కొత్త Bounce ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎక్కువ & ధర తక్కువ

బెంగళూరుకు చెందిన బౌన్స్ (Bounce) మార్కెట్లో ఎట్టకేలకు బౌన్స్ ఇన్ఫినిటీ E1 (Bounce Infinity E1) స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 'బ్యాటరీతో మరియు బ్యాటరీ లేకుండా' అనే ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, బ్యాటరీ లేకుండా ఉండే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

భారతదేశంలో బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం రూ. 499 తో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2022 మార్చి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 డీలర్‌షిప్‌ల ద్వారా మరియు ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలుదారులకు డెలివెరీ చేయబడుతుంది.

కంపెనీ దేశంలోని ప్రధాన నగరాల్లో తమ డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తున్నట్లు కూడా తెలిపింది. అయితే ఈ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ డిసెంబర్ మధ్య నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. కావున ఈ స్కూటర్ ప్రజారహదారిపైన తిరగటానికి మరెంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ (ఎకో మోడ్‌) పరిధిని అందిస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్‌లో 65 కిమీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటాకు 65 కిమీ/గం వరకు ఉంటుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్పోర్టీ రెడ్, పెర్ల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే మరియు డెసర్ట్ సిల్వర్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. కావున ఈ స్కూటర్‌ను ఏదైనా సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ నుండి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ (0% నుంచి 100%) చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

ఈ స్కూటర్ 83 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. దీనికోసం కంపెనీ ఈ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అందించింది. కంపెనీ దానిలో ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ (EBS)ని ఉపయోగించింది, ఇది బ్రేకింగ్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. ఇది నిజంగా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ హెడ్‌లైట్, 12-లీటర్ బూట్ స్పేస్ మరియు హైడ్రాలిక్ సస్పెన్షన్ మరియు డిజిటల్ స్పీడోమీటర్‌ వంటివి ఉంటాయి.

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో జియోఫెన్సింగ్, డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు యాంటిథెఫ్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేయగల ఇన్ఫినిటీ స్మార్ట్ అప్లికేషన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ స్మార్ట్, రిమూవబుల్ Li-ion బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ అవసరమైనప్పుడు బయటకు తీయవచ్చు మరియు వినియోగదారుని సౌలభ్యం మేరకు దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఇప్పుడు అందిస్తోంది. ఈ ఎంపిక కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

బౌన్స్ తమ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కంపెనీ ఈ సేవలను రిటైల్ కస్టమర్ లకి మాత్రమే కాకుండా దాని విజయవంతమైన రైడ్-షేరింగ్ వ్యాపారానికి కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. బౌన్స్ వినియోగదారులు కంపెనీ యొక్క స్వాపింగ్ నెట్‌వర్క్ సాయంతో పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీని, ఖాళీ బ్యాటరీతో మార్చుకోవచ్చు. అయితే, ఇలా బ్యాటరీని మార్చుకున్నప్పుడల్లా బ్యాటరీ మార్పిడి కోసం కస్టమర్లు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సంప్రదాయ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ ఖర్చులు కూడా సుమారు 40 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

బౌన్స్ దేశంలో తమ సెల్ఫ్-మేడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని అనుమతులను కూడా ప్రభుత్వం నుండి పొందింది. బౌన్స్ ఇటీవలే 22 మోటార్స్ అనే కంపెనీలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 7 మిలియన్ డాలర్లు. 22 మోటార్స్‌తో ఒప్పందంలో భాగంగా, బౌన్స్ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న దాని తయారీ కర్మాగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,80,000 యూనిట్లు.

ఇదిలా ఉండగా, బౌన్స్ దక్షిణ భారతదేశంలో మరో ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా, రాబోయే ఒక సంవత్సరంలో తమ ఈవీ వ్యాపారం కోసం 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు బౌన్స్ ప్రకటించింది.

బౌన్స్ 2022 నాటికి తన ఫ్లీట్ లోని అన్ని స్కూటర్‌ లను ఎలక్ట్రిక్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, బౌన్స్ బెంగళూరు మరియు హైదరాబాద్‌ నగరాల్లో తమ సేవలను అందిస్తోంది. కంపెనీ బెంగళూరులో 22,000 మరియు హైదరాబాద్‌లో 5,000 స్కూటర్లతో రైడ్ బుకింగ్ సేవలను అందిస్తోంది. భవిష్యత్తులో, కంపెనీ ఇతర ప్రధాన నగరాల్లో సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది.

Most Read Articles

English summary
Bounce infinity e1 electric scooter launched in india price features range details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X