ఆటో ఎక్స్‌పో 2018: విపణిలోకి ట్వింటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

Written By:
Recommended Video - Watch Now!
Aprilia SR 125; Walkaround, Details, Specifications, Features - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: ట్వింటీ టూ మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 74,740 లు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించారు. ట్వంటీ టూ మోటార్స్ తమ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

ట్వింటీ టూ మోటార్స్ ఆవిష్కరించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చిన ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు గల మరియు క్లౌడ్ కనెక్టెడ్ స్కూటర్ అని ట్వింటీ టూ మోటార్స్ వెల్లడించింది. ట్వింటీ టూ మోటార్స్ ఫ్లో స్కూటర్‌లో బాష్ సంస్థ అభివృద్ది చేసిన డిసి మోటార్ కలదు.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

డిసి మోటార్‍కు 2.1kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ఈ మోటార్ గరిష్ట 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60కిలోమీటర్లుగా ఉంది.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

సింగల్ బ్యాటరీ ద్వారా గరిష్టంగా 80కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదనంగా మరో బ్యాటరీ చేర్చుకోవడంతో పరిధిని 80కిమీల నుండి రెట్టింపు చేసుకోవచ్చు.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

రెగ్యులర్ ఛార్జర్ ద్వారా 5 గంటల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు, అయితే, ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం గంట వ్యవధిలో 70శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. వైర్ లెస్ ద్వారా కూడా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

ట్వింటీ టూ మోటార్స్ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు మరియు వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడంతో ఏదేని ఒక బ్రేక్ అప్లే చేసినా... రెండు చక్రాలకు సమానంగా బ్రేక్ పవర్ అందుతుంది. ఫ్లో స్కూటర్‌లో రీజనరేటివ్ బ్రేకింగ్ పవర్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్రేకులు వేసిన ప్రతిసారీ బ్యాటరీకి పవర్ అందుతుంది.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

డిజైన్ పరంగా చూస్తే, ట్వంటీ టూ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మినహాయిస్తే, స్కూటర్లో వచ్చిన మిగతా అన్ని లైట్లు ఎల్ఇడి లైట్లే. ఫీచర్ల పరంగా 25-లీటర్ల కెపాసిటి గల అండర్ సీట్ స్టోరేజ్(రెండు హెల్మెట్లను స్టోర్ చేయవచ్చు) మరియు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ కలదు.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

ఫ్లో స్కూటర్‌లో కృత్రిమ మేధస్సు కలదు. జియో ఫెన్సింగ్ ద్వారా స్కూటర్ దొంగతనానికి గురికాకుండా రిమోటా ద్వారా ట్రాక్ చేయడంలో ఓనర్‌కు స్కూటర్ యొక్క కృత్రిమ మేధస్సు సహకరిస్తుంది.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

ఇతర ప్రధానమైన ఫీచర్లలో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానల్, ప్రత్యేకమైన అప్లికేషన్, క్రూయిజ్ కంట్రోల్, టైర్లు పంక్చర్ అయినపుడు రైడింగ్ కోసం డ్రాగ్ మోడ్ మరియు రివర్స్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్వింటీ టూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో సాంప్రదాయకమైన ఇంజన్ స్కూటర్ల కంటే మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. మిగిలి ఉన్న పవర్‌తో స్కూటర్ ఎంత వరకు వెళ్లగలదనే సమాచారాన్ని అందిస్తుంది. అతి త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత సరసమైన ధరతోనే లభిస్తోంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: Twenty Two Motors Flow Launched At Rs 74,740 - Specs, Range, Features & Images
Story first published: Saturday, February 10, 2018, 11:35 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark