Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న సుజుకి యాక్సెస్ 125 (Access 125) మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 (Burgman Street 125) స్కూటర్లలో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. అయితే, వీటి ధరల్లో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్ ఇప్పుడు 'మెటాలిక్ డార్క్ గ్రీన్‌ఇష్ బ్లూ' మరియు 'మెటాలిక్ మ్యాట్ బ్లాక్' అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

అలాగే, సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్కూటర్ కొత్త 'గ్లోసీ గ్రే' పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది. ఇక సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ ఎడిషన్ మరియు రైడ్ కనెక్ట్ ఎడిషన్‌లు రెండూ కూడా 'గ్లోసీ గ్రే' కలర్ ఆప్షన్‌ను పొందాయి. ఈ కొత్త ఉత్తేజకరమైన కలర్ ఆప్షన్లను ఈ స్కూటర్‌లను మరింత మెరుగ్గా మరియు మరింత ఆకర్షణీయంగా చూపుతాయని కంపెనీ తెలిపింది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

మెటాలిక్ డార్క్ గ్రీన్ బ్లూ షేడ్ చాలా ఉపరితలాలపై ఆకుపచ్చ-నీలం రంగును కలిగి ఉంటుంది. దాని సీటు కాంట్రాస్టింగ్ టాన్ షేడ్‌ను కలిగి ఉంటుంది, అయితే ఫ్లోర్‌బోర్డ్ ప్రాంతం మాత్రం చాక్లెట్ కలర్ నుకలిగి ఉంటుంది. మెటాలిక్ మ్యాట్ బ్లాక్ షేడ్ దాని బ్లాక్-అవుట్ ప్రొఫైల్ మరియు కాంట్రాస్టింగ్ మెరూన్ సీటుతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

నిగనిగలాడే గ్రే పెయింట్ స్కీమ్‌ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇది యువ తరానికి నచ్చుతుంది, ముఖ్యంగా బర్గ్‌మాన్ స్ట్రీట్ విషయంలో ఇది యవ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇంకా ఇందులో సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫీచర్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫీచర్ వలన సైడ్ స్టాండ్ ఆన్ లో ఉంటే, ఇంజన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవడం లేదా స్టార్ట్ కాకపోవడం జరుగుతుంది. ఇది రైడర్ భద్రతను నిర్ధారించే సేఫ్టీ ఫీచర్ గా ఉంటుంది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

ఇటీవలి కాలంలో టూవీలర్లలో ప్రభుత్వం ఈ సేఫ్టీ ఫీచర్ ను తప్పనిసరి చేసింది. సైడ్ స్టాండ్‌లో ఇంటర్‌లాక్ సిస్టమ్ ఉన్నందున, సైడ్ స్టాండ్‌ను తొలగించే వరకు ఇంజన్ ప్రారంభం కాదు. సైడ్ స్టాండ్‌ను తొలగించడం మరచిపోవడం ప్రమాదాలకు దారితీస్తుందనే నిర్ధారణను అనుసరించి కొత్త సంస్కరణను ప్రవేశపెట్టారు. సైడ్ స్టాండ్ అధిక వేగంతో రోడ్డును తాకినప్పుడు అది అసమతుల్యతకు దారితీసి, టూవీలర్ నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

ఇతర మార్పులేవీ లేవు

ఈ రెండు మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్లు మరియు సైడ్-స్టాండ్ ఇంటర్‌లాక్ సిస్టమ్ మినహా వేరే ఇతర మార్పులేవీ లేవు. ఈ రెండు స్కూటర్లు కూడా ఒకే రకమైన 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

ఇందులో మాక్సీ-స్టైల్ డిజైన్‌లో ఉంటే సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్ ను మరింత స్పోర్టియర్ గా కనిపించే యాక్సెస్‌ స్కూటర్ తో పోల్చవచ్చు. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్ లో పూర్తి-డిజిటల్ క్లస్టర్, స్పోర్టీ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు పొజిషన్ లైట్, ఎల్ఈడి రియర్ టెయిల్ లైట్స్, విండ్‌స్క్రీన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు మరియు స్పోర్టీ మఫ్లర్ కవర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

ఇకపోతే, ఈ రెండు స్కూటర్లు కూడా తగినంత అండర్ సీట్ స్టోరేజ్ ను కలిగి ఉండి, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ తో లభిస్తాయి. సుజుకి యాక్సెస్ మరియు బర్గ్‌మాన్ స్ట్రీట్ యొక్క రైడ్ కనెక్ట్ ఎడిషన్‌లు బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌తో అందుబాటులో ఉంటాయి. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా వినియోగదారులు అనేక రకాల స్మార్ట్ ఫీచర్లను తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు.

Suzuki Access మరియు Burgman మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్స్, ధరలో మార్పు లేదు!

ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ లో మిస్డ్ కాల్ అలర్ట్, కాలర్ ఐడి, కాల్ అలర్ట్‌లు, ఎస్ఎమ్ఎస్ మరియు వాట్సాప్ అరెల్ట్, ఓవర్ స్పీడ్ అలర్ట్, ఓటిఏ అప్‌డేట్‌లు, ఫోన్ బ్యాటరీ స్థాయి డిస్‌ప్లే మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి కొన్ని కీలక కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. సుజుకి బర్గ్‌మ్యాన్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ను కంపెనీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Most Read Articles

English summary
Suzuki access 125 and burgman street 125 scooters gets new colour options details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X