2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు

Written By:
Recommended Video - Watch Now!
2018 హోండా సిబిఆర్ 250ఆర్ రివీల్ | New Honda CBR 250 Details, Expected Launch & Price - DriveSpark

విపణలోకి 2018 సుజుకి జిక్సర్(Suzuki Gixxer) మరియు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్(Suzuki Gixxer SF) బైకులు విడుదలయ్యాయి. సరికొత్త 2018 వెర్షన్ సుజుకి జిక్సర్ ప్రారంభ ధర రూ. 80,928 లు మరియు 2018 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 90,037 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

2018 ఎడిషన్ సుజుకి జిక్సర్ రేంజ్ బైకుల్లో పలు కాస్మొటిక్ మార్పులు సంతరించుకున్నాయి. మరియు సుజుకి జిక్సర్ శ్రేణిలో సరికొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు నూతన స్కీమ్ పరిచయం అయ్యింది. మోటోజిపి ప్రేరణతో వచ్చిన లోగో మరియు క్యాండీ సోనోమా రెడ్/మెటాలిక్ సోనిక్ సిల్వర్.

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

సరికొత్త 2018 ఎడిషన్ సుజుకి జిక్సర్ బైకులను విక్రయాలకు సిద్దంగా దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. వీటిలో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ బైకుల్లో అదే అల్ట్రా-లైట్ 155సీసీ ఇకో-పర్ఫామెన్స్ (ఎస్ఇపి) టెక్నాలజీ గల ఇంజన్ ఉంది.

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

సుజుకి జిక్సర్ మరియు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్‌లో ఉన్న 155సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 8,000ఆర్‌పిఎమ్ వద్ద 14.6ఎన్ఎమ్ టార్క్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో పైన తెలిపిన ఇంజన్ ఉన్నప్పటికీ, ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. సస్పెన్షన్ కోసం రెండు బైకుల్లో కూడా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ కలదు.

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు మరియు వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అయితే, జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ వచ్చింది.

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

2018 ఎడిషన్ జిక్సర్ సిరీస్ బైకుల విడుదల సందర్భంగా సుజుకి సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగ అధ్యక్షులు సజీవ్ రాజశేఖరన్ మాట్లాడుతూ, "యువ కొనుగోలు దారుల స్పోర్టివ్‌నెస్ మరియు యూత్‌ఫుల్‌నెస్‌కు అనుగుణంగా జిక్సర్ బైకులను రూపొందించినట్లు తెలిపాడు. జిక్సర్ శ్రేణి బైకులు ప్రతి ఒక్క రైడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని వివరించాడు. జిక్సర్ బైకులను ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంచేందుకు 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు."

2018 ఎడిషన్ జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంట్రీ లెవల్ స్పోర్టివ్ బైకులను కోరుకునే కస్టమర్లకు సుజుకి జిక్సర్ సిరీస్ బైకులు అత్యుత్తమ ఎంపికగా నిలిచాయి. 2018 జిక్సర్ సిరీస్ బైకులను ఇప్పుడు స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చిన లోగో మరియు సరికొత్త కలర్ స్కీమ్‌లో ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu: 2018 Suzuki Gixxer And Gixxer SF Launched In India; Prices Start At Rs 80,928
Story first published: Tuesday, March 6, 2018, 16:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark