త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

ఫేమ్ ( ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) II పథకం క్రింద భారత ప్రభుత్వం తాజాగా చేసిన సవరణలతో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఒకినావా ఆటోటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు గరిష్టంగా రూ.17,900 వరకు తగ్గాయి.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

తాజా ధరల సవరణతో బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఓకినావా ఐప్రైజ్ ప్లస్ ధర ఇప్పుడు రూ.99,708 (ఎక్స్-షోరూమ్)కి తగ్గింది. కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి ఈ స్కూటర్ల ధరలు రూ.7,200 నుండి రూ.17,900 మధ్యలో తగ్గాయి. మోడల్ వారీగా కొత్త, పాత ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Model Earlier Now Reduction
iPraise+ ₹1,17,600 ₹99,708 ₹17,892
Praise Pro ₹84,795 ₹76,848 ₹7,947
Ridge+ ₹69,000 ₹61,791 ₹7,203
త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ భారత సర్కార్ ఫేమ్ ( ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో ఫేమ్ ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ కొనసాగుతోంది. ఈ ఫేమ్ IIలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు భారత ప్రభుత్వం ఆయా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో సబ్సిడీని అందిస్తుంది.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

ఇక ఒకినావా ఐప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్. గత కొన్ని నెలల్లో స్కూటర్‌కు డిమాండ్ మూడు రెట్లు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌లో పోర్టబుల్ బ్యాటరీకి జతచేయబడిన 1 కిలోవాట్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

సింగిల్ చార్జ్‌పై ఒకినావా ఐప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 160 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుందని (క్లెయిమ్ చేయబడిన రేంజ్) కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 3 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 58 కిలోమీటర్లుగా ఉంటుంది.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

ఒకినావా ఐప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐఓటి టెక్నాలజీని కలిగి ఉంటుంది మరియు బ్రాండ్ యొక్క మొబైల్ అప్లికేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌తో స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయి, వివిధ రకాల ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ట్రాకింగ్, జిపిఎస్ డైరెక్షన్స్ మరియు ఎమెర్జెన్సీ కాంటాక్ట్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో తొలగించగల (రిమూవబల్) లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు, డైరెక్ట్ వాల్ చార్జర్ సౌకర్యం లేని వారు ఈ బ్యాటరీని వేరు చేసి, నేరుగా ఇంటిలో ఉండే పవర్ అవుట్‌లెట్ సాయంతో చార్జ్ చేసుకోవచ్చు.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

ఈ స్కూటర్‌లో లైవ్ ట్రాకింగ్ మరియు జియో ఫెన్సింగ్ ఉంటుంది. దీని సాయంతో ప్రస్తుతం స్కూటర్ ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో రిమోట్ ఇమ్మొబిలైజర్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో, ఒకవేళ స్కూటర్‌ను ఎవరైనా దొంగింలిచినట్లయితే, యాప్ సాయంతో రిమోట్‌గా మోటార్ ఆగిపోయేలా చేయవచ్చు.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

ఫేమ్ II పథకం క్రింద ఇటీవల భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్‌లో ప్రోత్సాహకాలను కిలోవాట్‌కు రూ.10,000 నుండి రూ.15,000 పెంచింది. ఈ ప్రోత్సాహకాలు 50 శాతం పెరిగడంతో, వాహన తయారీదారులు కూడా తమ ప్రస్తుత ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి.

త్వరపడండి: ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.17,900 తగ్గింపు

తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర:

ఇదిలా ఉంటే, దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్' ధరను భారీగా తగ్గింది. ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్‌లో భాగంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.11,250 మేర తగ్గించారు. - దీనికి సంబంధించిన పూర్తి సమచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Okinawa Electric Scooters Price Dropped By Upto Rs 17,900 Due To Fame II Subsidy, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X