ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్ విడుదల; ధర కేవలం రూ.50 వేలే!

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ 1.0"ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుందని, దీని ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమేనని కంపెనీ పేర్కొంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్ విడుదల; ధర కేవలం రూ.50 వేలే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పాతకాలపు కేఫ్-రేసర్ స్టైల్‌లో డిజైన్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా, మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని అందుబాటు ధరలో ఉండేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. సరస తరహా మోడల్‌తో వస్తుంది.

ఈ మోటార్‌సైకిల్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ధృవీకరించింది మరియు ఇది వాణిజ్య ఉపయోగం కోసం సిద్ధంగా ఉందని కంపెనీ పేర్కొంది.

ఆటమ్ 1.0 తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ కావడంతో దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నడపటానికి రైడర్‌కు లైసెన్స్ కూడా అవసరం లేదు. టీనేజర్లు తమ రోజువారీ రాకపోకల కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను చట్టబద్ధంగా ఉపయోగించవచ్చు.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్ విడుదల; ధర కేవలం రూ.50 వేలే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 48 వోల్ట్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చబడి ఉంటుంది. ఇది పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క గరిష్టం వేగం గంటకు 25 కిలోమీటర్లు.

ఈ మోటార్‌సైకిల్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుందని, దీనిని స్టాండర్డ్ 3-పిన్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్ విడుదల; ధర కేవలం రూ.50 వేలే!

ఆటొమ్మొబైల్స్ ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీ ఫుల్ చార్జ్ కోసం కేవలం 1 యూనిట్ విద్యుత్‌ను మాత్రమే మాత్రమే వినియోగిస్తుందని, అంటే సగటున ఇది 100 కిలోమీటర్లకు రోజుకు కేవలం 7 నుండి 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందని కంపెనీ తెలిపింది. సాంప్రదాయక పెట్రోల్ ఇంజన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. పెట్రోల్ ఇంజన్ల విషయంలో 100 కిలోమీటర్లకు సుమారు 80 - 100 రూపాయల వరకు ఖర్చవుతుంది.

ఆటమ్ 1.0 చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ, ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్స్, స్టైలిష్ కేఫ్-రేసర్ డిజైన్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, బిగ్ ఫ్యాట్ టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ (280 మి.మీ) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్ విడుదల; ధర కేవలం రూ.50 వేలే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భందా ఆటోమ్మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వంశీ గడ్డం మాట్లాడుతూ.. "ప్రయాణం కోసం స్థిరమైన మార్గాన్ని అన్వేషించే లక్ష్యంలో భాగంగా దాదాపు 3 సంవత్సరాల కృషి తర్వాత మేము ఆటమ్ 1.0ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాహనం భారతీయ వినియోగదారుల ఆశయాలను పరిష్కరించడానికి సరిపోతుందని" అన్నారు.

"లిథియం-అయాన్ బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఆటమ్ 1.0 స్థలాన్ని ఆదా చేసే డిజైన్‌ను కలిగి ఉండి, ఈ విభాగంలో మార్కెట్లో లభిస్తున్న ఇతర ఎలక్ట్రిక్ బైక్‌ల కన్నా ఎక్కువ రైడింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. సున్నా ఉద్గారాలతో, తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ ఉత్పత్తి సంక్షిప్త పరిష్కారంతో మార్కెట్‌ను ఆకర్షించగలదని మేము విశ్వసిస్తున్నాము" అని అయన చెప్పారు.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్ విడుదల; ధర కేవలం రూ.50 వేలే!

"భారతదేశాన్ని స్థిరమైన మరియు పర్యావరణ బాధ్యత కలిగిన దేశంగా మార్చాలనే మా పెద్ద నిబద్ధతలో ఆటమ్ 1.0 ఒక ముఖ్యమైన మైలురాయి అని మేము నమ్ముతున్నాము" అని వంశీ చెప్పారు.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇది వరకు చెప్పుకున్నట్లు గానే ఆటమ్ 1.0 చాలా సింపుల్ డిజైన్‌తో రూపొందించబడినది. ఇది తక్కువ దూరం ప్రయాణించే కస్టమర్లకు చాలా అనువుగా ఉంటుంది. పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చు, తక్కువ నిర్వహణ మరియు జీరో సర్వీసింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

Most Read Articles

English summary
Atumobiles Pvt. Ltd. — a Hyderabad-based electric two-wheeler startup has launched their first electric motorcycle, the Atum 1.0 in the market. The Atum 1.0 electric bike is available all across India and is offered with a starting price of Rs 50,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X