Just In
- 17 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
ఒకే వేదికపై ఐదు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆవిష్కరించనున్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్
2023 లో జరిగే 'ఆటో ఎక్స్‌పో' కోసం ఎంతోమంది వాహన ప్రియులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో విడుదలయ్యే అనేక కొత్త వాహనాలు ఇక్కడ ప్రదర్శించబడతాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోల్ వాహనాలు, చిన్న వాహనాలు పెద్ద వాహనాలు తేడా లేకుండా ఎన్నోన్నో కనిపిస్తాయి.
ఈ 2023 ఆటో ఎక్స్‌పో లో 'గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్' కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో మొత్తం 5 వాహనాలు ఆవిష్కరించడానికి కంపెనీ తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఈ 5 ఎలక్ట్రిక్ వాహనాల్లో 2 టూ వీలర్స్, 3 త్రీ వీలర్స్ ఉన్నాయి. ఈ ఐదు ఎలక్ట్రిక్ వాహనాలు ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయబడి ఉంటాయి.

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ రహదారి పరిస్థితులకు అనుకూలంగా కూడా ఆప్టిమైజ్ చేయబడతాయి. ఇవన్నీ ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ తో పాటు కొత్త టెక్నాలజీలను కలిగి ఉంటాయి. కావున ఇవి తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధిస్తాయని భావిస్తున్నాము. రాబోయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన కొంత సమాచారం కూడా ఇప్పుడు అందుబాలో ఉంది.
కంపెనీ ప్రకారం రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త డిజైన్ కలిగి ఉంటుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా కొత్త టెక్నాలజీలను కలిగి ఉంటాయి. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త గ్రీవ్స్ ఉత్పత్తులు అన్నీ కూడా దాదాపు స్థానికంగా ఉత్పత్తి చేయబడతాయి. అంటే భారతదేశంలో లభించే భాగాలతో (విడిభాగాలతో) ఈ వాహనాలు రూపొందించబడతాయి. వీటి తయారీకి ఇతర పరికరాలు తప్పనిసరిగా అవసరమైన దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 'మేక్-ఇన్-ఇండియా' ప్రేరణతో ముందుకు వెళుతుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. అంతే కాకుండా రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కావున రాబోయే రోజుల్లో ఇంధన వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే స్పష్టంగా తెలుస్తోంది.
దేశీయ మార్కెట్లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వాహనాల ద్వారా కస్టమర్లను ఆకర్శించడానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా తయారైన వాహనాలు (ఎలక్ట్రిక్ వాహనాలు & ఇంధన వాహనాలు), ఇతర వాహనాలకంటే కూడా తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఇది స్థానికంగా ఉత్పత్తి అయిన వాహనాల వల్ల ఉపయోగం. ధరలు తక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కువ మంది ఆ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు, ఆసక్తి చూపుతారు.
ఈ ఆటో ఎక్స్‌పో హ్యుందాయ్ కంపెనీ కూడా తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి చాలా సమాచారం అందించింది. దీన్ని బట్టి చూస్తే రానున్న హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు 2023 ఆటో ఎక్స్‌పో లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఇంక ఎన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. గ్రేటర్ నోయిడాలో 2023 జనవరిలో జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పో లో చాలా కొత్త వాహనాలు విడుదలకావడానికి సిద్ధంగా ఉన్నాయి. 2023 ఆటో ఎక్స్‌పో లో విడుదలయ్యే కొత్త కొత్త వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తప్పకుండా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.