Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
2019 సంవత్సరానికి వీడ్కొలు పలికి నూతన సంవత్సరానికి స్వాగత పలికేందుకు మరో మూడు వారాలే ఉన్నాయి. అటు కొత్త సంవత్సరం ఇటు సంవత్సరాంతాన్ని పురస్కరించుకుని హోండా టూ వీలర్స్ తమ బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్లపై అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

2019 క్యాలెండర్ ఇయర్ ముగుస్తుండటంతో హోండా టూ వీలర్స్ తమ స్కూటర్లు మరియు బైకుల మీద రూ. 9,500 నుండి రూ. 11,000 వరకు నగదు ఆదా చేసుకునే ఆఫర్లను తీసుకొచ్చింది.

హోండా టూ వీలర్స్ ఇప్పటి వరకూ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అన్ని హోండా టూ వీలర్ల మీద ఈ ఆఫర్లు వర్తిస్తాయి. జనవరి 15, 2020 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

హోండా విక్రయిస్తున్న సీబీఆర్250ఆర్, సీబీ షైన్, లివో, సీబీ హార్నెట్ 160ఆర్, సీబీ యూనికార్న్, ఎక్స్‌బ్లేడ్ మరియు డ్రీమ్ సిరీస్ బైకుల మీద, అదే విధంగా యాక్టివా 125ఎఫ్ఐ, యాక్టివా 5జీ, గ్రాజియా మరియు క్లిక్ స్కూటర్ల మీద ఆఫర్లు వర్తిస్తున్నాయి.

ఈ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు 7 వేల రూపాయల విలువైన పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. బస్సు, మూవీ మరియు ఫ్లైట్ టికెట్లు, రీఛార్జ్ మరియు కొనుగోళ్ల మీద క్యాష్ వోచర్లు రూపంలో ఈ నగదును వినియోగించుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా టూ వీలర్ షోరూముల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.పేటీఎమ్ మరియు హోండా క్యాష్ బ్యాక్ ఆఫర్లకు గడువు జనవరి 15, 2020.
Most Read: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ఎంజీ మోటార్: మైలేజ్, ఫీచర్లు & ధరలు

బిఎస్-6 గడువు దగ్గరపడుతుండటంతో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ మార్చి 2020 లోగా తమ అన్ని టూ వీలర్లలో బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌లను అందించి, బిఎస్-6 వెర్షన్ టూ వీలర్లను పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.
Most Read: డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

హోండా ఇప్పటికే యాక్టివా స్కూటర్ మరియు హోండా ఎస్‌పి 125 బైకుల్లో బిఎస్-6 ఇంజన్‌ను అందించింది. దశల వారీగా అన్ని బైకుల్లో బిఎస్-6 ఇంజన్ ప్రవేశపెడతామని హోండా ప్రతినిధులు వెల్లడించారు.