విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ డీటైల్స్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మార్కెట్లో, గ్లామర్ ఎక్స్‌టెక్ అనే కొత్త మోటార్‌సైకిల్‌ ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. అయితే ఈ కొత్త మోటార్‌సైకిల్‌ విడుదలకు ముందే దీని గురించి సమాచారం లీక్ అయ్యింది. త్వరలో విఫణిలో అడుగుపెట్టనున్న ఈ కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ అనే అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ డీటైల్స్

కొత్త గ్లామర్ ఎక్స్‌టెక్ 125 సిసి మోటార్‌సైకిల్‌ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ ప్రస్తుతం అమ్ముడవుతున్న గ్లామర్ మోటార్‌సైకిల్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ఇది అప్డేటెడ్ గ్రాఫిక్ డిజైన్స్ మరియు కలర్ వంటి వాటిని కలిగి ఉంటుందని లీకైన ఫోటోల ద్వారా మనకు తెలుస్తుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టిఇసి బైక్ డీటైల్స్

హీరో మోటోకార్ప్ కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ అందించింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటం వల్ల, వాహన వినియోగదారుకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో డేటా మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ వంటి వాటిని అందిస్తుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టిఇసి బైక్ డీటైల్స్

కొత్త గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టెక్నో బ్లాక్, గ్రే బ్లూ మరియు గ్రే రెడ్ కలర్స్. మొత్తానికి ఇది అధునాత లక్షణాలతో చూడటానికి చాలా ఆకాసర్వహించే విధంగా ఉంటుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ డీటైల్స్

ఇక్కడ బయటపడిన ఈ ఫోటోల ప్రకారం గ్లామర్ ఎక్స్‌టెక్ డిజైన్ మరియు ఫీచర్స్ వంటి వాటిని గురించి అవగాహనా కల్పిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క ఇంజిన్ లో చేసిన కొన్ని మార్పులు కూడా ఇక్కడ వెల్లడిస్తాయి. హీరో మోటోకార్ప్ అదే 124.7 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. కానీ ఇది దాని స్టాండ్ర్డ్ మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టిఇసి బైక్ డీటైల్స్

ఈ కొత్త బైక్ లోని కొత్త ఫ్యూయెల్ ఇంజెక్షన్ విధానం గ్లామర్ ఎక్స్‌టెక్ లో మొత్తం ఇంధన సామర్థ్యాన్ని మునుపటి మోడల్ కంటే 2 శాతం మెరుగుపరిచిందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం వెల్లడైన చిత్రాలలో మొత్తం సమాచారం మనకు అందుబాటులో లేనప్పటికీ, లాంచ్ అయ్యే సమయంలో మొత్తం సమాచారం తెలుస్తుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టిఇసి బైక్ డీటైల్స్

ఈ కొత్త బైక్ లోని సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టం వంటి ఫీచర్స్ దాని స్టాండర్డ్ మోడల్ నుంచి తీసుకుంటుంది. కావున ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుంది.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ కలిగి ఉంటుది. అంతే కాకూండా దీనికి కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ సఫోర్ట్ కూడా ఉంటుంది.

విడుదలకు ముందే లీకైన హీరో గ్లామర్ ఎక్స్‌టిఇసి బైక్ డీటైల్స్

హీరో మోటోకార్ప్ భారతదేశంలో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ ను యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించనుంది. ఈ లేటెస్ట్ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. కావున దేశీయ మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అయిన తరువాత ఎలాంటి అమ్మకాలు ఉంటాయో అనేది త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Hero Glamour XTEC Design Features Leaked Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X