బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

భారత మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వాహనతయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో ఇటీవల 2021 ఏప్రిల్‌ నెలలో జరిగిన అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ద్విచక్ర వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాలతో సహా మొత్తం 3,89,016 యూనిట్ వాహనాలను అమ్మినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

బజాజ్ ఆటో నివేదిల ప్రకారం గత నెలలో ఒక్క దేశీయ మార్కెట్లో మొత్తం 1,26,579 యూనిట్ వాహనాలను విక్రయించింది. గత నెల అమ్మకాలు, మార్చి నెల అమ్మకాల కంటే 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో, కంపెనీ 2,21,603 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసి 48 శాతం ఎగుమతులను నమోదు చేసింది.

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

ఇక కమర్షియల్ వాహనాల విషయానికి వస్తే, ఏప్రిల్‌లో 39,843 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 1.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో మరియు కరోనా కర్ఫ్యూ సమయంలో అంటే ఏప్రిల్ చివరి 15 రోజుల అమ్మకాలు చాలా తగ్గాయని కంపెనీ నివేదికలో తెలిపింది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల హవా

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

ఇదే విధంగా మార్చిలో కంపెనీ 3.30 లక్షల బైక్‌లను విక్రయించింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో కమపేని మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది. బజాజ్ కంపెనీ ప్రస్తుతం తమ బైక్ మోడళ్లకు అప్డేట్ చేసి విడుదల చేసింది. ఇందులో భాగంగానే కొత్త పల్సర్ 220 ఎఫ్, కొత్త పల్సర్ 150 మరియు కొత్త పల్సర్ 180 వంటి బైకులను అప్డేట్ చేసి విడుదల చేసింది.

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

బజాజ్ గత మార్చిలో ప్లాటినా 100 ఇఎస్ మరియు 100 సిసి ప్లాటినాను కూడా అప్డేట్ చేసింది. అంతే కాకుండా ఇటీవల పల్సర్ 250 బైక్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది పల్సర్ రేంజ్‌లో అత్యంత శక్తివంతమైన బైక్ కానుంది. ఈ బైక్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

పల్సర్ 250 లో పూర్తిగా కొత్త ఇంజిన్ ఉపయోగించబడుతుందని కంపెనీ తెలిపిన నివేదిక ద్వారా తెలిసింది. ఇందులో ఉపయోగించే ఇంజిన్ బ్రాండ్ యొక్క డామినార్ 250 యొక్క ఇంజిన్ తీసుకోబడదు. పల్సర్ 250 యొక్క ఇంజిన్ ఎయిర్-కూల్డ్ అవుతుంది మరియు 4 వాల్వ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉపయోగించబడదు.

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

బజాజ్ ఇటీవల పల్సర్ 150, పల్సర్ 180 మరియు పల్సర్ 220 యొక్క డాగర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్‌లో కొత్త పెయింట్ స్కీమ్స్ మరియు గ్రాఫిక్స్ ఇవ్వబడ్డాయి. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితం పల్సర్ ఎన్ఎస్ 125 ను కూడా విడుదల చేసింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 ఫోర్ కలర్ ఆప్షన్లలో 125 సిసి ఇంజిన్‌తో వస్తుంది.

MOST READ:హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

బజాజ్ ఆటో నివేదికల ప్రకారం ఇటీవల కంపెనీ యొక్క ఆటో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ 'రాహుల్ బజాజ్' తన చైర్మన్ పదవికి వృద్ధాప్య కారణంగా రాజీనామా ఇటీవల చేశారు. రాహుల్ బజాజ్ 1972 నుండి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు మరియు గత ఐదు దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో సంబంధం కలిగి ఉన్నారు.

బజాజ్ ఆటో 2021 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్; వివరాలు

రాహుల్ బజాజ్ రాజీనామా చేసిన తరువాత కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఉన్న 'నీరజ్ బజాజ్' బజాజ్ ఆటోకు కొత్త చైర్మన్ గా నియమితులయ్యారు. ఏది ఏమైనా కంపెనీ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది.

MOST READ:కారులో ఈ ఇంజన్ వార్నింగ్ సైన్స్ విస్మరిస్తే అంతే సంగతులు..

Most Read Articles

English summary
April 2021 Bajaj Auto Sales. Read in Telugu.
Story first published: Monday, May 3, 2021, 14:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X