ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

భారతదేశంలో పండుగలు ప్రారంభం కావడం వల్ల చాలా వరకు వాహన తయారీ సంస్థలు తమ వాహనాలపైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇటీవల నవరాత్రుల సమయంలో తమ ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన రూ. 10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మొదట్లో విజయదశమి వరకు మాత్రమే అని తెలిపింది, కాగా ఇప్పుడు ఆ ఆఫర్ ఇప్పుడు పొడిగించినట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ఓలా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం రూ. 10,000 డిస్కౌంట్ రానున్న దీపావళి వరకు కొనసాగుతుందని తెలిపింది. అంటే ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కస్టమర్ల నుంచి సానుకూలమైన స్పందన వస్తున్న కారణంగా ఈ ఆఫర్ కొనసాగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎస్1 ప్రో ధర రూ. 1.40 వరకు ఉంది, కాగా కంపెనీ అందించిన ఈ రూ. 10,000 డిస్కౌంట్ వల్ల దీనిని కస్టమర్లు రూ. 1.30 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ ఆఫర్ కేవలం దీపావళి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆ లోపు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 10,000 డిస్కౌంట్ తో పాటు.. 5 సంవత్సరాల పొడిగించిన వారంటీపై రూ. 1,500 తగ్గింపు కూడా లభిస్తుంది. అంతే కాకుండా S1 ప్రో కోసం లోన్‌ తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ఓలా ఎస్1 ప్రో అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా S1 ప్రో ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 181 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న మూవ్ ఓఎస్2 అప్డేట్ వల్ల మరింత ఎక్కువ పరిధి పొందవచ్చు.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు శక్తినిచ్చే Move OS ఈ సంవత్సరం దీపావళి నాటికి Move OS 3 కి అప్‌డేట్ చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ విధంగా జరిగితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ కూడా పెరుగుతుంది. అంతే కాకూండా Move OS 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో, వినియోగదారులు ఛార్జ్ స్టేటస్, ఓడోమీటర్ రీడింగ్ మరియు ఇతర గణాంకాలను పరిశీలించవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ డీలర్షిప్ లను ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈవీ సెంటర్లను పూణే మరియు చండీగఢ్‌లలో ప్రారంభించింది. ప్రారంభంలో దేశం మొత్తం మీదుగా ఒక్క డీలర్‌షిప్ కూడా లేకుండా నేరుగా కస్టమర్‌లకు డెలివరీ చేసింది.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డీలర్షిప్స్ ప్రారభించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 200 షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీ కంకణం కట్టుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' స్వయంగా వెల్లడించారు. కావున రానున్న రోజులో ఓలా డీలర్షిప్స్ కూడా అందుబాటులో రానున్నాయి.

ఇప్పుడు మరింత తక్కువకే 'ఎస్1 ప్రో' స్కూటర్ కోనేయండి.. ఓలా ఎలక్ట్రిక్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం విజయదశమి మరియు దీపావళి సందర్భంగా కంపెనీలు తమ వాహనాల యొక్క అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి, ఇవన్నీ కూడా తప్పకుండా ఈ పండుగ సీజన్ లో అమ్మకాలను పెంచడానికి తోడ్పడతాయని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Ola electric extended rs 10000 festive discount on s1 pro till diwali details
Story first published: Friday, October 7, 2022, 10:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X