ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

ప్రముఖ దేశీయ టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో విక్రయిస్తున్న పాపులర్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్ ఇప్పుడు ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఈ బైక్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వార్టర్-మైల్ వీలీ రికార్డును సాధించింది.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

భారతదేశంలో ఫాస్టెస్ట్ క్వార్టర్-మైల్ వీలీ రికార్డును నెలకొల్పినందుకు గాను బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఎఫ్ఎమ్ఎస్‌సిఐ ఇండియన్ నేషనల్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. ఈ పాపులర్ స్ట్రీట్-నేక్డ్ మోటార్‌సైకిల్ కేవలం 23.68 సెకన్లలోనే క్వార్టర్-మైల్ వీలీని పూర్తి చేసి రికార్డు సృష్టించింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైక్‌పై ఈ అరుదైన రికార్డును శ్రుషికేశ్ మాండ్కే ప్రయత్నించారు. ఎఫ్‌ఎంఎస్‌సిఐ (ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా) నుండి వచ్చిన సీనియర్ ప్రతినిధులు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి వచ్చిన ఒక న్యాయాధికారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలో నిరుపయోగంగా ఉన్న రోడ్డుపై ఈ రికార్డ్ ప్రయత్నం జరిగింది. కోవిడ్-19 నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులు అవసరమైన అన్ని ప్రోటోకాల్స్‌ను పాటించారు. హాజరైన ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించారుమరియు రైడర్‌కు అవసరమైన అన్ని భద్రతా పరికరాలు మరియు సేఫ్టీ గేర్లను కూడా అందించారు. మీరు కూడా ఆ రికార్డ్‌ను ఈ క్రింది వీడియోలో చూడండి.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

ఈ రికార్డు సృష్టించడానికి ఉపయోగించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్ పూర్తిగా స్టాక్ కండిషన్‌లో ఉంది. అంటే, ఇది బయట మార్కెట్లో కస్టమర్లు కొనుగోలు చేసే మోడల్ మాదిరిగా ఉంటుంది, ఇందులో ఎలాంటి మార్పులు చేయబడలేదు. కాకపోతే, వీలీ చేసేటప్పు రోడ్డు పాడవకుండా ఉండేందుకు గాను దీని వెనుక మడ్‌గార్డ్ మరియు నెంబర్ ప్లేట్‌లను తొలగించారు.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

ఈ రికార్డును సాధించడంపై శ్రుషికేష్ మాండ్కే వ్యాఖ్యానిస్తూ, తాను మొదటి తరం బజాజ్ పల్సర్‌పై స్టంట్ చేయడం నేర్చుకున్నానని, ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్200తో రికార్డ్ పుస్తకాలలో స్థానం దక్కించుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి అసాధారణమైన మోటారుసైకిల్ విన్యాసాలను చేయటానికి పల్సర్ చాలా విశ్వసినీయమైన మోడల్‌గా ఉంటుందని ఆయన అన్నారు.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

ఇక బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్ విషయానికి వస్తే, ఇందులో కెటిఎమ్ డ్యూక్ 200 నుండి గ్రహించిన 199.5 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.5 బిహెచ్‌పి శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ-లోడ్ డ్యాంపింగ్ కోసం సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మి.మీ డిస్క్‌లు మరియు వెనుక వైపు 230 మి.మీ డిస్క్‌లు ఉంటాయి. ఇది సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌లో ఆఫర్ చేస్తున్న ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అనలాగ్ టాకోమీటర్‌ను కూడా కలిగి ఉంటుంది. క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, చిన్న విండ్‌స్క్రీన్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్, స్ప్లిట్-సీట్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానమైనవి. ఈ మోటారుసైకిల్ బరువు 156 కిలోలు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 168 మి.మీగా ఉంటుంది.

ఫాస్టెస్ట్ క్వార్టర్ మైల్ వీలీ రికార్డును సృష్టించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

కంపెనీ ఇటీవలే తమ పల్సర్ ఎన్ఎస్ మరియు ఆర్ఎస్ రేంజ్ మోటార్‌సైకిళ్లలో కొత్త 2021 వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త పెయింట్ స్కీమ్స్‌తో వస్తున్న ఈ రిఫ్రెష్డ్ మోడళ్లు మునుపటి కన్నా మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి. మార్కెట్లో ఈ కొత్త 2021 మోడల్ ఇయర్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ప్రారంభ ధర రూ.1.31 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Bajaj Pulsar NS200 Sets Fastest Quarter-Mile Wheelie Record In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X