బ్యాట్రీ స్టోరీ (BattRE Storie) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; ధర రూ.89,600 మరియు రేంజ్ 132 కిమీ!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో ఇ-టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు అనేక కొత్త కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా, రాజస్థాన్ కి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ బ్యాట్రీ (Batt:RE) భారతదేశంలో స్టోరీ (Stor:ie) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో బ్యాట్రీ స్టోరీ (BattRE Storie) ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 89,600 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ ధరలో ఫేమ్-2 పథకం కింద అందించబడుతున్న సబ్సిడీలను చేర్చలేదు.

మార్కెట్లో BattRE Storie ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి ఓ పాత కాలపు క్లాసిక్ స్కూటర్ డిజైన్ ను పోలి ఉంటుంది. పోల్చి చూస్తే, ఇది మనదేశంలో విక్రయించబడుతున్న వెస్పా మరియు బజాజ్ చేతక్ ఈవీ లాంట్ స్కూటర్ల మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 18 కిలోగ్రాముల బరువున్న 3.1kWh తొలగించగల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్ మరియు కంట్రోలర్ యూనిట్ రెండూ కూడా నీరు మరియు ధూళి నిరోధకత కోసం IP65 రేటింగ్ ప్రకారం సర్టిఫై చేయబడ్డాయి.

స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టీవీఎస్ నుండి గ్రహించిన లూకాస్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఇందులోని బ్యాటరీ ప్యాక్ సాయంతో 2 బిహెచ్‌పి నిరంతర శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మోటారు యొక్క గరిష్ట పవర్ మరియు టార్క్ రేటింగ్‌లు వరుసగా 2.68 బిహెచ్‌పి మరియు 20 ఎన్ఎమ్ గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 65 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. స్టోరీ యొక్క ఎలక్ట్రిక్ మోటార్ కూడా దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP67 రేటింగ్ పొందింది.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) చే ధృవీకరించబడిన బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌పై 132 కిలోమీటర్ల పరిధిని అందించగలదని కంపెనీ పేర్కొంది. స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత రోడ్లపై ఇప్పటికే 1 లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించబడిందని మరియు ఇది AIS 156 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని BattRE కంపెనీ తెలిపింది.

కొత్త బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ రెట్రో డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఇందులో అనేక ఆధునిక ఫీచర్‌లు కూడా ఉన్నాయి. స్కూటర్ ముందు వైపున ఉన్న గుండ్రటి హెడ్‌ల్యాంప్ యూనిట్ వెనుక వైపున ఉన్న టెయిల్ లైట్ రెండూ కూడా ఎల్ఈడి లైట్లను కలిగి ఉంటాయి. స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బాడీ ప్యానెల్‌లు మరింత ప్రీమియం అనుభూతిని అందించడానికి మెటల్‌తో తయారు చేయబడ్డాయి మరియు దీని విశాలమైన ఫుట్‌బోర్డ్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది.

మార్కెట్లో BattRE Storie ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

స్కూటర్ ముందు భాగంలో హ్యాండిల్ మధ్యలో ఓ TFT డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది మరియు ఇది బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతో స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ అయి కాల్ నోటిఫికేషన్‌లు మరియు నావిగేషన్ అసిస్ట్‌తో సహా అనేక స్మార్ట్ ఫీచర్‌లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బ్యాట్రీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో ఎకో, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అనే మోడ్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఇందులో పార్కింగ్ మరియు రివర్సింగ్ కోసం కూడా మోడ్‌లు ఉంటాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బ్యాట్రీ స్టోరీ స్పాటిఫై (Spotify) యాప్ కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, ఈ స్కూటర్ యజమానులు ఈ స్ట్రీమింగ్ సర్వీస్‌లో తమకు ఇష్టమైన పాటలను వినొచ్చు.

BattRE Storie ఎలక్ట్రిక్ స్కూటర్ హైలైట్స్:

 • భారతదేశంలో సగర్వంగా తయారు చేయబడిన పూర్తి మేడ్ ఇన్ ఇండియా మోడల్
 • రక్షణ, బలం మరియు మన్నిక కోసం మెటల్ ప్యానెల్స్
 • లూకాస్ టీవీఎస్ మోటార్ (2 kW పీక్ పవర్)
 • బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టిఎఫ్‌టి డాష్‌బోర్డ్
 • కనెక్ట్ చేయడానికి మీ కొత్త మార్గం.
 • ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, రివర్స్ మరియు పార్కింగ్ మోడ్స్
 • నావిగేషన్ అసిస్టెన్స్ మరియు కాల్ నోటిఫికేషన్స్
 • అన్ని మోడ్‌లలో రేంజ్ స్పష్టత కోసం డిస్టెన్స్-టు-ఎంప్టీ డిస్ప్లే (కిమీలలో)
 • ఫాలో-మీ-హోమ్ లైట్స్
 • స్పాటిఫై కంపాటబిలిటీ
 • సౌకర్యవంతమైన రైడ్ కోసం విశాలమైన ఫుట్‌బోర్డ్
 • 3.1 kWh బ్యాటరీ ప్యాక్ మరియు 130 కిమీల కంటే ఎక్కువ రేంజ్
 • ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్
 • గంటకు 65 కిమీ గరిష్ట వేగం
 • కంఫర్ట్ రైడ్ కోసం విశాలమైన సీట్
 • ఫేమ్ 2 ద్వారా ఆమోదించబడినది

కొత్త స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల సందర్భందా, బ్యాట్రీ కంపెనీ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ, "Batt:REలో, తాము ఉత్పత్తి అయినా లేక వినియోగదారుని అనుభవం అయినా రెండింటిలో సంపూర్ణమైన మరియు ఉత్తమమైన వాటిని అందించగలమని నమ్ముతున్నామని, ఈ దిశలో ఒక దృఢమైన అడుగుగా తమను తాము సుస్థిరం చేసుకోవడానికి ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోరీని విడుదల చేస్తున్నామని, ఇది భారతీయ వినియోగదారుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఉన్నతమైన ఇంజనీరింగ్‌తో రూపొందించబడిందని, తమ ఉత్పత్తులు కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లకు నిదర్శనంగా ఉండి, మెరుగైన రేపటి కోసం తయారు చేయబడినవి" అని చెప్పారు.

Most Read Articles

English summary
Battre launches storie electric scooter in india price features specs range
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X