కస్టమర్ల శ్రేయస్సే మా లక్ష్యం.. ఏడాది చివరి నాటికి 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు: ఓలా ఎలక్ట్రిక్

ఏ కంపెనీ అయినా తన ప్రోడక్ట్ లాంచ్ చేస్తే దానికి తప్పకుండా డీలర్‌షిప్ అవసరం. ఇదే విధానాన్ని అన్ని కంపెనీలు పాటిస్తూనే ఉన్నాయి. కానీ ఓలా ఎలక్ట్రిక్ ఈ విధానానికి మొదట్లో స్వస్తి చెప్పింది.

గత కొన్ని రోజులుగా ఒక్క డీలర్‌షిప్ కూడా లేకుండా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు దేశీయ మార్కెట్లో డీలర్‌షిప్‌లను మరియు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను గురించి తెలుసుకుంది.

2022 చివరి నాటికి 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల కోసం ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్ మరియు డీలర్‌షిప్‌ల ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇప్పటికే అక్కడక్కగా డీలర్‌షిప్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కాగా ఈ సంవత్సరం చివరినాటికి కంపెనీ 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కంపెనీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా డీలర్‌షిప్‌లను, ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను తప్పకుండా ప్రారభించాలని కంపెనీ వేగవంతం చేస్తోంది.

మొదట్లో ఒక కస్టమర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసుకోవడానికి కేవలం ఆన్లైన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉండేది. అయితే ఇప్పుడు కొనుగోలుదారులు డీలర్‌షిప్‌లను సందర్శించి కూడా బుక్ చేసుకోవచ్చు, డెలివరీలను చేసుకోవచ్చు. గతంలో హోమ్ డెలివరీ విధానం ద్వారా కొంతమంది కస్టమర్లు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. ఇకపైన అలా జరిగే అవకాశం లేదు.

ఓలా షోరూమ్‌లలో కంపెనీ యొక్క ఎస్1, ఎస్1 ప్రో మరియు ఇటీవల విడుదల చేసిన ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పొందవచ్చు. అయితే కంపెనీ దేశం మొత్తమ్ మీద ఎక్కడెక్కడ తన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభిస్తుంది అనే దాని గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు. కాగా 2023 మార్చి నాటికి దేశం మొత్తం మీద 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించే అవకాశం ఉంది.

ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని ఫీచర్స్ తక్కువగా ఉంటాయి.

ఓలా 'ఎస్1 ఎయిర్‌' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది. ఇది హోమ్ ఛార్జర్ సాయంతో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది.

ఓలా కంపెనీ తన కస్టమర్లకు త్వరితగతిన డెలివరీలను చేయడానికి ఉత్పత్తిని కూడా వేగవతం చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల తన S1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 1,00,000 వ యూనిట్ విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఒక లక్ష యూనిట్ తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా యొక్క ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడింది.

అదే సమయంలో కంపెనీ 2022 అక్టోబర్ నెలలో ఏకంగా 20,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది. ఇది అంతకు ముందు నెల అమ్మకాల కంటే కూడా 60 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే గత నెలలో కంపెనీ అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Most Read Articles

English summary
Ola electric to open 100 dealerships by 2022 december
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X