భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీ కంపెనీ డ్యుకాటి భారత మార్కెట్లో తమ సరికొత్త 'డ్యుకాటి పానిగేల్ వి2' మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీ ఇప్పటి వరకూ విక్రయించిన ఐకానిక్ డ్యుకాటి 959 పానిగేల్ మోడల్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కంపెనీ కొత్త 2020 డ్యుకాటి పానిగేల్ వి2 మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

దేశీయ విపణిలో కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది డ్యుకాటి బ్రాండ్‌కు భారత్‌లో మొట్టమొదటి బిఎస్6 కంప్లైంట్ సూపర్‌బైక్.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 బిఎస్6 మోటార్‌సైకిల్‌‌లో 955 సిసి సూపర్‌క్వాడ్రో 90-డిగ్రీ వి2 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 155 బిహెచ్‌పి శక్తిని మరియు 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మునుపటి బిఎస్4 మోడల్ పవర్ టార్క్ గణాంకాలతో పోల్చుకుంటే కొత్త బిఎస్6 మోడల్ 5 బిహెచ్‌పిల శక్తిని మరియు 2 ఎన్ఎమ్‌ల టార్క్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 మెకానికల్స్‌ని గమనిస్తే, ఇందులో ముందువైపు షోవా నుండి సేకరించిన పూర్తిగా సర్దుబాటు చేయగల 43 ఎంఎం ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు సాచ్స్ నుండి గ్రహించిన సర్దుబాటు చేయగల వన్-సైడెడ్ అల్యూమినియం స్వింగ్-ఆర్మ్ ఉన్నాయి. బ్రేక్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో బ్రెంబో నుండి సేకరించిన 4-పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయెల్ 320 ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో ఒకే ఒక 245 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉంటుంది.

MOST READ: స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2లో పిరెల్లి డయాబ్లో రోసో కోర్సా II టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లను 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై అమర్చారు. ఇది పూర్తి ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో కార్నరింగ్ ఏబిఎస్, ఫుల్ రైడ్-బై-వైర్ సిస్టమ్, ఆటో టైర్ కాలిబ్రేషన్, ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, స్లిప్పర్-క్లచ్, డ్యూయెల్-వే క్విక్-షిఫ్టర్ మరియు మూడు రైడింగ్ మోడ్స్ (రేస్, స్పోర్ట్ మరియు స్ట్రీట్) ఉన్నాయి.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డిజైన్ పరంగా గమనిస్తే, కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 మోడల్‌ను దాని పెద్ద వెర్షన్ అయిన పానిగలే వి4 మరియు బ్రాండ్ యొక్క పాపులర్ డబ్ల్యుఎస్‌బికె రేస్ బైకుల నుండి ఎక్కువగా ప్రేరణ పొంది తయారు చేసినట్లు అనిపిస్తుంది. అత్యుత్తమ సౌకర్యం మరియు బెటర్ రైడింగ్ కోసం దీనిని మెరుగైన ఎర్గోనామిక్స్‌తో డిజైన్ చేశారు.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బెటర్ సీటింగ్ కంఫర్ట్ కోసం సీట్లను 5 మి.మీ అదనపు ఫోమ్‌తో తయారు చేశారు. దీని ఫలితంగా ముందు వైపు 2 మి.మీ మరియు వెనుక వైపు 5 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది. డ్యుకాటి పానిగేల్ వి2 చాలా చురుకైన, సహజమైన మరియు సరదాగా నడపడానికి వీలుండే ఓ గొప్ప సూపర్‌బైక్. పూర్తి ఎల్ఈడి లైటింగ్ మరియు 4.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 200 కిలోలు (కెర్బ్ వెయిట్) మరియు ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 17 లీటర్లు. పానిగేల్ వి2 100 కిలోమీటర్లకు 6 లీటర్ల ఇంధనాన్ని ఖాళీ చేస్తుంది. అంటే సగటున ఇది లీటరుకు సుమారు 16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

MOST READ: విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 భారత మార్కెట్లో ఒకే ఒక్క కలర్ ఆప్షన్ (రెడ్ పెయింట్ స్కీమ్)తో లభిస్తుంది. ఈ సూపర్‌బైక్‌ను భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని డ్యుకాటి డీలర్‌షిప్ కేంద్రాలలో బుక్ చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డ్యుకాటి ఇటీవలే తమ సరికొత్త 'పానిగేల్ వి2 వైట్ రోసో' అనే స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా ప్రపంచ మార్కెట్ల కోసం కంపెనీ ఆవిష్కరించింది. తెలుపు మరియు ఎరుపు పెయింట్ స్కీమ్‌తో రూపుదిద్దుకున్న ఈ వైట్ రోసో ఎడిషన్ రేస్ ట్రాక్ వెర్షన్ పానిగేల్‌ను తలపిస్తుంది. - ఈ మోడల్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త డ్యుకాటి పానిగేల్ వి2లో చేసిన మార్పుల చేర్పుల కారణంగా ఇది మరింత స్టయిలిష్‌గా కనిపిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000ఎఫ్, ఆప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఆర్, ఆప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఎఫ్ మరియు కవాసకి నింజా హెచ్2 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Italian superbike manufacturer, Ducati has launched the Panigale V2 in the Indian market. The new Ducati Panigale V2 replaces the old 959 Panigale in the brand's lineup and is offered with a price tag of Rs 16.99 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X