హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' తమ సరికొత్త 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్' (Hero Xtreme 160R) కోసం కంపెనీ ఇప్పటికే టెస్ట్ రైడింగ్ కోసం రిజిస్ట్రేషన్లను అంగీకరించడం ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తుంటే అతి త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బైక్‌ను విడుదలకు ముందే టెస్ట్ రైడ్ చేయాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే గడచిన మార్చ్ నెలలో ఈ సరికొత్త 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్' మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. వాస్తవానికి ఈ మోటార్‌సైకిల్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా దీని విడుదల ఆలస్యమైంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

కాగా.. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారటం, మార్కెట్ సెంటిమెంట్ బలపడటంతో హీరో మోటోకార్ప్ త్వరలోనే ఈ 160సీసీ నేక్డ్ స్ట్రీట్-ఫైటర్ మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికీ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్లను స్వీకరిస్తుండటాన్ని చూస్తుంటే, మరికొన్ని వారాల వ్యవధిలోనే ఇది విడుదల కావచ్చని తెలుస్తోంది.

MOST READ: మతి పోగొడుతున్న కొత్త డుకాటీ పానిగలే వి 4 ఆర్ : ధర & ఇతర వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటారుసైకిల్‌లో ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 160సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టందా 8,000rpm వద్ద 15bhp శక్తిని మరియు 6,500rpm వద్ద 14Nm ల గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా.. భారత మార్కెట్లో ఇదే అత్యంత వేగవంతమైన 160సీసీ మోటార్‌సైకిల్ కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ బైక్ కేవలం 4.7 సెకన్లలోనే గంటకు 0 - 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌ను EICMA 2019లో కంపెనీ ప్రదర్శించిన బ్రాండ్ ఎక్స్‌ట్రీమ్ 1.R కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. ఈ మోటార్‌సైకిల్‌లో ఆకర్షనీయంగా ఉండే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంటుంది, రెండు చివర్లలో దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉంటే టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. అలాగే బ్లాక్డ్-అవుట్ (నలుపు రంగులో ఉండే) టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సాలిడ్ ఎగ్జాస్ట్‌తో ఈ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

MOST READ: రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర డిజైన్ అంశాలను గమనిస్తే.. ఇందులో డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్, సింగిల్-పీస్ సీట్, రియర్ ఫెయిరింగ్‌లో విలీనం చేయబడిన రియర్ గ్రాబ్-రైల్స్ మరియు రెండు చివర్లలో రిఫ్లెక్టర్ రిమ్స్ టేప్ ఉంటాయి. ఇంకా ఇందులో కన్వెన్షనల్ అప్‌రైట్ హ్యాండిల్ బార్‌ ఉంటుంది, ఇది చాలా సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో రైడర్‌కు కావల్సిన సమాచారాన్ని అందించే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

మోటారుసైకిల్‌పై సస్పెన్షన్ డ్యూటీలను ముందు భాగంలో 37 ఎమ్.ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఏడు-దశల సర్దుబాటు చేయగల మోనో-షాక్ సెటప్‌లు నిర్వహిస్తాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో ముందు వైపు 276 ఎమ్.ఎమ్ మరియు వెనుక వైపు 220 ఎమ్.ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో సింగిల్-ఛానల్ ఎబిఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది.

MOST READ: RTO వాహన రిజిస్ట్రేషన్లను రీస్టార్ట్, ఎక్కడో తెలుసా !

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది, అవి - సింగిల్-డిస్క్ మరియు డబుల్ డిస్క్ వేరియంట్స్. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ అందిస్తున్న డ్యూయల్-టోన్ కలర్ (వైట్ / గ్రే, బ్లూ / గ్రే మరియు స్పోర్ట్స్ రెడ్ / గ్రే) ఆప్షన్ల నుండి కొనుగోలుదారులు తమకు నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

మార్కెట్లో విడుదలైన తర్వాత ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఈ సెగ్మెంట్లోని సుజుకి జిక్సర్ 150, యమహా ఎఫ్‌జెడ్ 16, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ భారత మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న మోటారుసైకిల్ విభాగాలలో ఒకటిగా నిలబడనుంది.

MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న ఒకినావా

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్‌ల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ డిజైన్‌తో హీరో మోటోకార్ప్ ఈ సెగ్మెంట్లో మ్యాజిక్ చేయనుందనిపిస్తోంది. హీరో తమ కొత్త బైక్‌తో 160సీసీ సెగ్మెంట్లోని ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా తయారు చేసింది. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ కూడా లుక్స్‌కు సరిపోయే పనితీరుతో వస్తుంది. ఇది యువ కొనుగోలుదారులను తొలిచూపులోనే ఆకర్షించనుంది.

Most Read Articles

English summary
Hero MotoCorp have begun accepting registrations for test riding the Xtreme 160R ahead of its launch in India. Buyers looking to test ride the motorcycle can head over to the brand's official website to register for the test ride. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X