు
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ ఆప్షన్‌తో ఏవియేటర్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు...
జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం దేశీయంగా బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్లతో జోడింపుతో సరికొత్త ఏవియేటర్ స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది.

బిఎస్-4 ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్లతో హోండా ఏవియేటర్‌ను ఐదు విభిన్న వేరియంట్లలో ఎంచుకోవచ్చు. సరికొత్త ఏవియేటర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 52,077 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ఏప్రిల్ 1, 2017 నాటి నుండి విక్రయాలు జరిపే అన్ని ద్విచక్ర వాహనాల్లో ఈ రెండు ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. టూ వీలర్ల తయారీ సంస్థలు గడువులోపు ఈ ఫీచర్లను కల్పించి తమ నూతన ఉత్పత్తులను విపణిలోకి విడుదల చేస్తున్నాయి.

బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్లను ఏప్రిల్ 1, 2007 లోపు అన్ని టూ వీలర్లలో అందివ్వడానికి హోండా సర్వం సిద్దం చేసుకుంది.

సరికొత్త బిఎస్-4 హోండా ఏవియేటర్ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును. అవి,
- పర్ల్ ఇగ్నియస్ బ్లాక్,
- మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్,
- రెబల్ రెడ్ మెటాలిక్ మరియు
- పర్ల్ అమేజింగ్ వైట్.
- బేసిక్ వేరియంట్ ధర రూ. 52,077 లు
- అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 54,022 లు
- డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 56,454 లు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

ఇంజన్ వివరాలు - సాంకేతికంగా హోండా ఏవియేటర్ స్కూటర్‌లో 109సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.94ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

సరికొత్త 2017 హోండా ఏవియేటర్ స్కూటర్‌లో ముందు వైపున 90/90-12 మరియు వెనుక వైపున 90/100-10 ట్యూబ్ లెస్ టైర్లు కలవు, ఈ టైర్లలలో గాలిలో పూర్తిగా తగ్గిపోయినప్పుడు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

బిఎస్-4 ఇంజన్ అప్‌డేట్స్‌తో పరిచయమైన ఈ స్కూటర్‌లో ఆప్షనల్‌గా డిస్క్ బ్రేక్, అండర్ సీట్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ మరియు 5-స్పోక్ స్మార్ట్ అల్లాయ్ వీల్స్ కలవు.

2017 ఏవియేటర్ ధర వివరాలు:


Click it and Unblock the Notifications








