Just In
Don't Miss
- Sports
ICC T20 Rankings: రాహుల్ ర్యాంక్ పదిలం.. దూసుకెళ్లిన కాన్వే
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ముంబైలో విడుదల కానున్న రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్
ఢిల్లీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రివోల్ట్, దేశంలోని మరిన్న నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో తమ కొత్త ఆర్‌వి400, ఆర్‌వి300 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ప్రారంభంలో భాగంగా, ఈ కంపెనీ ముందుగా తమ ఎలక్ట్రిక్ బైక్‌లను గత ఏడాది ఢిల్లీ, పూణే నగరాల్లో విడుదల చేసింది. ఆ తర్వాత అహ్మదాబాద్, చెన్నై మరియు హైదరాబాద్ నగరాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించింది. రాబోయే వారంలో తమకు ఆరవ నగరమైన ముంబైలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది.

వాస్తవానికి రివోల్ట్ మోటార్స్ ఈ ఏడాది ఏప్రిల్ 2020లోనే ముంబైలో తమ ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసింది. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్‌ల కారణంగా, కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకుంది.
MOST READ: రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో మరో అద్భుతమైన ఫీచర్, ఏంటో తెలుసా?

రివోల్ట్ భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. అవి - ఆర్‌వి300 మరియు ఆర్‌వి400. ఈ రెండు మోటార్‌సైకిళ్ల ప్రారంభ ధర రూ.1.3 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే, రివోల్ట్ నెలవారీ చెల్లింపు పథకం ప్రకారం, ప్రతినెలా రూ.2,999 చెల్లింపుతో ఆర్‌వి300 మోడల్‌ను మరియు రూ.3,999 చెల్లింపుతో ఆర్‌వి300 మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.

రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, ఆర్‌వి300 మోడల్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై ఇది 120 కి.మీ దూరణం ప్రయాణిస్తుంది.
MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టాప్-ఎండ్ మోడల్ అయిన ఆర్‌వి400 మోడల్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై ఇది 156 కి.మీ దూరణం ప్రయాణిస్తుంది.

రివోల్ట్ అందిస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో అనేక ఫీచర్లు, పరికరాలు అమర్చబడి ఉంటాయి. ఇందులో ప్రధానంగా, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ ఉంటాయి. ఇంకా ఉందులో స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది జియోఫెన్సింగ్, వాహన స్థితి, లైవ్ వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
రివోల్ట్ మోటార్స్ క్రమక్రమంగా భారతదేశ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా కంపెనీ విస్తరణ ప్రణాళికలు దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరించేందుకు కంపెనీ సన్నాహలు చేస్తోంది.