ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, ఇటీవలే తమ ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన మరో కీలక సమాచారాన్ని కంపెనీ వెల్లడి చేసింది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం, ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లు రూ.499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క వాస్తవిక కొనుగోళ్లు సెప్టెంబర్ 8, 2021వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి. అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ మాత్రం అక్టోబర్ 2021 లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఆసక్తి గల కస్టమర్‌లు వచ్చే అక్టోబర్ నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయవచ్చు. కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టెస్ట్ రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న తర్వాత, కస్టమర్ కోరుకున్న సమయానికి స్కూటర్‌ని నేరుగా వారి ఇంటి వద్దకే టెస్ట్ రైడ్ కోసం పంపించడం జరుగుతుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

సంభావ్య కస్టమర్‌లు ఈ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ముందే, వీటిని టెస్ట్ రైడ్ చేసేందుకు వీలుగా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దేశంలోని వివిధ నగరాల్లో అనుభవ కేంద్రాలను (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను) కూడా ఏర్పాటు చేస్తుంది. అక్టోబర్ 2021 నాటికి ఈ అనుభవ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయని కంపెనీ తెలిపింది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ రైడ్ కోసం బుక్ చేసుకునే వారు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలి. టెస్ట్ రైడ్ కోసం కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకోవడానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు మరియు ఇది పూర్తిగా ఉచితం.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ విపణిలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తోంది. వీటిలో ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రోల మోడళ్లు ఉన్నాయి. ఈ స్కూటర్ల ధరలు వరుసగా రూ.99,999 మరియు రూ.1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఓలా ఎస్1 మొత్తం 5 మ్యాట్ కలర్స్‌లో లభిస్తుంది. కాగా, ఓలా ఎస్1 ప్రో మొత్తం 10 కలర్స్‌లో లభిస్తుంది, వీటిలో 4 గ్లోసీ ఫినిషింగ్ కలర్లు ఉంటాయి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పెర్ఫార్మెన్, రేంజ్ మరియు ఛార్జింగ్ సమయం వంటి అంశాలను పరిశీలిస్తే, ఓలా ఎస్1 లో 2.98kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే, ఇందులో 5.5kW ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 121 కిమీ రైడింగ్ రేంజ్ (ఏఆర్ఏఐ టెస్టెడ్)ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఓలా ఎస్1 ప్రో విషయానికి వస్తే, ఇందులో కూడా 5.5kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కాకపోతే, ఇందులో పెద్ద 3.97kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి చార్జ్‌పై ఇది గరిష్టంగా 181 కిమీ రైడింగ్ రేంజ్ (ఏఆర్ఏఐ టెస్టెడ్)ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఈ రెండు స్కూటర్లలో బ్యాటరీ ప్యాక్ మరియు వాటి రేంజ్‌లు మినహా దాదాపు ఇతర ఫీచర్లు మరియు డిజైన్ కూడా అంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ముందు వైపు సింపుల్ అండ్ క్లీన్‌గా కనిపించే ఫ్రంట్ ఆప్రాన్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన ట్విన్-పాడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇంకా డ్యూయెల్ టోన్ హ్యాండిల్ బార్, బ్లాక్ సైడ్ మిర్రర్స్, మోనోషాక్ ఫ్రంట్ సస్పెన్షన్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

మంచి ట్రెడిషనల్ లుక్ కోసం ఈ స్కూటర్ ఏరోడైనమిక్ బాడీ షేప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో హారిజాంటల్‌గా అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు, స్కూటర్ బాడీలోనే అమరిపోయినట్లుగా ఉండే సైడ్ స్టాండ్ మరియు వెనుక ఫుట్ రెస్ట్‌లు, 36 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రెయిల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బరుతో కప్పబడిన ఫ్రంట్ ఫుట్‌వెల్ మొదలైనవి ఉన్నాయి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలోని కొన్ని హైలైటింగ్ ఫీచర్లను పరిశీలిస్తే, వీటిలో 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, షాట్టర్‌ప్రూఫ్ డిస్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, రిమోట్ బూట్, 4జి, వైఫై, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, రివర్స్ మోడ్ మరియు సౌండ్స్‌తో కూడిన హెచ్ఎమ్ఐ మూడ్స్ మొదలైనవి ఉన్నాయి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

ఓలా ఎస్1 ప్రో స్కూటర్లో పైన పేర్కొన్న ఫీచర్లకు అదనంగా హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇందులోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 3జిబి ర్యామ్, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్మార్ట్ ఫీచర్‌ల కోసం వైఫై, బ్లూటూత్ మరియు 4జి కనెక్టివిటీలో ఇబ్బందులు లేని ఉపయోగం కోసం ఇది బ్రాండ్ యొక్క మూవ్‌ఓఎస్‌ని కలిగి ఉంటుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ ఎప్పుడంటే..?

రెండు స్కూటర్లు కూడా కీలెస్ ప్రాక్సిమిటీ ఎంట్రీ కలిగి ఉంటాయి, ఇది కంపెనీ అందించే 4 యూజర్ ప్రొఫైల్స్ ద్వారా ఎనేబుల్ చేయబడుతుంది. ఇందులోని ప్రతి ప్రొఫైల్ కూడా దాని స్వంత సెట్టింగ్‌లను కలిగి ఉంటుంది. అంటే, ఈ స్కూటర్‌ను స్మార్ట్ ఫోన్ సాయంతో లాక్ / అన్‌లాక్ చేయటం మరియు స్టార్ట్ / స్టాప్ చేయటం చేయవచ్చన్నమాట.

Most Read Articles

English summary
Ola s1 and s1 pro electric scooters test ride timeline revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X