లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ వెహికల్: ధర రూ. 66,999

ఎలక్ట్రిక్ వాహనాలకు దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఆదరణ కారణంగా నాసిక్ బేస్డ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ 'రెవాంప్ మోటోస్' (Revamp Moto's) ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'రెవాంప్ మోటోస్' విడుదల చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పేరు 'ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ' (RM Buddie 25 EV). దీని ధర రూ. 66,999 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయి.

లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ వెహికల్

ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో 48 వి, 25ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 70 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కావున రోజువారీ నగర ప్రయాణానానికి లేదా రద్దీగా ఉండే ప్రయాణాల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది కేవలం 2 గంటల 45 నిముషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. కావున ఛార్జింగ్ విషయంలో వినియోగదారులు ఎలాంటి ఇబ్బందిపడవలసిన అవసరం లేదు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిమీ మాత్రమే, కావున ఈ స్కూటర్ రైడ్ చేయడానికి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు.

ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రైడింగ్ చేయడానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు, కావున తప్పకుండా ఎక్కువ మంది వినియోగించడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇందులో బ్యాటరీ ప్యాక్ సీటు కింద అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఉత్పత్తి మహారాష్ట్రలోని థానేలోని కంపెనీ ఫెసిలిటీలో జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి 'ఇన్స్టెంట్ లోన్స్' మరియు 'నో కాస్ట్ ఈఎమ్ఐ' వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ లాంచ్ సందర్భంగా కంపెనీ సీఈఓ 'ప్రీతేష్ మహాజన్' మాట్లాడుతూ భారతదేశంలో సుదీర్ఘమైన ప్రయాణం తరువాత మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ 'ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ' విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాడ్యులర్ యుటిలిటీ ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. ఇది తప్పకుండా భారతీయ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే హీరో ఎడ్డీ, హాఫ్ లియో మొదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి కాగా ఇప్పుడు ఈ జాబితాలో ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ కూడా చేరింది. నిజానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం 25 కిమీ వరకు మాత్రమే ఉంటుంది, కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను రైడ్ చేయడానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు.

'ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ' పై మా అభిప్రాయం:

భారతదేశంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో వాహన ప్రయాణం అనేది కొంత కష్టంతో కూడుకున్న పని. అలాంటి సమయంలో 'ఆర్ఎమ్ బడ్డీ 25 ఈవీ' ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. రోజు వారీ ప్రయాణానికి వినియోగించడానికి ఈ స్కూటర్ ఖచ్చితంగా సరిపోయే విధంగా కంపెనీ రూపొందించింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Revamp moto buddie 25 ev launched price features and range
Story first published: Monday, December 19, 2022, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X