కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఈ నెల 15వ తేదీన ఓలా ఎస్1 (Ola S1) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. నిజానికి గతేడాదే ఓలా ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లు రెండింటినీ విడుదల చేసింది. అయితే, గత కొంత కాలంగా కంపెనీ కేవలం ఎస్1 ప్రో వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు ఓలా ఎస్1 తిరిగి మార్కెట్లో విడుదల చేసింది. కొత్తగా వచ్చిన ఈ 2022 మోడల్ ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మునుపటి కన్నా మరింత మెరుగ్గా తయారైంది.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

మార్కెట్లో ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ప్రస్తుతం విక్రయించబడుతున్న ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్‌కి దిగువన, చవకైన వేరియంట్‌గా విక్రయించబడుతుంది. డిజైన్ పరంగా చూడటానికి ఈ రెండు స్కూటర్లు ఒకేలా ఉన్నప్పటికీ, కంపెనీ వాటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ మరియు అందించే ఫీచర్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. మరి ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లలోని ప్రధాన వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

Ola S1 వర్సెస్ Ola S1 Pro : బ్యాటరీ మరియు రేంజ్

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన 2022 మోడల్ ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది పూర్తి ఛార్జ్‌పై 131 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను (ARAI సర్టిఫైడ్) అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అదే ఓలా ఎస్1 ప్రో విషయానికి వస్తే, ఇది బేస్ వేరియంట్ కన్నా పెద్ద 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది మరియు ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం, పూర్తి చార్జ్ పై 181 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఓలా ఎస్1 ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. కాగా, ఎస్1 ప్రో లో వీటికి అదనంగా హైపర్ అనే హై-స్పీడ్ మోడ్ కూడా ఉంటుంది.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

Ola S1 వర్సెస్ Ola S1 Pro : పనితీరు మరియు ఛార్జింగ్ సమయం

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో మోడళ్ల యొక్క బ్యాటరీ ప్యాక్స్‌లో తేడాలు ఉన్నప్పటికీ, వాటి ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇవి రెండూ కూడా 8.5kW (11.3 bhp) పవర్ మరియు 58 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందించే హైపర్‌డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండింటి టాప్ స్పీడ్స్‌లో మాత్రం తేడా ఉంటుంది. ఓలా ఎస్1 గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లకు పరిమితం కాగా, ఓలా ఎస్1 ప్రో యొక్క గరిష్ట వేగం గంటకు 116 కిలోమీటర్లుగా ఉంటుంది. సాధారణ ఛార్జర్‌తో, ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని ఓలా చెబుతోంది, అయితే ఎస్1 ప్రోలోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

Ola S1 వర్సెస్ Ola S1 Pro : ఫీచర్లు

ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో రెండూ కూడా ఫీచర్-రిచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లే. అయితే, ఎస్1 కన్నా ఎస్1 ప్రోలో కొన్ని ఎక్కువ ఫీచర్లు లభిస్తాయి. ఈ రెండు స్కూటర్‌లు 7.0 ఇంచ్ కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి, ఇది రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రెండు మోడళ్లలోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఓలా మూవ్ ఓఎస్ 2.0 సాఫ్ట్‌వేర్ ను సపోర్ట్ చేస్తుంది.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మొబైల్ ఫోన్ ఛార్జింగ్, మ్యూజిక్ తదితర ఫీచర్లు ఈ రెండు స్కూటర్లలో అందించబడ్డాయి. ఓలా ఎస్1 లోని అన్ని ఫీచర్లు ఓలా ఎస్1 ప్రో లో ఉంటాయి. అయితే, ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మిస్ అయ్యే అంశం ఏదైనా ఉందంటే, అది క్రూయిజ్ కంట్రోల్. ఈ ఫీచర్ సాయంతో రైడర్ తరచూ థ్రోటల్ ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, నిర్ధిష్ట వేగంతో స్కూటర్ ఆటోమేటిక్‌గా రైడ్ అయ్యేలా చేయవచ్చు. కంపెనీ ఈ ఏడాది దీపావళి నాటికి మూవ్ ఓఎస్ 3.0 అప్‌డేట్‌ను తీసుకురానుంది.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

Ola S1 వర్సెస్ Ola S1 Pro : మెకానికల్స్

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఒకే రకమైన ట్యూబ్లర్ ఛాసిస్‌పై ఆధారపడి నిర్మించబడ్డాయి. ఈ రెండు స్కూటర్లలో మెకానికల్స్ చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వీటి ముందు భాగంలో సింగిల్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ యూనిట్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికొస్తే, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కూడా ముందు భాగంలో 220 మిమీ హైడ్రాలిక్ డిస్క్ మరియు వెనుకవైపున 180 మిమీ హైడ్రాలిక్ డిస్క్‌ను కలిగి ఉంటాయి.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు సిబిఎస్ (కాంబి బ్రేక్ సిస్టమ్)ను సపోర్ట్ చేస్తాయి మరియు ఇది స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా ఉంటుంది. అలాగే, రెండు స్కూటర్లలో అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉపయోగించబడ్డాయి. వాటిపై ఇరువైపులా 110/70 - R12 ప్రొఫైల్ తో కూడిన టైర్లు అమర్చబడి ఉంటాయి. కాబట్టి, మెకానికల్‌గా ఈ రెండు మోడళ్లలో ఎలాంటి వ్యత్యాసం లేదు. ప్రధాన వ్యత్యాసం ఎక్కడ ఉంటుందంటే, ఇందులోని బ్యాటరీ ప్యాక్ మరియు అది అందించే రేంజ్ విషయంలో ఉంటుంది.

కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?

Ola S1 వర్సెస్ Ola S1 Pro : ధరలు

కొత్తగా విడుదల చేయబడిన ఓలా ఎస్1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కాగా, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఓలా అధికారిక వెబ్‌సైట్‌లో కస్టమర్లు కొత్త ఎస్1 స్కూటర్‌ను రూ.499 తో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వీటి డెలివరీలను సెప్టెంబర్ 7, 2022 నుండి ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

Most Read Articles

English summary
Comparison between ola s1 and ola s1 pro battery range features and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X