అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి విపరీతమైన డిమాండ్ పొందింది. ఇందులో భాగంగానే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ బుకింగ్స్ కూడా పొందింది. అయితే డెలివరీలో కొంత జాప్యం జరిగినప్పటికీ, ప్రస్తుతం డెలివరీలు మొదలైపోయాయి. ఇప్పటికే బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాల్లో డెలివరీలు జరిగాయి. కానీ ఈ స్కూటర్ల నాణ్యత మరియు తయారీ లోపాల కారణంగా చాలా మంది వినియోగదారులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఓలా S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను పొందిన వాటి తయారీ లోపాల వల్ల ఎక్కువ అసంతృప్తి చెందుతున్నారు. ఈ కారణంగా ఓలా స్కూటర్ కస్టమర్లు సోషల్ మీడియా వేదికలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్కూటర్‌లో డెంట్‌లు, ఫిట్టింగ్‌లు, ఛార్జింగ్‌లు, ఎల్‌సీడీ ప్యానల్‌ నాసిరకంగా ఉండటం వంటి ఫిర్యాదులు చేస్తున్నారు.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఇవి మాత్రమే కాకుండా కంపెనీ తెలిపిని అధికారిక రేంజ్ కంటే కూడా తక్కువగా ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కార్తిక్ వర్మ అనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ తన కొత్త ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌కు బాడీలో చాలా డెంట్లు మరియు పగుళ్లు ఉన్నాయని కంపెనీకి ఫిర్యాదు చేస్తూ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశాడు.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

అయితే దీనిపైన స్పందించిన కంపెనీ, కొత్త స్కూటర్‌ను భర్తీ చేస్తామని కంపెనీ వారికి హామీ ఇచ్చింది. స్కూటర్‌కు ఎల్‌సీడీ ప్యానల్‌ సరిగా అమర్చకపోవడంతో లోపలికి నీరు ఇంకిపోతుందని కూడా కార్తీక్‌ పిర్యాదు చేసాడు. కార్తీక్ స్కూటర్ రేంజ్ గురించి కూడా ఫిర్యాదు చేశాడు. టెస్ట్ రైడ్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ తో 152 కి.మీల రేంజ్ అందించిందని, అయితే వాస్తవానికి ఈ స్కూటర్ పరిధి 135 కి.మీ మాత్రమేనని అతను చెప్పుకొచ్చారు.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఇది మాత్రమే కాకుండా ఒక కస్టమర్ తన స్కూటర్ 100 శాతం ఛార్జ్‌పై 100 కి.మీ పరిధిని మాత్రమే అందించిందని వాపోయాడు. మరోకొంతమంది కస్టమర్లు కూడా స్కూటర్‌కు ఛార్జింగ్‌లో సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. దీనిపై కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

సిద్ధార్థ రెడ్డి అనే ఓలా స్కూటర్ వినియోగదారుడు 12 గంటల ప్రాంతంలో స్కూటర్‌ను ఇన్‌ఛార్జ్‌గా ఉంచినట్లు రాశాడు. దీని ప్రకారం, స్కూటర్ 4 గంటలకు పూర్తిగా ఛార్జ్ చేయబడాలి, అయితే దాని ఛార్జింగ్‌లో కొంత లోపం ఉంది, స్కూటర్ ఛార్జ్ కాలేదు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా స్కూటర్ నడుపుతున్నప్పుడు ఏదో ఒక వస్తువుతో రుద్దుతున్న శబ్దం వస్తోందని, హెడ్ లైట్ సరిగా పనిచేయడం లేదని కూడా కొందరు కస్టమర్లు చెబుతున్నారు.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్ కేర్ త్వరలో సమస్యను పరిష్కరిస్తామని వినియోగదారులకు హామీ ఇచ్చింది. కావున తమ స్కూటర్లలో ఎలాంటి లోపం ఉన్నప్పటికీ ఎవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, వాటిని త్వరలోనే తప్పకుండా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

Ola Electric తన S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను 2021 ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేసేవారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ కూడా అందుతుంది, కావున సాధారణ ధరకంటే కూడా కొంత తక్కువ ధరకు ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను సెప్టెంబర్‌లో కేవలం రెండు రోజుల పాటు బుక్ చేయడం ప్రారంభించింది. స్కూటర్‌ను బుక్ చేసుకునేందుకు వినియోగదారుల నుంచి నామమాత్రంగా రూ.499 వసూలు చేశారు. రెండు రోజుల్లోనే రూ. 1,100 కోట్లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు ఓలా తెలిపింది.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

అప్పుడే Ola Electric స్కూటర్లపై లెక్కకు మించిన కంప్లైంట్స్.. దేవుడా..!!

Ola కంపెనీ ప్రస్తుతం దాని S1 మరియు S1 ప్రో స్కూటర్‌లను దాని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది, ఇది అధునాతన తయారీ మరియు పరిశ్రమ 4.0 ప్రక్రియలను ఉపయోగిస్తుంది. కంపెనీ తన సాధారణ ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయం లేకుండా నిర్దిష్ట కస్టమర్ అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను సులభంగా మరియు కొద్ది రోజుల్లోనే అనుకూలీకరించవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులో నిర్మిస్తున్న ఫ్యూచర్‌ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతనమైన తయారీ కర్మాగారం.

Most Read Articles

English summary
Ola electric scooter customers complains about issues details
Story first published: Wednesday, December 29, 2021, 9:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X