భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

ఇటాలియన్ మోటార్‌సైకిల్‌ బ్రాండ్ డ్యుకాటి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమ కొత్త 'డ్యుకాటి పానిగేల్ వి2' టీజర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. టీజర్ వీడియో తర్వాత ఈ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా అదికాస్తా ఆలస్యమైంది. కాగా, తాజాగా పానిగేల్ వి2 మోటార్‌సైకిల్‌ను ఆగస్ట్ 26, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేస్తామని డ్యుకాటి ధృవీకరించింది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

సెప్టెంబర్ నెల నుంచి డ్యుకాటి పానిగేల్ వి2 డెలివరీలు ప్రారంభం అవుతాయని అంచనా. కాగా, డ్యుకాటి డీలర్లు ఇప్పటికే రూ.1 లక్ష అడ్వాన్స్‌తో ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం డ్యుకాటి అందిస్తున్న ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ 959 పానిగేల్ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్త పానిగేల్ వి2 మోటార్‌సైకిల్ మార్కెట్లోకి రానుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

డ్యుకాటి ఇటీవలే తమ సరికొత్త 'పానిగేల్ వి2 వైట్ రోసో' అనే స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా ప్రపంచ మార్కెట్ల కోసం కంపెనీ ఆవిష్కరించింది. తెలుపు మరియు ఎరుపు పెయింట్ స్కీమ్‌తో రూపుదిద్దుకున్న ఈ వైట్ రోసో ఎడిషన్ రేస్ ట్రాక్ వెర్షన్ పానిగేల్‌ను తలపిస్తుంది. - ఈ మోడల్‌కు సంబంధించిన మరింత సమాచారం కోం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించనున్న కొత్త కార్స్ : ఫోర్స్ ట్రాక్స్ టైఫూన్

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

కొత్త డ్యుకాటి పానిగేల్ వి2లో చేసిన మార్పుల చేర్పుల కారణంగా ఇది మరింత స్టయిలిష్‌గా కనిపిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ స్టైలింగ్, ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు సింగిల్ సైడ్ స్వింగార్మ్‌లను ట్రాక్ వెర్షన్ డ్యుకాటి పానిగేల్ వి4 నుండి స్పూర్తి పొంది డిజైన్ చేశారు.

ఈ మోటార్‌సైకిల్‌‌లో డ్యుకాటి బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎయిర్ డ్యామ్‌లు మరియు వి-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. దీని కొత్త ఫెయిరింగ్ నిర్మాణం మరింత సమర్థవంతమైన ఎయిర్ డ్యామ్‌లను కలిగి ఉండి, ఇంజన్‌ను కూల్ చేయటంలో సహకరిస్తుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

ఇంకా ఇందులో 4.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెగ్యులర్ సీట్ కన్నా 20 మి.మీ ఎక్కువ పొడవు ఉండే సీట్, అండర్ స్లంగ్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యుకాటి పానిగేల్ వి2లో ఉపయోగించిన దాదాపు మొత్తం ఎలక్ట్రానిక్స్ పరికరాలను 959 మోడల్ గ్రహించారు.

మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు గాను ఇందులోని ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా రీవర్క్ చేశారు. పానిగేల్ వి సిరీస్‌లోని ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీలో ఎమ్‌యూ-అసిస్టెడ్ ట్రాక్షన్ కంట్రోల్ (డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ ఈవిఓ 2 అని పిలుస్తారు), వీలీ కంట్రోల్ మరియు కార్నరింగ్ ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త టైర్ తయారీ సంస్థ... గందరగోళంలో ఉన్న ఇతర సంస్థలు

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో బ్రెంబో నుంచి గ్రహించిన ఎమ్4.32 మోనోబ్లోక్ కాలిపర్లు మరియు ముందు భాగంలో డ్యూయెల్ డిస్క్‌లతో బ్రెంబో మాస్టర్ సిలిండర్లు మరియు వెనుక భాగంలో ఒకే డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇది డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌‌లో 955 సిసి సూపర్‌క్వాడ్రో ఎల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 155 బిహెచ్‌పి శక్తిని మరియు 104 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:గుడ్ న్యూస్.. ఆగస్టు 22 న ప్రారంభం కానున్న టయోటా అర్బన్ క్రూయిజర్

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఎప్పుడంటే?

డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ డేట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎట్టకేలకు డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 22వ తేదీన ఇది మార్కెట్లోకి ప్రవేశించనుంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ మోటార్‌సైకిల్‌ ధర సుమారు రూ.13.5 లక్షల నుంచి రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లోని సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000ఎఫ్, ఆప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఆర్, ఆప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఎఫ్ మరియు కవాసకి నింజా హెచ్2 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ducati had teased the Panigale V2 earlier this year in April and was supposed to launch soon after the teaser video. However, the launch had to be delayed due to the COVID-19 pandemic. Now, the company is all set to launch the Panigale V2 on August 26, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X