అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

హోండా టూ వీలర్స్ మార్కెట్లోకి సరికొత్త యాక్టివా 6జీ స్కూటర్‌ను విడుదల చేసింది. 5జీ స్థానంలో విపణిలోకి వచ్చిన సరికొత్త హోండా యాక్టివా 6జీ స్కూటర్ ప్రారంభ ధర రూ. 64,912 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మునుపటి జనరేషన్ యాక్టివా 5జీ స్కూటర్‌తో పోల్చుకుంటే కొత్త తరం యాక్టివా 6జీ ధర రూ. 8,000 ఎక్కువగా ఉంది. ఇందులోని ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

హోండా యాక్టివా 6జీ స్కూటర్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, స్టాండర్డ్ మరియు డీలక్స్. యాక్టివా 6జీ డీలక్స్ స్కూటర్ కాస్త ఖరీదైనది, దీని ధర రూ. 65,412 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. సరికొత్త హోండా యాక్టివా 6జీలో ఎన్నో రకాల మార్పులు, కీలక అప్‌డేట్స్ మరియు అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి.

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

సాంకేతికంగా హోండా యాక్టివా 6జీ స్కూటర్లో అదే మునుపటి 109సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. అయితే, ఇది బిఎస్6 అప్‌డేట్స్‌తో వచ్చింది. యాక్టివా 125 మరియు ఎస్‌పి 125 తర్వాత బిఎస్6 అప్‌డేట్స్‌తో హోండా తీసుకొచ్చిన మూడవ మోడల్ యాక్టివా 6జీ.

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త యాక్టివా 6జీ అత్యుత్తమ మైలేజ్ మరియు బెటర్ పవర్ ఇస్తుంది. ఇందుకు ప్రధాన కారణం యాక్టివా 125లో తొలిసారి పరిచయం చేసిన కంపెనీ యొక్క PGM-FI టెక్నాలజీ, ఇది ఇంజన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

హోండా యాక్టివా 5జీతో పోలిస్తే కొలతల పరంగా హోండా యాక్టివా 6జీ చాలా పెద్దగా ఉంటుంది. అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పొడవాటి వీల్‌బేస్ దీనిసొంతం. విశాలమైన సీటు, 18-లీటర్ల స్టోరేజ్ స్పేస్ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

హోండా యాక్టివా 6జీ స్కూటర్‌లో ACG స్టార్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, పాస్ స్విచ్, బయటివైపు ఉన్న ఫ్యూయల్ క్యాప్, 12-ఇంచుల వీల్స్, ముందువైపున కన్వెన్షనల్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున 3-దశలలో అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం ఉన్న సస్పెన్షన్ వంటి ఫీచర్లు వచ్చాయి.

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

హోండా యాక్టివా 6జీ స్కూటర్ ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, బ్లాక్, డాజిల్ యెల్లో మెటాలిక్, పర్ల్ ప్రీసియస్ వైట్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ స్పార్టన్ రెడ్ మరియు గ్లిటర్ బ్లూ మెటాలిక్. యాక్టివా 6జీ ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమయ్యింది, జనవరి చివరికల్లా డెలివరీ ప్రారంభిస్తామని తెలిపారు.

అమేజింగ్ ఫీచర్లతో హోండా యాక్టివా 6జీ లాంచ్: ధర ఎంతో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో హోండా యాక్టివా మోస్ట్ పాపులర్ స్కూటర్. 2001లో యాక్టివా స్కూటర్‌ను తొలిసారిగా విడుదల చేసింది. ఇప్పుడు 6జీ కొత్త తరం స్కూటర్ విపణిలోకి వచ్చింది, దాదాపు 20 ఏళ్లుగా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా రాణిస్తోంది.

హోండా యాక్టివా 6జీ మార్కెట్లో ఉన్న టీవీఎస్ జూపిటర్ మరియు హీరో ప్లెజర్ 110 స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Honda Activa 6G Scooter Launched In India: Prices Start At Rs 63,912. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X