హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో సమస్యల కారణంగా వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోటార్‌సైకిళ్లలో హోండా సిబి300ఆర్ మరియు హోండా హైనెస్ సిబి350 మోడళ్లు కూడా ఉన్నాయి. కంపెనీ వీటిని తమ ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తోంది.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

ఇవే కాకుండా, హోండా హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, సిబి షైన్, యాక్టివా 5జి మరియు 6జి మరియు యాక్టివా 125 తో సహా అనేక ఇతర మోడళ్లను కూడా కంపెనీ రీకాల్ చేసింది. నవంబర్ 2019 నుండి జనవరి 2021 మధ్యలో తయారైన వాహనాల్లో ఈ సమస్యను గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

ఈ కాలంలో తయారైన హోండా టూవీలర్లలో రిఫ్లెక్టర్ల సమస్యను గుర్తించామని, వాటిని ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది. రీకాల్‌కు వర్తించ్ హోండా మోటార్‌సైకిల్స్ ఈ లోపభూయిష్ట పార్ట్ వలన, తమ వాహనాల్లో పెద్ద సమస్యలు ఏవీ తలెత్తబోవని హోండా వివరించింది.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తమ వాహనాల రెగ్యులర్ క్వాలిటీ చెక్‌లో భాగంగా ఈ సమస్యను గుర్తించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ వాహనాల్లో ప్రధానంగా రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లను అమర్చిన స్థానంలో లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

ఈ సమస్య కారణంగా, రాత్రివేళ్లలో రిఫ్లెక్టర్లు తగినంత కాంతితో ప్రకాశించకపోవచ్చు. ఈ రీకాల్‌ను ముందు జాగ్రత్త చర్యగా నిర్వహిస్తున్నామని కంపెనీ తెలిపింది. లోపభూయిష్ట రిఫ్లెక్టర్లను గుర్తించడానికి డీలర్‌షిప్ వద్ద ఇన్వెంటరీ స్కాన్ చేయబడుతుంది.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

కంపెనీ తీసుకున్న ఈ చర్య దాని ఉత్పత్తులు మరియు సేవల నాణ్యత మరియు నిరంతర అభివృద్ధి విషయంలో కంపెనీ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయి. తమ వాహనాలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయో లేదో కస్టమర్లు సులువుగా తెలుసుకోవచ్చు.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

కస్టమర్లు తమ వాహనాలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయో లేదో తెలుసుకోవడానికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఏ) మరియు హోండా బిగ్ వింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. తద్వారా ఈ రీకాల్ కోసం అర్హతను తనిఖీ చేయవచ్చు.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ లోపభూయిష్ట పార్ట్ నెంబర్ 33741KPL902. వినియోగదారులు తమ వాహనానికి సంబంధించిన 17 అంకెల ప్రత్యేక వాహన గుర్తింపు సంఖ్య (విన్) / ఫ్రేమ్ నంబర్‌ను నమోదు చేసి, వివరాలను తెలుసుకోవచ్చు.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

ఇలా విన్ నెంబరును నమోదు చేయటం ద్వారా వారి వాహనం ఈ రీకాల్ ప్రోగ్రాం పరిధిలో ఉందా లేదా అని వారు తెలుసుకోవచ్చు. వాహన రిజిస్ట్రేషన్ కార్డు, భీమా ధృవీకరణ పత్రం మరియు అమ్మకాలు / సేవా ఇన్వాయిస్ వంటి అనేక పత్రాలపై విన్ (VIN) నెంబరును గుర్తించవచ్చు.

హోండా యాక్టివా, షైన్, హార్నెట్ మోడళ్లలో రిఫ్లెక్టర్ సమస్య, రీకాల్!

హోండా డీలర్‌షిప్‌లు ఎస్ఎమ్ఎస్, కాల్స్ మరియు ఇ-మెయిల్స్ ద్వారా ప్రభావిత వాహనాల యజమానులను సంప్రదించడం ప్రారంభించాయి.

రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ రీకాల్‌తో పాటు, హోండా ఇప్పటికే 25 నవంబర్ 2020 నుండి 12 డిసెంబర్ 2020 వరకు తయారు చేసిన సిబి350 యూనిట్ల కోసం స్వచ్ఛంద రీకాల్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. వీటిలో గేర్‌బాక్స్ యొక్క నాల్గవ గేర్ యొక్క కౌంటర్ షాఫ్ట్‌లో ఉపయోగించిన పదార్థం వేరే గ్రేడ్‌ను కలిగి ఉండటమే ఈ రీకాల్‌కు కారణం.

Most Read Articles

English summary
Honda Motorcycle And Scooters India Recalled Activa CB Shine And Hornet Over Faulty Reflector. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X