బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

భారత టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పడు అన్ని ప్రధాన టూవీలర్ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

Recommended Video

Hero Eddy Electric Scooter Launch | Details In Telugu

ఇప్పటికే బజాజ్ మరియు టీవీఎస్ కంపెనీలు తమ లైనప్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుండగా, ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనేందుకు దేశపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ కూడా సిద్ధమైంది. అక్టోబర్ 7, 2022న హీరో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

హోండా టూవీలర్ కంపెనీతో జాయింట్ వెంచర్ నుండి విడిపోయిన తర్వాత హీరో మోటోకార్ప్ దేశంలో స్వతంత్ర టూవీలర్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం, హీరో దేశీయ మార్కెట్లో అనేక రకాల స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఇవి హోండా స్కూటర్ల పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో, హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌తో తన లక్‌ను చెక్ చేసుకోవాలని చూస్తోంది. హీరో మోటోకార్ప్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా (VIDA) తమ మొదటి ఉత్పత్తిని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనుంది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మరికొద్ది వారాల్లో వెల్లడి చేయబడుతుంది. మార్కెట్ అంచనా ప్రకారం దీని ధర సుమారు రూ. 1 లక్ష వరకు ఉండొచ్చు. ఓ నివేదిక ప్రకారం, లాంచ్ కోసం కంపెనీ ఇప్పటికే తన డీలర్లు, పెట్టుబడిదారులు మరియు గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్లకు ఆహ్వానాలను పంపింది. ఈ లాంచ్ ఈవెంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరగనుంది. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ మార్కెట్లో తన సత్తా చాటేందుకు తమ సబ్-బ్రాండ్ విడాను జులై 1, 2021వ తేదీన పరిచయం చేసింది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

ప్రస్తుతానికి, రాబోయే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ఇతర ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు. భారతదేశంలో ఈవీ మరియు బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి తైవాన్‌కు చెందిన సంస్థ గోగోరో (Gogoro)తో హీరో మోటోకార్ప్ తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుగానే ప్రకటించింది. గోగోరో ప్రస్తుతం తన 2,000 బ్యాటరీ మార్పిడి పాయింట్ల ద్వారా సుమారు 3,75,000 మంది రైడర్‌లకు సేవలను అందిస్తోంది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. నిజానికి, హీరో మోటోకార్ప్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గడచిన మార్చి 2022 నెలలోనే భారత మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే, సప్లయ్ చైన్ అంతరాయం మరియు వివిధ విడిభాగాల కొరత కారణంగా ఈ ఇ-స్కూటర్ లాంచ్ ఆలస్యం అయింది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

హీరో మోటోకార్ప్ నుండి రాబోయే కొత్త ఇ-స్కూటర్ జైపూర్‌లోని దాని ఆర్ & డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) హబ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)లో అభివృద్ధి చేయబడింది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

చిత్తూరు జిల్లాలోని హీరో మోటోకార్ప్ యొక్క కర్మాగారం పర్యావరణ అనుకూలమైనది మరియు స్థిరమైన తయారీ పద్ధతులను ఉపయోగిస్తుందని, ఇక్కడి ప్లాంట్ లో కంపెనీ బ్యాటరీ ప్యాక్ తయారీ మరియు టెస్టింగ్, వెహికల్ అసెంబ్లీ మరియు వెహికల్ ఎండ్ ఆఫ్ లైన్ టెస్టింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్‌ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియాలంటే, ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

హీరో మోటోకార్ప్ నుండి వస్తున్న రెండు కొత్త బైక్‌లు

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ ఇప్పుడు బడ్జెట్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ నుండి అప్‌గ్రేడ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. కేవలం చవకైన కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను మాత్రమే కాకుండా పెద్ద 300సీసీ ఇంజన్‌తో కూడిన ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. హీరో ఎక్స్‌ట్రీమ్ ఎస్ మరియు ఎక్స్‌పల్స్ లో ఈ పెద్ద ఇంజన్లను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఓ నివేదిక ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పటికే ఈ పెద్ద ఇంజన్ మోటార్‌సైకిళ్లను భారత రోడ్లపై పరీక్షిస్తోంది.

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల

హీరో మోటోకార్ప్ యొక్క ఈ రెండు కొత్త మోటార్‌సైకిళ్లు పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి మరియు అధిక పవర్ అవుట్‌పుట్ కోసం ట్యూన్ చేయబడిన 300సీసీ ఇంజన్‌ను ఉపయోగిస్తాయి. వీటిలో హీరో ఎక్స్‌ట్రీమ్ ఎస్ పూర్తిగా ఫెయిర్డ్ బైక్ అయితే, ఎక్స్‌పల్స్ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ గా ఉంటుంది. టెస్టింగ్ సమయంలో గుర్తించబడిన మోడల్‌లపై పెటల్ డిస్క్ బ్రేక్స్, రెడ్ ట్రెల్లిస్ ఫ్రేమ్, క్లచ్ కవర్, క్రోమ్ ఫినిష్డ్ సైడ్ స్టాండ్ మరియు స్వింగ్‌ఆర్మ్‌తో కూడిన ఫ్రంట్ స్పోక్ వీల్స్‌ మొదలైన డీటేల్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
Hero vida first electric scooter is all set to launch on 7th october details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X