మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

ఇటీవలే తమ జిక్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు మరియు యాక్సెస్ 125 స్కూటర్ల ధరలను పెంచిన జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఇప్పుడు తాజాగా తమ ఇంట్రూడర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు కారణంగా ఈ బైక్ ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది.సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అందిస్తున్న ఈ ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ సుజుకి ఇంట్రూడర్ ధరలను రూ.2,100 మేర పెంచారు.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

తాజా ధరల పెంపు అనంతరం ఈ మోటార్‌సైకిల్ ధర రూ.1,26,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకు చేరుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. సుజుకి ఇంట్రూడర్ ధరలో మార్పు మినహా బైక్‌లో ఎలాంటి మార్పులు లేవు.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

ఈ మోటార్‌సైకిల్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లు మునుపటి మాదిరిగానే ఉంటాయి. విశాలమైన హ్యాండిల్ బార్, భారీ ఫ్యూయెల్ ట్యాంక్ కవర్ల్, స్ప్లిట్ సీట్లు, డ్యూయల్ మఫ్లర్ ఎగ్జాస్ట్ మరియు లో-స్లంగ్ డిజైన్‌తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

ఈ మోటార్‌సైకిల్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తుంది. ఇంకా ఇందులో పిలియన్ కంఫర్ట్ కోసం బ్యాక్‌రెస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఎస్ఈపి (సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్) టెక్నాలజీ మరియు ఫ్యూయెల్ ఇంజెక్షన్‌ టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుంది.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్ (ఎస్ఈపి) టెక్నాలజీతో తయారైన ఈ మోటారుసైకిల్‌ను మెరుగైన పనితీరును అందిస్తూనే, మంచి ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. ఇది సింగిల్-ఛానల్ ఏబిఎస్ ఫీచర్‌తో స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్ యూనిట్, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

కొత్త 2020 మోడల్ సుజుకి ఇంట్రుడర్ బిఎస్6 మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / క్యాండీ సొనోమా రెడ్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్ / మెటాలిక్ మ్యాట్ సిల్వర్ మరియు మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్ అనే మూడు రంగులో లభిస్తుంది.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

ఇంజన్ విషయానికి వస్తే, సుజుకి ఇంట్రుడర్‌లో బిఎస్6 కంప్లైంట్ 154.9సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఈ విభాగంలో బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్‌కి పోటీగా నిలుస్తుంది.

మరోసారి పెరిగిన సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర, ఈసారి ఎంతంటే..?

సుజుకి అందిస్తున్న జిక్సర్ లైనప్ మోటార్‌సైకిళ్ల ధరలను కూడా కంపెనీ పెంచింది. ఇందులో 155సిసి మరియు 250సిసి జిక్సర్స్ నేక్డ్ మరియు ఫుల్-ఫేర్డ్ వెర్షన్ల ధలను కంపెనీ పెంచింది. సుజుకి జిక్సర్ 250 మరియు ఎస్ఎఫ్ 250 ధరలు సుమారు రూ.3,500 మేర పెరగగా, ఇందులో 155సిసి వేరియంట్ల ధరలు రూ.2,000 మేర పెరిగాయి. - పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Suzuki Intruder 150 Price Increased By Rs 2100, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X