Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- News
కోవిడ్ వ్యాక్సిన్ అప్డేట్: ధర, రిజిస్ట్రేషన్, సైడ్ ఎఫెక్ట్స్ - అన్ని ప్రశ్నలకు సమాధానాలు
- Movies
మరణం తర్వాత కూడా తీరని వివేక్ చివరి కోరిక.. అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరపడండి.. హోండా యాక్టివా 125 పై 5000 క్యాష్‌బ్యాక్ ఆఫర్, వారికి మాత్రమే
దేశీయ మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హొండా మోటార్ సైకిల్ ఇండియా ఇప్పుడు తన యాక్టివా 125 స్కూటర్ పై ఇప్పుడు 5000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ఇఎంఐ లావాదేవీలకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఆఫర్ వినియోగదారులకు అందించడానికి హోండా బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ మరియు ఫెడరల్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంకుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల నుండి కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

హోండా యాక్టివా 125 స్కూటర్ ఆన్‌లైన్ బుకింగ్‌లో కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలు చేయబడింది. హోండా యాక్టివా 125 స్కూటర్ స్టాండర్డ్, అల్లాయ్ మరియు డీలక్స్ అనే మూడు మోడళ్లలో ప్రవేశపెట్టారు. ఇందులో ఎంట్రీ లెవల్ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 70,629, అల్లాయ్ ధర రూ. 74,198 మరియు డీలక్స్ మోడల్ ధర రూ. 77,752 వరకు ఉంది.
MOST READ:ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే

హోండా యాక్టివా 125 స్కూటర్ 124 సిసి ఎయిర్-కూల్డ్, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8.14 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ ని కంపెనీ సైలెంట్ ఎసిజి స్టార్టర్ తో కూడా విడుదల చేసింది.

హోండా యాక్టివా 125 స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్ లైట్ ఉన్నాయి. ఇవి స్కూటర్ కి ప్రీమియం లుక్ ఇస్తాయి. స్కూటర్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజిన్ కటాఫ్ సైడ్ స్టాండ్ మరియు మెటల్ బాడీ ఉన్నాయి. స్టాండర్డ్ మోడళ్లలో, ఈ స్కూటర్ స్టీల్ వీల్స్‌తో కూడిన కాంబి బ్రేక్‌లలో వస్తుంది, డీలక్స్ వేరియంట్ అల్లాయ్ వీల్స్‌లో డిస్క్ బ్రేక్‌లను అందిస్తుంది.
MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

ఇటీవల కంపెనీ నివేదిక ప్రకారం హోండా యాక్టివా అమ్మకాలు 25 మిలియన్ యూనిట్లు పూర్తి చేసింది. భారతదేశంలో 20 సంవత్సరాల వ్యాపారంలో కంపెనీ ఈ అమ్మకాల సంఖ్యను సాధించింది. ఈ కొత్త రికార్డ్ తో ఈ స్కూటర్ కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది.

భారతదేశంలో హోండా యాక్టివా స్కూటర్ అమ్మకాలు 2001 లో ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం, 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కంపెనీ తన 20 వ యానివెర్సరీ జరుపుకుంది. యాక్టివా యొక్క 125 సిసి వేరియంట్‌ను హోండా 2014 లో విడుదల చేసింది.
MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

యాక్టివా 125 దేశంలో మొదటి 125 సిసి స్కూటర్. కొత్త డిజైన్ మరియు స్టైల్‌లో పరిచయం చేయబడిన ఈ యాక్టివామార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించగలిగింది. ఈ కారణంగా హోండా యాక్టివా అమ్మకాలు రోజురోజుకి పెరిగాయి.

2015 లో హోండా యాక్టివా, హీరో యొక్క అత్యధికంగా అమ్ముడైన బైక్ హీరో స్ప్లెండర్‌ను అధిగమించి దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా రికార్డ్ సృష్టించింది. అప్పటి నుండి, యాక్టివా అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంతో పాటు అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది.
MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రావడానికి 6 నెలల ముందు 2019 లో కంపెనీ యాక్టివా 6 జి, యాక్టివా 125 ని బిఎస్ 6 ఇంజిన్‌తో పరిచయం చేసింది. ఈ స్కూటర్లకు అనేక కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి. బిఎస్ 6 ఇంజిన్‌తో మైలేజ్ మరియు పనితీరు గణనీయంగా పెరిగాయి.

సైలెంట్ ఎసిజి స్టార్టర్ యాక్టివాలో మొదటిసారి సాధారణ స్టార్టర్ స్థానంలో ఉపయోగించబడింది. దీనితో పాటు, ఐడల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా అందించారు, ఇది ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. యాక్టివా కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు అత్యధికంగా 6 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది.