ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ మోటార్‌సైకిల్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మోడ్రన్ క్లాసిక్ శ్రేణి మోటార్‌సైకిళ్ల కోసం కొత్త పరిమిత-కాల ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్ట్ నెల ఆఫర్లలో భాగంగా, మొత్తం శ్రేణిపై కంపెనీ రూ.61,000 విలువైన ఉచిత యాక్ససరీలను అందిస్తోంది.

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

ట్రైయంప్ బ్రాండ్ లైనప్‌లో ‘బోన్‌విల్' 61 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని, ఇది స్ట్రీట్-ట్విన్ మోడల్‌కు కూడా వర్తిస్తుందని ట్రైయంప్ తెలిపింది. ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2020 మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి.

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

ట్రైయంప్ ప్రస్తుతం దేశీయ విపణిలో తమ బోన్‌విల్ మోడ్రన్ క్లాసిక్ శ్రేణిలో మొత్తం నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో స్ట్రీట్ ట్విన్, బోన్‌విల్ టి100, బోన్‌విల్ టి120 మరియు బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ మోడళ్లు ఉన్నాయి.

MOST READ:డీలర్‌షిప్ చేరుకున్న ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 ఎస్‌యూవీ, డెలివరీ ఎప్పుడంటే

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

పై నాలుగు మోడళ్లలో ఏదైనా మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు వారి కొత్త మోటార్‌సైకిల్‌ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవటానికి కంపెనీ ప్రకటించిన ఉచిత యాక్ససరీస్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రతి మోడల్‌కు ప్రత్యేకమైన యాక్ససరీలను కంపెనీ అందిస్తోంది. బ్రాండ్ లైనప్‌లోని ఇతర మోటార్‌సైకిళ్లతో పోలిస్తే బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ అత్యధిక సంఖ్యలో యాక్ససరీస్‌తో అందించబడుతోంది.

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

ట్రైయంప్ అందిస్తున్న జెన్యూన్ యాక్ససరీస్‌లో ఫంక్షనల్, కాస్మెటిక్ మరియు పెర్ఫార్మెన్స్ అప్‌డేట్స్ వంటివి ఉంటాయి. రియర్ గ్రాబ్ రైల్, లగేజ్ రాక్, పన్నీర్ లగేజ్ బాక్సెస్, రైడర్ మరియు పిలియన్ రైడర్ బ్యాక్‌రెస్ట్, ఇంజన్ బాష్ ప్లేట్ మరియు చైన్ గార్డ్ వంటివి కొన్ని ఫంక్షనల్ యాక్ససరీస్‌గా చెప్పుకోవచ్చు.

MOST READ:కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

కస్టమర్ తమ మోటార్‌సైకిల్‌కు కొంత ప్రత్యేకతను జోడించడానికి కంపెనీ అందిస్తున్న కాస్మెటిక్ యాక్ససరీస్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో వాల్వ్ క్యాప్స్, ఆయిల్ రిజర్వాయర్ క్యాప్, క్లచ్ కవర్లు, బార్-ఎండ్ మిర్రర్స్, బ్లాక్-ఫినిష్డ్ వీల్స్, కలర్ ఫ్లై స్క్రీన్ మొదైలనవి ఉన్నాయి.

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

పెర్ఫార్మెన్స్ అండ్ ఎలక్ట్రికల్ అప్‌గ్రేడ్‌ల విషయానికి వస్తే, ఇందులో కస్టమ్ హెడ్ రింగ్స్, ఎల్‌ఈడి ఇండికేటర్స్, క్రూయిజ్ కంట్రోల్ కిట్, హీటెడ్ గ్రిప్స్, సర్దుబాటు చేయగల క్లచ్ మరియు బ్రేక్ లివర్‌లు మరియు స్మార్ట్‌ఫోన్ హోల్డర్ కిట్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:దుమ్ము రేపుతున్న కొత్త మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్ వీడియో

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

ట్రైయంప్ బోన్‌విల్ సిరీస్‌లో స్ట్రీట్ ట్విన్ కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ మరియు మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.7.45 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఇందులో 900సిసి, పారలల్-ట్విన్ ఇంజను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 65 బిహెచ్‌పి శక్తిని మరియు 3700 ఆర్‌పిఎమ్ వద్ద 80 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

బోన్‌విల్ టి100 మోడల్ కూడా స్ట్రీట్ ట్విన్ మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇది 5900 ఆర్‌పిఎమ్ వద్ద 55 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 3200 ఆర్‌పిఎమ్ వద్ద 80 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మార్కెట్లో దీని ప్రారంభ రూ.8.87 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా).

MOST READ:కొడుకు పరీక్ష రాయించడానికి 105 కి.మీ సైకిల్ పై తీసుకెళ్లిన తండ్రి

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

ట్రైయంప్ మోడ్రన్ క్లాసిక్ లైనప్‌లో బోన్‌విల్ స్పీడ్ మాస్టర్ టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్. ఈ బాబర్ స్టైల్ మోడల్‌ను కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. విపణిలో దీని ప్రారంభ ధర రూ.11.33 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా). ఇందులోని 1200సిసి పారలల్-ట్విన్ ఇంజన్ 79 బిహెచ్‌పి శక్తిని మరియు 107 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ట్రైయంప్ ఆగస్ట్ ఆఫర్స్: బోన్‌విల్ మోడళ్లపై రూ.61,000 ఉచిత యాక్ససరీస్

ట్రైయంప్ బ్రాండ్ లైనప్‌లో బోన్‌విల్ మోడల్ 61 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. బోన్‌విల్ బ్రాండ్ గడచిన 60 ఏళ్ల కాలంలో అనేక మార్పులు చేర్పులను చూసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్ల కూడా దాని చరిత్రను గుర్తు చేసేలా రెట్రో మోడ్రన్ స్టైల్‌లో కనిపిస్తుంటాయి. ఇక ట్రైయంప్ అందిస్తున్న ఉచిత యాక్ససరీలతో కస్టమర్లు ఈ మోడళ్లను తమకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

Most Read Articles

English summary
Triumph Motorcycle India has announced a new limited-time offer for its Modern Classics range of motorcycles in the Indian market. The company is offering the entire range with free accessories worth Rs 61,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X