రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫేమ్-II పథకంలో ఇటీవల చేసిన సబ్సిడీ సవరణలతో, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రివాల్ట్ ఇంటెలికార్ప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. జూలై 15, 2021వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి ఈ మోడల్ కోసం బుకింగ్‌లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

గడచిన జూన్ 18వ తేదీన కంపెనీ తమ రివాల్ట్ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 మోడళ్ల కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. అయితే, ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లు ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే అనూహ్యమైన డిమాండ్ రావడంతో కంపెనీ తమ పాపులర్ ఆర్‌వి400 బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

కాగా, ఇప్పుడు రివాల్ట్ తిరిగి తమ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్ కోసం బుకింగ్‌లను రీఓపెన్ చేసింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ నగరాల్లో ఉండే కస్టమర్లు ఈ రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను బుక్ చేసుకోవచ్చు. తాజాగా బుక్ చేసిన రివాల్ట్ ఆర్‌వి400 బైక్‌ల డెలివరీలు సెప్టెంబర్ 2021 నుండి ప్రారంభమవుతాయి.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

ఫేమ్ II సబ్సిడీ సవరణ నేపథ్యంలో, రివాల్ట్ ఇంటెలికార్ప్ అందిస్తున్న ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర భారీగా తగ్గింది. ఈ మోడల్ ధర ఇప్పుడు అదనంగా రూ.28,200 మేర ధర తగ్గింది. తాజా ధరల తగ్గింపు అనంతరం, రివాల్ట్ ఇంటెలికార్ప్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన రివాల్ట్ ఆర్‌వి400 బైక్ ధర రూ.90,799 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

కాగా, కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌పై కంపెనీ ఇప్పటి వరకూ ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు. గత జూన్ నెలలో కంపెనీ తమ బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన రెండు గంటల్లోనే రూ.50 కోట్ల విలువైన రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆర్డర్లను దక్కించుకుంది.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

ఇక, రివాల్ట్ ఆర్‌వి400 విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ బైక్ 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇందులో 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

రివాల్ట్ ఆర్‌వి400 బైక్ కోసం జులై 15వ తేదీ నుండి బుకింగ్స్ రీ-ఓపెన్

రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం కంపెనీ 'మై రివాల్ట్' అనే స్మార్ట్ అప్లికేషన్‌ను కూడా అందిస్తోంది. ఈ యాప్ సాయంతో కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ బైక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు మరియు వివిధ రకాల ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్‌లో బైక్ లొకేటర్, జియో-ఫెన్సింగ్, కస్టమైజబల్ ఎగ్జాస్ట్ సౌండ్ మరియు బ్యాటరీ స్టేటస్‌తో పాటుగా అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి.

రివాల్ట్ ఆర్‌వి400లో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్‌లో దీని రేంజ్ 150 కిలోమీటర్లు, నార్మల్ మోడ్‌లో 100 కిలోమీటర్లు మరియు స్పోర్ట్ మోడ్‌లో 80 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్‌ను బట్టి టాప్ స్పీడ్ మారుతూ ఉంటుంది. ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Revolt RV400 Electric Bike Bookings Will Be Reopened From 15th July 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X