భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా దేశీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త 2021 హయాబుసాను ఎట్టకేలకు విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ 2021 సుజుకి హయాబుసా ధర 16.40 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు భారతదేశం అంతటా ప్రారంభించబడ్డాయి. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

కొత్త 2021 సుజుకి హయాబుసా మూడు కలర్ అప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోస్ స్పార్క్లీ బ్లాక్ / కాండీ బర్న్ట్ గోల్డ్, మెటాలిక్ మాట్టే స్వోర్డ్ సిల్వర్ / కాండీ డేరింగ్ రెడ్ మరియు పెర్ల్ బ్రిలియంట్ వైట్ / మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ కలర్స్.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ఈ బైక్ భారత మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ ఈ మోటారుసైకిల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ కొత్త హయబుసా మునుపటి కంటే మరిన్ని అప్డేట్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో అప్డేట్ చేయబడిన ఫీచర్స్, డిజైన్, ఇంజిన్ నవీకరణ ఉన్నాయి.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

దాదాపుగా సుజుకి కంపెనీ ఈ బైక్ ని 13 సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసింది. మూడవ తరం హయబుసా తీవ్రమైన మార్పు కారణంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త మోటారుసైకిల్ యొక్క దూకుడు రూపాన్ని మరింత పెంచడానికి సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో సహా కొన్ని మార్పులు ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ఈ 2021 హయబుసాలో ఇప్పుడు ఆల్‌రౌండ్ ఎల్‌ఇడి లైటింగ్ ఉంది. టర్న్-ఇండికేటర్లను ఇప్పుడు ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.

MOST READ:హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ఈ మోటారుసైకిల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అప్డేట్ చేయబడిన ఇంజిన్ ఇప్పుడు తేలికైన పిస్టన్లు, కొత్త కనెక్ట్ రాడ్లు మరియు ఇతర రీ-ఇంజనీరింగ్ అంతర్గత భాగాలను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ఇందులో ఉన్న ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 187.7 బిహెచ్‌పి మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త 2021 హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 299 కిమీ/ గం.

MOST READ:ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

కొత్త హయబుసా అప్డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కూడా అందుకుంటుంది. ఇందులో మూడు ఫ్యాక్టరీల ప్రీ-సెట్స్ మరియు మూడు యూజర్-డిఫరబుల్ మోడ్లు, మూడు పవర్ మోడ్లు, మూడు మోడ్లతో లాంచ్ కంట్రోల్ సిస్టమ్ మరియు క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఆల్ఫా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 10 లెవెల్స్ అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త టిఎఫ్‌టి డిస్ప్లే సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

2021 సుజుకి హయాబుసా, అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ చూడటానికి దాదాపుగా దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. మోటారుసైకిల్‌పై సస్పెన్షన్ డ్యూటీలు ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

హయబుసా బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్‌, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మీద 120/70 సెక్షన్ మరియు 190/50 సెక్షన్ టైర్లను ముందు మరియు వెనుక భాగంలో కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

ఈ కొత్త మోటారుసైకిల్ 20-లీటర్స్ సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 2021 హయాబుసా ఇప్పుడు మరింత దూకుడుగా కనిపిస్తోంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో చాలా సేఫ్టీగా ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Suzuki Hayabusa Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X