గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రివాల్ట్ ఇంటెలికార్ప్ తమ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే. అయితే, సప్లయ్ కొరత కారణంగా, కంపెనీ గత కొంత కాలంగా ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

కాగా, ఇప్పుడు రివాల్ట్ ఇంటెలికార్ప్ తమ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు జూన్ 18, 2021వ తేదీ నుండి వీటిని బుక్ చేసుకోవచ్చు. రివాల్ట్ ఈ-బైక్స్ కోసం ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ నగరాల్లో ఈ శుక్రవారం నుండి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, రివాల్ట్ అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు దేశంలో భారీ గిరాకీ ఏర్పడింది. దీంతో పాత వాహనాల డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ, కొత్త వాహనాల కోసం బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. పాత బుకింగ్‌ల డెలివరీలు పూర్తికావస్తుండటంతో కంపెనీ ఇప్పుడు కొత్త బుకింగ్‌లను ప్రారంభించింది.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విషయంలో బుకింగ్ తేదీ మరియు డెలివరీ తేదీల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ పనిచేస్తోందని, దీని కోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని కంపెనీ పేర్కొంది. ఇకపై, తమ ఎలక్ట్రిక్ వాహనాలను బుక్ చేసిన తర్వాత, వినియోగదారులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి యొక్క పరిస్థితుల దృష్ట్యా, కంపెనీ రివాల్ట్ ఎలక్ట్రిక్ బైకుల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా కాంటాక్ట్‌లెస్‌గా చేసింది. ఇందుకోసం కస్టమర్లు చేయాల్సిందల్లా రివాల్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడమే. వెబ్‌సైట్‌లో కస్టమర్లు తమ వివరాలను నమోదు చేయటం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

రివాల్డ్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ.95,000 మరియు రూ.1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ప్రస్తుతం భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అవి: ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు చెన్నై.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

ఆసక్తిగల కస్టమర్లు ఈ మోటార్‌సైకిళ్లను ఒకేసారి చెల్లింపు చేసి కొనుగోలు చేయవచ్చు లేదా ఈఎమ్ఐ సదుపాయం ద్వారా నెలవారీ చెల్లింపులు చేస్తూ కూడా కొనుగోలు చేయవచ్చు. వన్-టైమ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసేవారికి అపరిమిత బ్యాటరీ మార్పు సదుపాయం లభిస్తుంది.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇందులో 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

అలాగే, రివాల్ట్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇందులో 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై ఎకో మోడ్‌లో 180 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. కాకపోతే, ఎకో మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 25 కి.మీ మాత్రమే.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లలో సిటీ, ఎకో మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఈ బైక్స్ ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఇది కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇరు చక్రాలపై 240 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

గుడ్ న్యూస్ : రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్స్ పునఃప్రారంభం

రివాల్ట్ ఆర్‌వి300 నియోన్ బ్లాక్ మరియు స్మోకీ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రివాల్ట్ ఆర్‌వి300 మాత్రం రెబెల్ రెడ్ మరియు కాస్మిక్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్లగ్-ఇన్ ఛార్జింగ్, రిమూవబల్ బ్యాటరీ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ స్టేషన్ లేదా బ్యాటరీ యొక్క హోమ్ డెలివరీ వంటి సేవలను కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం అందిస్తోంది.

Most Read Articles

English summary
Revolt Electric Motorcycle Bookings To Reopen From 18th June Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X