మూడు క్రూయిజర్ బైకులతో దూసుకొస్తున్న యుఎమ్: రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఇక చుక్కలే!!

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

అమెరికాకు చెందిన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ యుఎమ్ మోటార్ సైకిల్స్ విపణిలోకి మూడు కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. యుఎమ్ మోటార్ సైకిల్ల్ మూడు సరికొత్త క్రూయిజర్ మోటార్ సైకిళ్లతో పాటు, మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైకును కూడా ప్రవేశపెడుతున్నట్లు తాజాగా అందిన రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.

యుఎమ్ మోటార్ సైకిల్స్

యుఎమ్ మోటార్ సైకిల్స్ భారత్‌కు ఖరారు చేసిన బైకుల్లో కమాండో ఐరన్ 300, కమాండో 300 ఎల్ఎక్స్ మరియు వెగాస్ 300 క్రూయిజర్ వంటివి ఉన్నాయి. ఈ మూడు బైకులను కూడా కమాండో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అవే ఇంజన్ మరియు విడి భాగాలతో రూపొందించబడ్డాయి.

యుఎమ్ మోటార్ సైకిల్స్

అతి త్వరలో విపణిలోకి రానున్న యుఎమ్ కమాండో ఐరన్ 300, కమాండో 300 ఎల్ఎక్స్ మరియు వెగాస్ 300 క్రూయిజర్ బైకుల్లో 279.5సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో రానున్నాయి.

యుఎమ్ మోటార్ సైకిల్స్

అయితే, ఈ ఇంజన్‌లో కార్బోరేటర్‌కు బదులుగా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. 300సీసీ సెగ్మెంట్లోకి వస్తున్న ఈ ఇంజన్ గరిష్టంగా 24.8బిహెచ్‌పి పవర్ మరియు 23ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యుఎమ్ మోటార్ సైకిల్స్

రిపోర్ట్స్ ప్రకారం, తక్కువ ధరలో అందించేందుకు ఈ మూడు బైకులను తొలుత కార్బోరేటర్ సిస్టమ్‌తో అందించి, ఆ తరువాత బిఎస్-6 ఇంజన్‌కు అప్‌గ్రేడ్ చేసేటపుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో రీలాంచ్ చేయనున్నట్లు తెలిసింది.

యుఎమ్ మోటార్ సైకిల్స్

ఈ సరికొత్త క్రూయిజర్ మోటార్ సైకిల్స్ విపణిలో ఇప్పటికే ఉన్న బైకులతో పోల్చుకుంటే అధునాతన డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. యుఎమ్ మోటార్ సైకిల్స్ దేశీయంగా కమాండో సిరీస్ బైకులను కమాండో, స్పోర్ట్స్ ఎస్, కమాండో క్లాసిక్ మరియు కమాండో మొజావే పేర్లతో విక్రయిస్తోంది.

యుఎమ్ మోటార్ సైకిల్స్

యుఎమ్ మోటార్ సైకిల్స్ ఈ మూడు నూతన బైకులను ఉత్తరాఖండ్‌లోని ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. అంతే కాకుండా, కస్టమర్ల నుండి స్పందన గమనించేందుకు ఈ మూడింటిలో తొలుత ఒక మోడల్ ప్రవేశపెట్టి, తరువాత మిగిలిన ఉత్పత్తులను లాంచ్ చేయనుంది.

యుఎమ్ మోటార్ సైకిల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అమెరికా టూ వీలర్ల తయారీ దిగ్గజం యుఎమ మోటార్ సైకిల్స్ క్రూయిజర్ బైకులకు పెట్టింది పేరు. దేశీయంగా, ప్రసిద్దిగాంచిన యుఎమ్ కమాండో శ్రేణి బైకులను పలు వేరియంట్లలో విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడు మార్కెట్లో మరో అడుగు ముందుకేసింది. తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచుకునేందుకు 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా నూతన బైకులను ఆవిష్కరించనుంది.

Source: BikeWale

English summary
Read In Telugu: UM Motorcycles To Launch Three New Cruiser Bikes In India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark