భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఓ సరికొత్త విప్లవానికి తెరలేపిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇప్పుడు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఈవీ విభాగంలో విజయం సాధించిన ఓలా, ఇప్పుడు మన పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లోకి ప్రవేశించింది. నేపాల్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మరియు డెలివరీలు ఈ ఏడాది చివరి నుండి ప్రారంభం కానున్నాయి.

ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. నేపాల్ తర్వాత లాటిన్ అమెరికా, ఏషియన్ మరియు యూరోపియన్ మార్కెట్లలో కూడా తమ స్కూటర్ల విక్రయాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

నేపాల్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం కోసం కంపెనీ నేపాల్‌లోని సిజి మోటార్స్‌తో సహకారాన్ని కుదుర్చుంది. ఈ డీల్‌లో భాగంగా ఓలా తమ Ola S1 మరియు Ola S1 Pro స్కూటర్‌లను స్థానిక పంపిణీదారులుగా భాగస్వామ్యం చేస్తూ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు కంపెనీ తెలిపింది.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

వచ్చే త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు నేపాల్‌లో అందుబాటులో ఉంటాయని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి దశలో నేపాల్ మార్కెట్లో ఈవీలను విక్రయిస్తామని, ఆ తర్వాత రెండవ దశలో, లాటిన్ అమెరికా, ఏషియన్ మరియు యూరోపియన్ యూనియన్‌లలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఐదు అంతర్జాతీయ మార్కెట్‌లలో కంపెనీ ఉనికిని పెంచుకోవాలని చూస్తోందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

"మా అంతర్జాతీయ విస్తరణ అంటే మేము ఒక కంపెనీగా ఇతర ప్రాంతాలలో వినియోగదారులకు సేవలందించగలమని మాత్రమే కాదు, ప్రపంచానికి భారతదేశం ఈవీ విప్లవానికి నాయకత్వం వహిస్తుంది అనేదానికి ఇదొక నిదర్శనం" అని ఓలా వ్యవస్థాపకుడు మరియు సీఈఓ భవిష్ అగర్వాల్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని నిజంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే, భారతదేశం మార్పుకు కేంద్రబిందువు కావాలని ఆయన అన్నారు.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో ఉన్నాయి. గడచిన ఆగస్ట్ 15, 2021వ తేదీన కంపెనీ ఈ రెండు మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు మోడళ్ల డిజైన్ ఒకేలా ఉంటుంది. కాకపోతే, వీటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్ మరియు ఫీచర్లలో స్వల్ప తేడాలు ఉంటాయి. ఓలా ఎస్1 ప్రో మోడల్‌కి వస్తున్న అధిక డిమాండ్ కారణంగా, కంపెనీ కొంత కాలం తర్వాత బేస్ మోడల్ ఎస్1 కోసం బుకింగ్‌లను తీసుకోవడం నిలిపివేసింది. అయితే, ఇటీవలే ఓలా ఎస్1 ను కొత్తగా అప్‌గ్రేడ్ చేసి, బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించింది.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

దేశీయ విపణిలో ఓలా ఎస్1 ప్రారంభ ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ రెండింటిలో తమకు నచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ రూ.499 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి కంపెనీ తదుపరి పర్చేస్ విండో గురించి సమాచారం అందిస్తుంది. ఈ పర్చేస్ విండో ఓపెన్ అయిన తర్వాత కస్టమర్లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి తమ స్కూటర్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత కంపెనీ నేరుగా కస్టమర్ ఇంటికే స్కూటర్ ను డెలివరీ చేస్తుంది.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

కొత్తగా వచ్చిన 2022 మోడల్ ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు పెద్ద మరియు మరింత శక్తివంతమైన 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో పనిచేస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 131 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను (ARAI సర్టిఫైడ్) అందిస్తుంది. రియల్ వరల్డ్ రైడింగ్ కండిషన్స్ లో ఇది పూర్తి చార్జ్ పై 100 కిమీ పైగా ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో విషయానికి వస్తే, ఇది బేస్ వేరియంట్ కన్నా పెద్ద 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది మరియు ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం, పూర్తి చార్జ్ పై 181 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

ఓలా ఎస్1 ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే రైడింగ్ మోడ్‌లను కలిగి ఉండగా, ఓలా ఎస్1 ప్రో లో వీటికి అదనంగా హైపర్ అనే హై-స్పీడ్ మోడ్ లభిస్తుంది. ఈ రెండు ఇ-స్కూటర్లలో బ్యాటరీ ప్యాక్స్‌లో తేడాలు ఉన్నప్పటికీ, వాటి ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇవి రెండూ కూడా 8.5kW (11.3 bhp) పవర్ మరియు 58 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందించే హైపర్‌డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఓలా ఎస్1 టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు కాగా, ఓలా ఎస్1 ప్రో టాప్ స్పీడ్ గంటకు 116 కిలోమీటర్లుగా ఉంటుంది.

భారత్‌లో సక్సెస్ అయింది.. ఇప్పుడు విదేశాలకు పయనమైంది.. గ్లోబల్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

ఇక బ్యాటరీ చార్జింగ్ విషయానికి వస్తే, సాధారణ ఛార్జర్‌తో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అదే, ఓలా ఎస్1 ప్రోలోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా ఛార్జ్ చేయాలంటే సుమారు 6.5 గంటలు పడుతుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో పెద్ద 7.0 ఇంచ్ కలర్ టచ్‌స్క్రీన్ యూనిట్ ఉంటుంది. ఇది బ్లూటూత్ మరియు వైఫై కనెక్టివిటీ సాయంతో రైడర్ యొక్క స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం, ఇది మూవ్ ఓస్ 2.0ను సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే మూవ్ ఓస్ 3.0 అప్‌డేట్‌ను ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) ద్వారా పొందనుంది.

Most Read Articles

English summary
Ola electric enters nepal market ev sales to start by end of 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X