ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎస్1 మరియు ఎస్1 ప్రో మాత్రమే కాకుండా 'ఎస్1 ఎయిర్' అనే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందటం వల్ల డెలివరీలను సకాలంలో చేయడానికి కొంత ఆలస్యం చేస్తోంది. కాగా ఇటీవల కంపెనీ సీఈఓ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ కంపెనీ సీఈఓ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి అనే విషయాన్ని ఈ కథనంలో చూద్దాం.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ ఇప్పుడు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పారు. అదేమిటంటే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లు కేవలం 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పొందవచ్చు. దీనిని కంపెనీ సీఈఓ స్వయంగా వెల్లడించారు. ఇది వచ్చే వారం నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా, కంపెనీ యొక్క ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. కంపెనీ ఇప్పుడు ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, జైపూర్, లక్నో, పూణే, బెల్గాం, చిత్తూరు, తూర్పు గోదావరి, ఇండోర్, జామ్‌నగర్, కొచ్చి, కొల్హాపూర్, కోజికోడ్, మంగళూరు, నాసిక్, సూరత్, తిరువనంతపురం, త్రిసూర్ మరియు ఉదయపూర్‌ వంటి ప్రాంతాల్లో టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈ టచ్‌పాయింట్‌లను కంపెనీ మరిన్ని ఎక్కువ సంఖ్యలో విస్తరించనుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

కంపెనీ తన కస్టమర్లకు త్వరితగతిన డెలివరీలను చేయడానికి ఉత్పత్తిని కూడా వేగవతం చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల తన S1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 1,00,000 వ యూనిట్ విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఈ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఒక లక్ష యూనిట్ తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా యొక్క ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడింది. అదే సమయంలో కంపెనీ 2022 అక్టోబర్ నెలలో ఏకంగా 20,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది. ఇది అంతకు ముందు నెల అమ్మకాల కంటే కూడా 60 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే గత నెలలో కంపెనీ అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఇదిలా ఉండగా కంపెనీ ఈ మధ్య కాలంలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎస్1 ఎయిర్' లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999. ఓలా 'ఎస్1 ఎయిర్‌' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే తక్కువ ఫీచర్స్ మరియు తక్కువ రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఓలా 'ఎస్1 ఎయిర్‌' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఓలా ఎస్1 ఎయిర్ కేవలం 5 కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి కోరల్ గ్లామ్, నియో మింట్, పోర్సలీన్ వైట్, జెట్ బ్లాక్ మరియు లిక్విడ్ సిల్వర్ కలర్. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్1 మరియు ఎస్1 ప్రో మొత్తం 10 కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్, ఒకినావా మరియు ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే.. 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పక్కా: కంపెనీ సీఈఓ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టినప్పటినుంచి కూడా మంచి ఆదరణ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. అయితే డెలివరీలు చేయడంలో మాత్రం కొంత ఆలస్యం అయింది. అయితే ఇకపైన ఆ ఆలస్యం ఉండే అవకాశం లేదని కంపెనీ సీఈఓ స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రివెస్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ola electric scooter to be delivered within 2 or 3 days of booking says bhavish aggarwal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X