న్యూ స్విఫ్ట్ ప్రతి ఒక్కరి ఫేవరెట్ అవ్వడానికి ఈ ఐదు ఫీచర్లు చాలు

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ కొత్త తరం స్విఫ్ట్(2018 Maruti Swift) విడుదల పనులను మరింత వేగవంతం చేసింది. మారుతి ఇప్పటికే 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును తమ వెబ్‍‌సైట్లో చేర్చింది. దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

2018 మారుతి స్విఫ్ట్

ఫిబ్రవరి నెలలో న్యూఢిల్లీలో జరగనున్న 2018 ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరిస్తున్న కొత్త తరం స్విఫ్ట్ కారులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది విడుదలవుతున్న కార్లలో స్విఫ్ట్ లాంచ్ కీలకంగా నిలిచింది.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ పరంగా ఇప్పటికే తీవ్ర అలజడిని సృష్టించింది. మునుపటి తరం స్విఫ్ట్ కారుతో పోల్చుకుంటే అప్ కమింగ్ స్విఫ్ట్ డిజైన్ పరంగా ఎన్నో మార్పులు చేర్పులకు గురయ్యింది. మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ ఇంటీరియర్ మరియు ఇంటీరియర్‌లో చోటు ఐదు అతి ప్రధానమైన మార్పులు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

2018 మారుతి స్విఫ్ట్

సరికొత్త హార్టెక్ ఫ్లాట్‌ఫామ్

మారుతి సుజుకి గత రెండు మూడేళ్ల నుండి అభివృద్ది చేస్తున్న హ్యాచ్‌బ్యాక్ కార్లను సుజుకి హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేస్తోంది. అధిక తన్యత గల స్టీల్‌తో ధృడమైన మరియు తేలకపాటి బరువు ఉండేలా నిర్మించడం దీని ప్రత్యేకత.

2018 మారుతి స్విఫ్ట్

రెండవ తరం స్విఫ్ట్ కారుతో పోల్చుకుంటే దీని బరువు 90కిలోల వరకు తగ్గింది. దీంతో మైలేజ్ మరియు హ్యాండ్లింగ్ మెరుగయ్యాయి. కాబట్టి, హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ అతి ప్రధానమైన మార్పు అని చెప్పవచ్చు.

2018 మారుతి స్విఫ్ట్

హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన కొత్త తరం స్విఫ్ట్‌లో ధృడత్వం, సామర్థ్యం పెరగడంతో పాటు నాయిస్, వైబ్రేషన్స్, కఠినత్వం గణనీయంగా తగ్గాయి. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద వచ్చిన బాలెనో మరియు న్యూ డిజైర్ కార్లకు మంచి ఆదరణ లభించింది.

2018 మారుతి స్విఫ్ట్

హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ యొక్క మరో ప్రయోజనం విశాలమైన క్యాబిన్. బయట నుండి చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ, విశాలమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్ దీని సొంతం. థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ 40ఎమ్ఎమ్ వరకు పొడవైనది మరియు 20ఎమ్ఎమ్ అధిక గ్రౌండ్ క్లియరెన్స్, 24ఎమ్ఎమ్ వరకు పెరిగిన హెడ్ రూమ్ మరియు 265లీటర్ల కెపాసిటి గల లగేజ్ స్పేస్ ఉంది.

2018 మారుతి స్విఫ్ట్

ఆటోమేటిక్ గేర్‌బాక్స్

సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. స్విఫ్ట్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లను ఇప్పుడు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా అందిస్తోంది. భారత్‌లోకి స్విఫ్ట్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభ్యమయ్యేది.

2018 మారుతి స్విఫ్ట్

పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్

న్యూ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రపంచ శ్రేణి స్టైలింగ్ మరియు డిజైన్ ఫీల్ కలిగించే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఇందులో వస్తున్నాయి. అయితే, ఇవి స్విఫ్ట్ టాప్ వేరియంట్లో మాత్రమే లభిస్తున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

నూతన ఇంటీరియర్

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ ఇంటీరియర్‌లో ఆల్ న్యూ బ్లాక్ ఇంటీరియర్ రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్ ఉంది. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఇప్పటి వరకు రానటువంటి ఇన్ఫోటైన్‌మెంట్ ఈ కొత్త తరం స్విఫ్ట్‌లో వస్తోంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు వచ్చాయి.

2018 మారుతి స్విఫ్ట్

నూతన ఇంటీరియర్ ప్రీమియమ్ ఫీల్ కలిగిస్తుంది. స్పోర్టివ్ ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్, గుండ్రటి డయల్స్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఏ/సి వెంట్స్, అర్బన్ క్రోమ్ శాటిన్ ఫినిషింగ్ ఇంస్ట్రుమెంట్ ప్యానల్, డోర్ మరియు డ్యాష్‌బోర్డ్ ఉన్నాయి. వీటితో పాటు, ఇంజన్ స్టార్ట్/స్టాప్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లలో ఉన్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు

మారుతి సరికొత్త స్విఫ్ట్‌లో అత్యాధునిక భద్రత ఫీచర్లను అందించింది. మూడవ తరానికి చెందిన స్విఫ్ట్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లను తప్పనిసరిగా అందించింది.

2018 మారుతి స్విఫ్ట్

ఫ్రంట్ మరియు సైడ్ క్రాష్ టెస్ట్ మినహాయిస్తే, మారుతి సుజుకి ఈ కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను అధిక తన్యత గల స్టీల్‌తో బాడీని నిర్మించడంతో, స్విఫ్ట్ ఇప్పుడు మరింత ధృడంగా ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచనుంది.

2018 మారుతి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త మారుతి స్విఫ్ట్ డిజైన్, స్టైలింగ్ మరియు ఫీచర్ల పరంగా మార్పులకు గురైంది. స్విఫ్ట్ అదే పాత రూపాన్ని కలిగి ఉంటూనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి తోడు అతి ముఖ్యమైన ఎన్నో భద్రత ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించింది.

మారుతి సుజుకి ఫిబ్రవరిలో న్యూ ఢిల్లీలో జరగబోయే ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద థర్డ్ జనరేషన్ స్విఫ్ట్‌ను ఆవిష్కరించి, అనంతరం పూర్తి స్థాయిలో లాంచ్ చేయనుంది.

English summary
Read In Telugu: Top 5 Features Of The New Maruti Swift — What's ‘New’ In The 2018 Swift?

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark