35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రివాల్ట్ ఇంటెలికార్ప్ తమ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే. మొదట్లో పూనే, ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఈ బ్రాండ్ ఆ తర్వాతి కాలంలో మరిన్ని కొత్త నగరాలకు తమ సేవలను విస్తరించింది.

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

కాగా, ఇప్పుడు ఈ కంపెనీ తమ యాజమాన్యంలో మార్పులు చేసింది. కొత్త పెట్టుబడిదారుని చొరవతో, దేశంలో కొత్త మరో 35 నగరాలకు తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాటన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ సంస్థతో రివాల్ట్ ఇంటెలికార్ప్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

ఈ భాగస్వామ్యంలో భాగంగా, రాటన్ఇండియా రివాల్ట్ ఇంటెలికార్ప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గణనీయమైన వ్యూహాత్మక వాటాను సొంతం చేసుకుంది. రివాల్ట్ కంపెనీలో 50 శాతం వాటాను రాటన్ఇండియా కొనుగోలు చేసింది. అంతేకాకుండా, రాజీవ్ రాటన్‌ను రివాల్ట్ బోర్డు ఛైర్మన్‌గా కూడా నియమించుకుంది.

MOST READ:కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ తమ వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను కొత్తగా దేశంలోని 35 నగరాల్లో తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఉపయోగించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో తమ కస్టమర్లకు ప్రపంచ స్థాయి కాంటాక్ట్‌లెస్ కొనుగోలు అనుభవాన్ని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

భారత మార్కెట్లో రివాల్ట్ విక్రయిస్తున్న ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ.95,000 మరియు రూ.1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ప్రస్తుతం భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు చెన్నై నగరాల్లో రివాల్ట్ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు అమ్మడువుతున్నాయి. కస్టమర్లు ఈ మోటార్‌సైకిళ్లను ఒకేసారి చెల్లింపు చేసి కొనుగోలు చేయవచ్చు లేదా ఈఎమ్ఐ సదుపాయం ద్వారా కూడా నెలవారీ చెల్లింపులు చేస్తూ కొనుగోలు చేయవచ్చు.

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

వన్-టైమ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసేవారికి అపరిమిత బ్యాటరీ మార్పు సదుపాయం లభిస్తుంది. బైక్ యాజమాన్యానికి సంబంధించిన ఇతర ఖర్చుల విషయానికి వస్తే.. రిజిస్ట్రేషన్ ఖర్చు, భీమా (ఇన్సూరెన్స్), స్మార్ట్ కార్డ్ ఫీజు, 3 సంవత్సరాల పాటు 4జి కనెక్టివిటీ కోసం తప్పనిసరి వన్-టైమ్ పేమెంట్‌లు ఉంటాయి.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

అలాగే, ఈ వన్-టైమ్ పేమెంట్ ప్రణాళికలో 3 సంవత్సరాల మెయింటినెన్స్ మరియు 8 సంవత్సరాలు / 1,50,000 కిలోమీటర్ల వారంటీ చేర్చబడి ఉండదు. చందా ఆధారిత మై రివాల్ట్ ప్లాన్ ద్వారా ఈ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

రివాల్ట్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై ఇది 120 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

MOST READ:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై ఇది 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

35 నగరాల్లో అందుబాటులోకి రానున్న రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్

ఈ రెండు రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో అనేక ఫీచర్లు లభిస్తాయి. వీటిలో ప్రధానంగా, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది జియోఫెన్సింగ్, వాహన స్థితి, లైవ్ వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles

English summary
Revolt Electric Planning To Expand Its Network To 35 Cities, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X