Just In
- 56 min ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 1 hr ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 2 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 3 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- News
ఏపీ మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Sports
అక్షర్‌తో హార్దిక్ ఇంటర్వ్యూ.. మధ్యలో దూరి కోహ్లీ ఏమన్నాడంటే? గుజరాతీ భాషలో వీడియో
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Finance
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్‌కు ఏకంగా రూ.12 పెంపు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెప్టెంబర్ 30న హోండా మోటార్‌సైకిల్ సర్‌ప్రైజ్ లాంచ్; ఇంతకీ ఏంటది?
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీన కొత్త హోండా మోటార్‌సైకిల్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, హోండా 'గెట్ రెడీ ఫర్ ఏ మెజెస్టిక్ లాంచ్' మరియు 'యువర్ హైనెస్ ఈజ్ అరైవింగ్ ఆన్ 30 సెప్టెంబర్ 2020' అనే ట్యాగ్‌లైన్‌లతో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

టీజర్‌లో పేర్కొన్న ట్యాగ్‌లైన్స్‌ని బట్టి చూస్తుంటే, హోండా మోటార్‌సైకిల్ నుండి కొత్తగా రానున్న బైక్ చాలా ప్రీమియం మోడల్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. బహుశా ఇది 300సిసి లేదా అంతకంటే ఎక్కువ విభాగంలో విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఒకవేల ఇది ఆల్ట్రా ప్రీమియం మోటార్‌సైకిల్ అయితే, దీనిని ప్రత్యేకంగా బ్రాండ్ యొక్క ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

మార్కెట్ ఊహాగానాల ప్రకారం, కొత్త మోటార్‌సైకిల్ 300 - 500 సిసి విభాగంలో లభ్యమయ్యే క్రూయిజర్ స్టైల్ మోడల్ అని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మరియు జావా వంటి మోటార్‌సైకిళ్లకు ప్రత్యక్ష పోటీనిచ్చే అవకాశం ఉంది.
MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

ఈ కొత్త మోటార్‌సైకిల్ హోండా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న రెబెల్ 300 మోడల్ ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ కొత్త మోటారుసైకిల్‌లో అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ మరియు మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి భారత మార్కెట్‌కు అనుగుణంగా దీనిని మోడిఫై చేసే అవకాశం ఉంది.

హోండా ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన హార్నెట్ 2.0 విషయంలోనూ ఇదే జరిగింది. కొత్త హోండా హార్నెట్ 2.0ను అంతర్జాతీయ మార్కెట్లో హోండా విక్రయిస్తున్న సిబి 190ఆర్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసి, భారత మార్కెట్‌కు అనుగుణంగా అనేక మార్పులతో దీనిని అప్‌గ్రేడ్ చేశారు.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 మోటార్‌సైకిల్‌లో 184సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అంతర్జాతీయ మోడల్‌తో పోల్చితే హార్నెట్ 2.0 లో చేసిన మార్పుల కారణంగా హోండా ఈ మోటార్‌సైకిల్‌ను అత్యంత పోటీ ధరకే విక్రయించేందుకు అవకాశం ఏర్పడింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.1.26 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

హోండా నుంచి కొత్తగా రానున్న ప్రీమియం మోటార్‌సైకిల్ 500 సిసి మోడల్ కావచ్చని కూడా పుకార్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఏంటనేది తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకూ వేచి ఉండాల్సిందే.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవలే అంతర్జాతీయ శ్రేణిలో తమ 500సిసి మోడళ్లను తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. ఈ మోడళ్లలో సిబి500ఎక్స్, సిబిఆర్500ఆర్ మరియు సిబిఆర్500ఎఫ్ ఉన్నాయి.

హోండా కొత్త మోటార్‌సైకిల్ టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత్‌లో హోండా ప్రవేశపెట్టబోయే కొత్త ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ చాలా రహస్యంగా ఉంచింది. ప్రస్తుతానికి ఈ ఉత్పత్తికి సంబంధించి ఊహాగానాలు తప్ప వేరే ఇతర వివరాలు లేవు. ఈ కొత్త మోటార్‌సైకిల్ గురించి మాకు సమాచారం అందిన వెంటనే మీకు తెలియజేస్తాము.
MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి