Just In
Don't Miss
- Sports
ICC T20 Rankings: రాహుల్ ర్యాంక్ పదిలం.. దూసుకెళ్లిన కాన్వే
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పండుగ సీజన్లో ఒకినావా ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్స్ ఇవే
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒకినావా భారత మార్కెట్లో కొనసాగుతున్న పండుగ సీజన్లో కొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. దేశంలో విక్రయించే అన్ని స్కూటర్ మోడళ్లలో ఆకర్షణీయమైన మరియు తక్కువ ఇఎమ్ఐ ఫైనాన్స్ పథకాలను కంపెనీ అందిస్తోంది.

అంతే కాకుండా కస్టమర్లు బ్రాండ్ యొక్క "ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి" ఫైనాన్స్ పథకం ద్వారా ఇఎమ్ఐ ని కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఆఫర్లను అందించడానికి ఓకినావా AI- ఆధారిత ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జెస్ట్‌మనీతో భాగస్వామ్యం కలిగి ఉంది.

సిబిల్ స్కోరు లేని వినియోగదారులు కూడా ఒకినావా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మరియు ఫైనాన్సింగ్ ఎంపికను పొందటానికి అర్హులు. క్రెడిట్ పరిమితి లేదా ఫైనాన్స్ ఎంపికలను పొందడానికి, వినియోగదారులు జెస్ట్‌మనీ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
MOST READ:కార్ ప్రయాణికులకు లైఫ్‌గార్డ్ అయిన 'సీట్ బెల్ట్' గురించి మీకు తెలియని నిజాలు

ఇన్స్టాల్ చేసుకున్న తరువాత వారు డిజిటల్ కెవైసి విధానాన్ని పూర్తి చేయాలి మరియు కొనుగోలు సమయంలో వారి సౌలభ్యం యొక్క తిరిగి చెల్లించే ప్రణాళికను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ మొట్ట ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

అలాకాకుంటే కస్టమర్లు ఓకినావా వెబ్‌సైట్‌లో స్కూటర్ బుక్ చేసేటప్పుడు ఫైనాన్సింగ్ ఎంపికలను కూడా పొందవచ్చు. ఈ కొత్త ఫైనాన్స్ ఎంపికలు మొత్తం 350 కి పైగా ఒకినావా డీలర్‌షిప్‌లలో లభిస్తాయి.
MOST READ:వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం KSRTC బస్సులు

ఒకినావా ఎండి మరియు కో ఫౌండర్ మిస్టర్ జీతేందర్ శర్మ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా ఆటో పరిశ్రమ చాలా నష్టాలను చవిచూసింది. ఇటీవల కాలంలో సామాజిక దూరం జీవనశైలిలో ఒక భాగంగా మారింది. కరోనా వ్యాపిస్తుందనే భయంతో ప్రజలు ప్రజారవాణాలో తిరగటానికి ఇష్టపడటం లేదు.
ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఎంచుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత వాహనాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇందులో కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్లో గణనీయమైన పెరుగుదలను చూస్తున్నాము. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ఆర్థిక నిర్వహణకు కష్టపడుతున్నప్పుడు, మా కస్టమర్లకు ఫైనాన్స్ కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి వాహనాన్ని ఎంచుకోవడానికి మేము జెస్ట్‌మనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాము అన్నారు.

దీని గురించి జెస్ట్‌మనీ సిఇఒ & కో ఫౌండర్ లిజ్జీ చాప్మన్ మాట్లాడుతూ, "ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు అధికంగా ఉన్న సమయంలో ఒకినావాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. వ్యక్తిగత వాహనాన్ని సొంతం చేసుకోవాలనే వారి కలను సాకారం చేయడానికి మేము సహాయపడుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ ఆర్థిక ప్రణాళికలను ఎంచుకునేటప్పుడు ఈ సర్వీస్ మరింత కీలకం. ఇది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు.
MOST READ:గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా సర్కార్ ; ఈ వెహికల్స్ కొనే వారికీ భారీ ఆఫర్స్

దేశంలో విక్రయించే మొత్తం స్కూటర్స్ పై లిమిటెడ్ టైమ్ ఫెస్టివల్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారులకు వచ్చే నెలలో జరిగే లక్కీ డ్రా కోసం గిఫ్ట్ వోచర్ మరియు ఎంట్రీ కూపన్ ఇవ్వబడుతుంది. దీని గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ స్కూటర్లలో దేనినైనా సొంతం చేసుకోవడానికి సులభమైన మరియు సరసమైన ఎంపికను అందించాలని ఒకినావా లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలన్న వారి కలను సహకారం చేసుకోవడానికి ఈ కొత్త ఫైనాన్స్ పథకాలు సహాయపడతాయి. ఈ కొత్త ఫైనాన్స్ పథకాల వల్ల ఎక్కువ సంఖ్యలో వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉంది.
MOST READ:లైఫ్ స్టైల్ కలెక్షన్ స్టార్ట్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ; ఇందులో ఏముంటాయో తెలుసా?