వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

హీరో మోటోకార్ప్ ఆల్ న్యూ గ్లామర్ 125 మోటార్ సైకిల్‌ను బీఎస్6 వెర్షన్‌లో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇంజన్ అప్‌గ్రేడ్, కొత్త ఫీచర్లు మరియు పలు బాడీ అప్‌డేట్స్‌తో వచ్చిన సరికొత్త 2020 బీఎస్6 వెర్షన్ హీరో గ్లామర్ 125 ప్రారంభ ధర రూ. 68,900 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

హీరో గ్లామర్ 125 బీఎస్6 మోటార్ సైకిల్‌లో ట్యూబులర్ డబుల్ క్రాడిల్ ఛాసిస్ స్థానంలో సరికొత్త డైమండ్ ఫ్రేమ్ వచ్చింది. ఇందుకు అనుగుణంగా లాగ్ ట్రావెల్ గల లేటెస్ట్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా అందించారు.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే బీఎస్6 మోడల్‌లో 100మిమీ వరకూ వెడల్పాటి టైర్లు వచ్చాయి, ఇది టైర్ స్టెబిలిటీని పెంచుతుంది. గేర్‌లో ఉన్నపుడు క్లచ్ మెల్లగా వదలగానే బైక్ నెమ్మదిగా ముందుకు కదిలేందుకు క్రాల్ ఫంక్షన్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ మరియు రియర్ టైమ్‌ మైలేజ్ ఇండికేటర్ వంటి టెక్నాలజీ వచ్చింది.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

బీఎస్6 ప్రమాణాలను పాటించే 125సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 10.8బిహెచ్‌పి పవర్ మరియు 10.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ జనరేషన్ గ్లామర్ బైకుతో పోల్చుకుంటే ఇది 19శాతం మరింత శక్తివంతమైనది.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

అంతే కాకుండా పాత బీఎస్4 గ్లామర్ బైకులో ఉన్నటువంటి 4-స్పీడ్ గేర్‌బాక్స్ స్థానంలో 5-స్పీడ్ గేర్‌బాక్స్ వచ్చింది. మరియు కార్బోరేటర్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్ వచ్చింది.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

2020 హీరో గ్లామర్ 125 బీఎస్6 మోటార్ సైకిల్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 68,900 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 72,400. బీఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే బీఎస్6 వెర్షన్ గ్లామర్ ధర 1,450 రూపాయలు పెరిగింది.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

హీరో మోటోకార్ప్‌కు సంభందించిన వార్తల్లో.. హీరో ఇటీవల మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 మరియు హీరో డెస్టినీ 125 బీఎస్6 స్కూటర్లను లాంచ్ చేసింది. బయటివైపున్న ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు సర్వీస్ పెండింగ్ ఇండికేటర్ వంటివి ఫీచర్లు మాయెస్ట్రో ఎడ్జ్ స్పోర్టివ్ స్కూటర్‌లో వచ్చాయి.

వావ్ స్టైలిష్ హీరో గ్లామర్ బీఎస్6 వచ్చేసింది: ధర ఎంతంటే?

మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్ అల్లాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్ మరియు అల్లాయ్ వీల్స్ + డిస్క్ బ్రేక్స్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. మాయెస్ట్రో ఎడ్జ్ 125 విభిన్న కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో సంస్థ తమ గ్లామర్ 125 మోటార్ సైకిల్‌ను పూర్తిగా మార్చేసింది. పలు రకాల కొత్త ఫీచర్లను వీలైనంత తక్కువ ధరలో అందివ్వడంలో హీరో అద్భుతం చేసిందనే చెప్పాలి. ఇప్పటికీ పల్లెటూరి రోడ్ల నుండి సిటీ ట్రాఫిక్ వరకూ ఎక్కడ చూసినా హీరో గ్లామర్ తారసపడుతూనే ఉంటుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న హోండా ఎస్‌పి 125 మరియు బజాజ్ పల్సర్ 125 మోడళ్లకు ధీటైన పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Hero Glamour 125 BS6 Models Launched In India Starting At Rs 68,900, Ex-Showroom Delhi. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X